Bigg Boss 8 Telugu Day 31 Promo 3: బీటలు వారిన ఫ్రెండ్షిప్, చీఫ్ కోసం గాసిప్ గర్ల్స్ కొట్లాట - మణికంఠకు యస్మి గౌడ వార్నింగ్
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ప్రోమో 3 రిలీజ్ అయ్యింది. అందులో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్ వచ్చినట్టుగా కన్పించింది. మరి ప్రోమోలో ఉన్న హైలెట్స్ ఏంటో చూద్దాం పదండి.
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ నాలుగు వారాల్లో జరిగినట్టుగానే ఈ వారం కూడా హౌస్ లో చీఫ్ పదవి స్థానానికి పోటీ పెట్టారు బిగ్ బాస్. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా చీఫ్ పదవి కోసం కొట్టుకోవడానికి రెడీ అయినట్టుగా కనిపించింది. ముఖ్యంగా గాసిప్ గర్ల్స్ గా పేరు తెచ్చుకున్న అమ్మాయిల గ్యాంగ్ సపరేట్ అవుతున్నట్టుగా అనిపించింది. మొత్తానికి చీఫ్ టాస్క్ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లెక్కలు మార్చే పనిలో పడ్డారు. ఇదంతా తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు డే 31 ప్రోమో 3లో జరిగింది. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ప్రేరణ వర్సెస్ నైనిక
ప్రోమో మొదట్లోనే ప్రేరణ, నైనిక మధ్య జరిగిన గొడవను చూపించారు. ప్రేరణ తనను బ్లాక్ చేస్తుంది అంటూ ఆరోపించింది నైనిక. అయితే 'నోటికి వచ్చింది మాట్లాడకు' అంటూ గట్టిగానే ఫైర్ అయింది ప్రేరణ. దీంతో నైనిక కూడా 'నువ్వు బ్లాక్ చేస్తావ్ ఏమో అని అన్నాను.. ఫస్ట్ విని మాట్లాడు' అంటూ ఫైర్ అయింది. ఆ తర్వాత ప్రేరణ, విష్ణు ప్రియ చీఫ్ రేసులో ఉండగా.. యష్మి గౌడ ఎప్పటిలాగే '8 మందిని కంట్రోల్ చేయాలి అంటే వారికి గట్టిగా చెప్పే ఒక లీడర్ ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నాను' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి ఫేవరెటిజం చూపించింది.. ఆ తర్వాత నైనిక వర్సెస్ కిరాక్ సీత చీఫ్ రేసు లోకి రాగా... ఇద్దరూ తాము చీఫ్ అవ్వడానికి కాన్ఫిడెంట్ గా ఉన్నామని తమ వెర్షన్ వినిపించారు. అయితే ఇద్దరిలో నుండి ఒకరిని తొలగించే అవకాశం విష్ణు ప్రియకే వచ్చింది. దీంతో తాను నైనికకు సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పడంతో సీత 'నేను టాస్కుల్లో అందరికీ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశానని అంటున్నావా ?' అంటూ విష్ణు ప్రియను రివర్స్ అయ్యింది. అయితే విష్ణు ప్రియ 'నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింత బాగా ఆలోచిస్తే బాగుండేది' అంటూ ముక్కు సూటిగానే చెప్పింది. దీంతో సీత సైలెంట్ గా చీఫ్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తానికి బిగ్ బాస్ విష్ణు ప్రియ, కిరాక్ సీత మధ్య కాస్త గ్యాప్ పెంచారు.
ఎండింగ్ హైలెట్
ప్రోమో ఎండింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. ఇదే టాస్క్ లో మణికంఠ, యష్మి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా ప్రోమో 2లో చూపించారు. తాజాగా ప్రోమో 3 ఎండింగ్ లో యష్మి గౌడ 'నన్నే రేసు నుంచి తప్పించావ్ కదా.. చూసుకుందాం' అంటూ వార్నింగ్ ఇచ్చిన రేంజ్ లో మాట్లాడింది. ఇంతకీ ఈవారం చీఫ్ ఎవరు అవుతారు? మరి నెక్స్ట్ వీక్ నామినేషన్ల వరకు లెక్కలు ఎలా మారబోతున్నాయి అనే విషయం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను చూడాల్సిందే.
Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే