Bigg Boss 8 Telugu Day 29 Promo: సత్తా లేదా? నిఖిల్, నైనికాను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్... కోపంతో చేతులు కాల్చుకున్న ఆదిత్య ఓం
Bigg Boss 8 Telugu Promo Today: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే 29కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో నాగ మణికంఠ, నిఖిల్, ఆదిత్య ఓం హైలెట్ గా నిలిచారు.
బిగ్ బాస్ సీజన్ 8 ఐదవ వారం నామినేషన్ ప్రాసెస్ ఈ రోజు జరగబోతోంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ ప్రసారం కాక ముందే బిగ్ బాస్ ప్రోమోల ద్వారా నామినేషన్ల హీట్ ని పెంచేస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రోమో రిలీజ్ కాగా, తాజాగా రెండో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ రెండు ప్రోమోలను గమనిస్తే హౌస్ మేట్స్ అందరూ నిఖిల్, నైనికలనే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. తాజా ప్రోమోలో ఏముందో చూసేద్దాం పదండి.
ఇతనికే నోటి దూల... నోరు జారిన విష్ణు ప్రియ
ప్రోమో మొదట్లోనే నిఖిల్ 'ఒకరికి చెబుతున్నప్పుడు ఫన్ గా అనిపిస్తుంది. కానీ ఆ మాటలు వదిలినప్పుడు హర్టింగ్ గా అనిపిస్తుంది" అని అన్నాడు నిఖిల్. అయితే అతను విష్ణును ఉద్దేశించి అన్నాడా? లేక కిరాక్ సీతను ఉద్దేశించి అన్నాడా? అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు. ఆ తర్వాత విష్ణు ప్రియ 'ఇతనికే నోటి దూల ఉంది. నాకెలా చెబుతున్నాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్' అంటూ నవ్వింది. ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి 'మన నిర్ణయం మనమే తీసుకోవాలి' అంటూ నైనికను నామినేట్ చేసినట్టుగా చూపించారు. వెంటనే నైనిక 'నేను, నిఖిల్ అన్న ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాము' అనే లోపే ఆదిత్య 'నేను అదే చెప్పాను. నా పాయింట్ ప్రూవ్ అయింది' అంటూ కాస్త ఆవేశపడ్డాడు. ఆ తర్వాత నిఖిల్ 'ఎగ్స్ టాస్క్ ఉన్నప్పుడు నాకు చీఫ్ అవసరం లేదు. నేను తర్వాత అవుతా అని అన్నావు' అంటూ విష్ణు ప్రియను నామినేట్ చేశారు. దీంతో వెంటనే విష్ణు ప్రియ 'నేను కావాలనుకుంటే బెస్ట్ అవుతాను. లేదంటే లేదు' అని సమాధానం చెప్పింది. వెంటనే నిఖిల్ 'కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పుడు నువ్వేం చేసావు అనే దాన్ని లెక్కలు కట్టి నామినేట్ చేస్తారు' అని చెప్పగా... 'చేసుకుంటే చేసుకోమ్మా ఐ డోంట్ కేర్' అంటూ కూల్‌గా సమాధానం చెప్పింది.
The battle for survival just got personal! 💥 Contestants are playing on each other’s insecurities, making confidence the ultimate target in this week’s nominations!#BiggBossTelugu8 #StarMaa @DisneyPlusHSTel @iamnagarjuna pic.twitter.com/NluySZEq1j
— Starmaa (@StarMaa) September 30, 2024
సత్తా లేదన్న మణికంఠ.. చేతులు కాల్చుకున్న ఆదిత్య
ఆ తర్వాత నాగ మణికంఠ వచ్చేసి 'ఏరా నువ్వు వెళ్తావా? అన్నప్పుడు నువ్వు హెడ్ నాట్ చేశావు' అని చెప్పాడు. వెంటనే నిఖిల్ 'నేను హెడ్ నాట్ చేయలేదు. నవ్వేసి తలదించుకున్నాను' అని చెప్పాడు. కానీ నాగ మణికంఠ వదిలి పెట్టకుండా 'నువ్వు ఎలా చేశావో చెప్పు' అనగా... 'నేను యాక్టింగ్ చేయడానికి ఇక్కడికి రాలేదు' అని సమాధానం చెప్పాడు. దీంతో నిఖిల్, నాగ మణికంఠ మధ్య వాగ్వాదం జరిగింది. 'నేనేం చేశానో చూపించే సత్తా నాకుంది. నువ్వేం చేసావో చూపించే సత్తా నీకు లేదా' అంటూ ఫైర్ అయ్యాడు నాగ మణికంఠ.
ఆ తర్వాత ప్రేరణ ఆదిత్య ఓంను టార్గెట్ చేస్తూ '10 పాయింట్లు మంచివి చెప్పి, లాస్ట్ కి నెగిటివ్ చెప్తే అది లాస్ట్ అయిపోతుంది' అంటూ కంప్లీట్ చేసే లోపే... ఆదిత్య కూల్ గా 'ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పాలా ఎందుకు? ఇక్కడ ఉన్న పర్సన్స్ ఏమన్నా విలన్సా ?' అని ఇచ్చి పడేసాడు ప్రేరణకి. 'నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను. నెక్స్ట్ వారం ఉన్నా కూడా ఇలాంటి ఆటిట్యూడ్ తోనే ఆడతాను' అని చెప్పగా 'మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు' అంటూ నామినేట్ చేసి పారేసింది ప్రేరణ. దీంతో ఆదిత్య ఓం తన నామినేషన్‌ను ఒప్పుకోను అంటూ ఆ మంటల్లో కాలిపోతున్న ఫోటోను తీయడానికి ట్రై చేశాడు. ఈ ప్రయత్నంలో ఆయన చేయి కాలిందా? లేదా? అనేది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాలి.