Bigg Boss Telugu 8 Day 31 - Promo 2: చీఫ్ పదవి కోసం చీప్‌గా గొడవ... నాగ మణికంఠ విషయంలో యష్మి గౌడ కొత్త శపథం
Bigg Boss 8 Telugu Promo Today: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 31 లేటెస్ట్ ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. అందులో యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య జరిగిన వివాదం హైలెట్ గా నిలిచింది.
Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 డే 31కి సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వగా, హౌస్ మేట్స్ మధ్య చీఫ్ కోసం చీప్ గా గొడవ జరిగింది. పైగా యష్మి గౌడ మరోసారి నాగమణికంఠ విషయంలో ఫైర్ అవుతూ కొత్త శపథం చేసింది. ప్రోమోలో ఏం జరిగిందో చూసేద్దాం పదండి.
వైల్డ్ కార్డు ఎంట్రీ అనౌన్స్మెంట్
ప్రోమో మొదట్లో బిగ్ బాస్ మాట్లాడుతూ 'మీరు మీకు ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేయలేకపోయారు. కాబట్టి 8 వైల్డ్ కార్డు ఎంట్రీస్ మీ మీదకి తుఫానుల దూసుకు రాబోతున్నాయి. తుఫానును ఆపాల్సిన సమయం వచ్చేసింది' అని చెప్పి హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టేసారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ యాక్షన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పప్పీల కోసం పరిగెడుతూ కనిపించారు. అయితే ఈ టాస్క్ చీఫ్ కోసం పెట్టినట్టుగా ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది.
చీప్ కోసం చీప్ గా గొడవ
బిగ్ బాస్ 'పప్పిని చివరగా పప్పీ హౌస్ లోకి తీసుకొచ్చిన సభ్యులు, అలాగే పప్పీ మెడలోని ట్యాగ్ మీద పేరున్న సభ్యులు డేంజర్ జోన్ మీద నిలబడాల్సి ఉంటుంది' అని చెప్పారు. అయితే యష్మి గౌడ మణికంఠ పేరు ఉన్న పప్పిని పట్టుకుని కనిపించింది. ఆమె మాట్లాడుతూ 'చీఫ్ గా ఛాన్స్ మళ్లీ వస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది' అని రిక్వెస్ట్ చేసింది. వెంటనే మణికంఠ 'నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ చీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావా ?' అని ప్రశ్నించాడు. ఆ తర్వాత యస్మి గౌడ మాట్లాడుతూ 'నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు అంటూ బయటకు గెంటేయడం ఎంతవరకు కరెక్ట్?' అని ప్రశ్నించింది. కానీ నాగ మణికంఠ ఆమె మాటని ఏ మాత్రం వినిపించుకోకుండా 'యష్మి అవుట్ ఆఫ్ ది రేస్ బిగ్ బాస్' అని ప్రకటించాడు.
Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే
యస్మి గౌడ వర్సెస్ మణికంఠ
యష్మి గౌడ, మణికంఠ పక్కపక్కనే నిలబడగా పృథ్వీ మాట్లాడుతూ 'చీఫ్ కి విన్నింగ్ క్వాలిటీ ఉండాలి' అని తన ఆలోచనలను చెప్పాడు. 'ఎందుకు? విన్ అయితేనే చీఫ్ అవ్వాలా?' అని నాగ మణికంఠ ప్రశ్నించగా, 'అవును' అని కూల్ గా సమాధానం చెప్పాడు పృథ్వీ అతను యష్మిని చూజ్ చేసుకోగా మణికంఠ 'నాకు అర్థమైంది' అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనిపించింది. ఇక 'కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావ్ పృథ్వీ' అంటూ యష్మి గౌడ మళ్ళీ రెచ్చగొట్టడం మొదలు పెట్టింది. 'దట్స్ ఓకే హౌస్' అని నాగమణికంఠ హౌస్ లో చిచ్చు పెట్టాడు. వెంటనే సీత వచ్చి 'నీ పప్పీని యష్మి తెచ్చింది. నువ్వు యష్మితో ఫైట్ చేయాలి, హౌస్ తో కాదు. అందరూ నీకోసం ఆడతారు నీ గురించే ఆలోచిస్తారు' అంటూ అతనిపై ఫైర్ అయింది. మణికంఠ వినిపించుకోకుండా 'ఎవరైనా ఇటువైపు వాళ్ళు, అటువైపు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు నేను మిడిల్ లో ఉన్నవాడిని కచ్చితంగా..' అంటూ ఏదో చెప్పబోయాడు. అంతలోనే నైనిక 'ఇలాంటి పదాలు ఎందుకు యూజ్ చేస్తావు' అంటూ మండిపడింది. యష్మి గౌడ 'నీకు ఈ హౌస్ లో చీఫ్ అయ్యే అర్హత లేదు' అనగానే, మణికంఠ 'ఏదో ఒక రోజు చీఫ్ అయ్యి చూపిస్తాను' అంటూ రెచ్చగొట్టాడు. ఇంకేముంది యష్మి గురించి తెలిసిందే కదా.. 'ఎలా అవుతావు నేను చూస్తాను' అంటూ తన స్టైల్ లో ఆటిట్యూడ్ చూపించింది.
Read Also: అవమానంగా భావించింది అందుకే - లడ్డూ వ్యవహారంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్