Bigg Boss 8 Telugu Day 26 Promo: ఆహారం కోసం హౌస్ మేట్స్ తంటాలు... ఫన్నీగా సాగిన కొత్త టాస్క్, బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూశారా?
బిగ్ బాస్ సీజన్ 8లో మరో రెండు వారాల్లో హౌస్ లోకి అడుగు పెట్టనున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపడానికి తెగ కష్టపడుతున్నారు కంటెస్టెంట్స్. తాజాగా బిగ్ బాస్ గెస్ ద సౌండ్ అనే టాస్క్ పెట్టారు.
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షో తాజాగా 26వ రోజుకు చేరుకుంది. దీనికి సంబంధించిన మొదటి ప్రోమో రిలీజ్ కాగా అందులో కంటెస్టెంట్స్ కడుపు నింపుకోవడానికి ఫన్నీ టాస్క్ ఆడడం చూడొచ్చు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి పెట్టిన టాస్క్ ఏంటి? ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఫుడ్ కోసం గెస్ ది సౌండ్స్ టాస్క్
కూటి కోసం కోటి కష్టాలు అన్నట్టుగా సాగుతోంది బిగ్ బాస్ 8. దాన్నే బిగ్ బాస్ హౌస్ లో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. తాజా ప్రోమో మొదలుకాగానే బిగ్ బాస్ మాట్లాడుతూ "మీరు ఆహారం నిల్వ చేసుకునే టైం వచ్చేసింది. ఎవరు, ఎంత ఎక్కువగా నిలువ చేసుకోగలరు అనేది మీరు చేసే పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు. అందులో భాగంగా 'గెస్ ది సౌండ్స్' అనే టాస్క్ పెట్టి, కొన్ని సౌండ్స్ లో వినిపించారు. వాటిని వరుసగా విని గుర్తు పెట్టుకుని అదే క్రమంలో రాయాల్సి ఉంటుంది కంటెస్టెంట్స్. ముందుగా శక్తి క్లాన్ నుంచి నిఖిల్, మణికంఠ, కాంతారా క్లాన్ నుంచి ప్రేరణ, నైనిక పెన్ను పాడ్ పట్టుకుని సిద్ధమైపోయారు. అందులో నబిల్ సంచాలక్ గా కనిపించాడు. బిగ్ బాస్ సౌండ్స్ మొదలు పెట్టగానే వరుసగా రూస్టర్, ఫైర్ వర్క్, ఎలిఫెంట్, గోట్ చేసే సౌండ్స్ వినిపించారు. దీంతో నలుగురూ కలిసి రాయడం స్టార్ట్ చేశారు. కానీ నిఖిల్ మధ్యలో అయోమయానికి గురి కావడంతో పాటు పక్క చూపులు చూసి అందరిని నవ్వించాడు. దీంతో వెంటనే నవీన్ వచ్చి 'ఎందుకు పక్కన వాళ్ళకు చూపిస్తున్నావ్' అంటూ బోర్డ్ ఎవ్వరికీ కన్పించకుండా దాచాలని చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రిజల్ట్స్ చూపించగా, ప్రేరణ తను రూస్టర్ కరెక్ట్ గా రాసానంటూ ఎగిరి గంతేసింది. కానీ అక్కడ ఫైర్ వర్క్స్ ప్లేస్ లో ప్రేరణ గన్ అని రాయడంతో నబిల్.. మణికంఠ, ప్రేరణ ఇద్దరికీ జీరో మార్క్స్ ఇచ్చాడు.
గాడిద అంటూ మణికంఠను ఆటపట్టించిన కంటెస్టెంట్స్
ఆ తర్వాత ఇదే గేమ్ లో విష్ణు ప్రియ వర్సెస్ సోనియా, కిరాక్ సీత వర్సెస్ యష్మి గౌడ ఆడారు. ఇంతకు ముందులాగే బిగ్ బాస్ మళ్లీ పలు సౌండ్స్ వినిపించారు. ఆ తర్వాత "సీత మంకీ, గాడిద ఎలా అరుస్తాయో చెప్పండి" అంటూ కిరాక్ సీతను బిగ్ బాస్ అడిగాడు. కానీ సీత వింతగా సౌండ్ చేసి, ఆ తర్వాత నా వాయిస్ కూడా గాడిద వాయిస్ లాగే ఉంటుంది బిగ్ బాస్" అంటూ కామెంట్ చేసింది. వెంటనే మణికంఠ సేమ్ గాడిద లాగే సౌండ్ చేయడంతో పర్ఫెక్ట్ అంటూ అందరూ నవ్వేశారు. అయితే విష్ణు ప్రియ, ప్రేరణ మాత్రం 'నువ్వు గాడిదవే' అంటూ ఆట పట్టించారు. మొత్తానికి ప్రోమో మొత్తం ఫుల్ ఫన్ గా సాగింది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు? ఏ టీం ఎంత రేషన్ సొంతం చేసుకుంది ? అనే విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.