అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 52: అర్దరాత్రి హౌస్ మేట్స్ ను వణికించిన గంగవ్వ - బుక్కైన టేస్టీ తేజ, అవినాష్ - బిగ్ బాస్ ఫైర్ 

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 డే 52 లో గంగవ్వ అర్దరాత్రి హౌస్ మేట్స్ ను వణికించింది. అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యారు. ఈరోజూ ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి.

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 డే 51లో నామినేషన్ల రచ్చ ముగిసింది. తాజా ఎపిసోడ్ మొదట్లోనే విష్ణు ప్రియ తనను నామినేట్ చేసిన యష్మి గౌడ గురించి నిఖిల్ దగ్గర  కంప్లయింట్ చేసింది. ఆ తర్వాత అవినాష్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా, అందరూ కలిసి ప్రాంక్ చేశారు. ఆ తర్వాత విష్ణు ప్రియ యష్మిని 'నేను నిఖిల్ ని నామినేట్ చేశాను కాబట్టి నన్ను నామినేట్ చేసావా ?' అని ప్రశ్నించింది. దీంతో 'సీరియస్ నామినేషన్ అనిపించలేదు. అందుకే నామినేట్ చేశాను' అని చెప్పింది. 

బిగ్ బాస్ ఫైర్ 
'ఈ వారం మీ షాపింగ్ కి టైం వచ్చేసింది. బిగ్ బాస్ ఇంటి సభ్యుల ప్రవర్తనతో తీవ్రంగా అసంతృప్తి చెందారు. కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు. అందులో మొదటిది ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, రెండవది ఆహారాన్ని వేస్ట్ చేయడం. కిందటి వారం మీ అవసరానికి మించి తీసుకున్నారు. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా వృథా చేశారు. మూడవది బిగ్ బాస్ ఆదేశాలను బేఖాతరు చేయడం. మీరంతా బిగ్ బాస్ ఆదేశాలను బిగ్ బాస్ ఇంట్లోనే పాటించడం లేదు. కాబట్టి ఈ వారం మీ సూపర్ మార్కెట్ షాపింగ్ టైంని బిగ్బాస్ తగ్గిస్తున్నారు' అని ఫైర్ అవుతూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి కూడా నిఖిల్ రేషన్ తీసుకొచ్చాడు

మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ
'ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు బాగుండేది, అందరితో మాట్లడతవ్ నాతో తప్ప' అంటూ అలిగింది యష్మి. 'నా వల్ల నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదు' అని చెప్పి అలిగి వెళ్ళిపోయింది. దీంతో ఆమెను కూల్ చేయడానికి నిఖిల్ పదే పదే హగ్ చేయడం కన్పించింది. మరోవైపు పృథ్వీతో తన రిలేషన్ గురించి డిస్కస్ చేసింది విష్ణు ప్రియ. ఆ తర్వాత తేజ 'ఆ గోల్డ్ నెక్లెస్ ఎక్కడ తీసుకున్నావ్?' అని పృథ్వీని ప్రశ్నించగా, విష్ణు ప్రియా ' గోల్డ్ గోల్డ్ ని వేసుకోవడాన్ని చూడడం ఫస్ట్ టైం' అంటూ ఫ్లర్ట్ చేసింది దీంతో హౌస్ మేట్స్ హిలేరియస్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈ సమయంలోనే 'నేను వెళ్ళిపోతాను' అని అవినాష్ కామెడీగా డైలాగ్ వెయ్యగా, బిగ్ బాస్ నిజంగానే గేట్ ఓపెన్ చేసి పంచ్ వేసాడు. అనంతరం హౌస్ మేట్స్ ఉత్సాహాన్ని చూసి బిగ్ బాస్ అవినాష్ ని జిమ్ ట్రైనర్ గా మార్చారు. ఈ టాస్క్ లో పేక్షకులను బాగా నవ్వించారు. దీంతో బిగ్ బాస్ 2 గంటల సమయాన్ని కిచెన్ టైమర్ కు యాడ్ చేశారు. రేషన్ టైం లో మర్చిపోయిన అతిముఖ్యమైన రేషన్ తో పాటు ఫ్రూట్స్ కూడా పంపారు. 

వణికించిన గంగవ్వ
హౌస్ మేట్స్ మీద తేజ, అవినాష్, గంగవ్వ కలిసి ఒక ప్రాంక్ ని ప్లాన్ చేశారు. అర్థరాత్రి గంగవ్వ దెయ్యంలా భయపెట్టింది. అయితే జోక్ గా చేసిన ఈ ప్రాంక్   అవినాష్, టేస్టీ తేజాలను నామినేషన్ భయంలో ముంచెత్తింది. ఎందుకంటే హౌస్ మేట్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని చాలామంది వణికిపోయారు. ఇంత జరుగుతుంటే నిఖిల్, ప్రీత్వీ మొద్దు నిద్ర పోయారు.  తెల్లవారుజామున కూడా దీని గురించే డిస్కషన్ నడిచింది. 

ఇక ఆ తర్వాత బీబీ రాజ్యం టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగా తమ తమ రాజ్యాన్ని నిర్మించుకోవడానికి కావలసిన వనరులను పెట్టే టాస్క్ ల ద్వారా నిర్మించుకోవాలని సూచించారు. రెండు క్లాన్ లలో ఏ క్లాన్ అయితే రాజ్యాన్ని ఏర్పరచడంలో విజయవంతం అవుతారో వారికి ప్రయోజనం, ఫెయిల్ అయితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. అందులో భాగంగా బిగ్ బాస్ 'నీరు మీరు మధ్యలో అక్వేరియం' అనే టాస్క్ ని పెట్టారు. దీంట్లో రాయల్స్ క్లాన్ విన్ అయింది. దీని కారణంగా వాళ్ళు మంచి నీటి సరస్సును పొంది, దానిపై జెండా పాతారు. ఈ టాస్క్ గెలిచినందుకు రాయల్స్ క్లాన్ లో రోహిణి మెగా చీఫ్ కంటెండర్ కాగా, యష్మి టాస్క్ నుంచి తప్పుకుంది. 'మీ బలగం ముందు నేను మాట్లాడలేను' అంటూ తేజాను పక్కకు పిలిచి హరితేజ మాట్లాడడంతో ఎపిసోడ్ పూర్తయ్యింది.

Read Also : Bigg Boss Telugu season 8 episode 51 review : లవ్ బర్డ్స్ ను విడగొట్టిన ప్రేరణ, యష్మి గౌడ... విష్ణు స్నేక్ అంటూ పృథ్వీకి క్లాస్ - భారీగా ప్రైజ్ మనీ డ్రాప్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
KTR News: కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
The Raja Saab Poster: ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్, మహారాజుగా సర్‌ప్రైజ్ చేసిన రాజా సాబ్
ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్, మహారాజుగా సర్‌ప్రైజ్ చేసిన రాజా సాబ్
Embed widget