అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 19 - Promo: అందరికీ ప్రాబ్లం ఆ ఒక్కడే... గెట్ అవుట్ అంటూ గేట్లు ఓపెన్ చేసి హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్

Bigg Boss 8 Telugu Promo Today: తాజాగా రిలీజ్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 19 ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ నిలబెట్టి కడిగేశారు. ఆ ప్రోమోలో ఏముందో ఓ లుక్కేద్దాం పదండి.

ఈ వారాంతంలో బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గొడవలు, బూతులు, తన్నుకోవడం, కొట్టుకోవడం, జుట్టు పీక్కోవడం ఒకటేంటి ఎన్నెన్నో వింతలు జరిగాయి. అయితే ఇంత జరుగుతున్నా బిగ్ బాస్ సైలెంట్ గా చూస్తూ ఊరుకున్నాడు తప్ప ఒక్కరిని కూడా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ దాదాపుగా ఫిజికల్ అయ్యారు. హౌస్ లో ఫిజికల్ దాడికి తావు లేదు అని చెప్పే బిగ్ బాస్ ఈ టాస్క్ విషయంలో మాత్రం నోరు మెదపకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా హౌస్ మేట్స్ కి ఇలాంటి టాస్కులు ఇవ్వడం ఏంటి అని ఫైర్ అవుతున్న వారితో పాటు హౌస్ మేట్స్ కూడా కూడా కొత్త ప్రోమో ద్వారా సమాధానం చెప్పారు. డే 19 కు సంబంధించిన ప్రోమోలో అసలు ఏముందో తెలుసుకుందాం పదండి. 

అందరికీ అతనొక్కడే టార్గెట్... 
హౌస్ లో రెండు క్లాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే నిఖిల్ క్లాన్లో ఉన్న పృథ్వీ ఆవేశంతో ఆట ఆడడం అనేది అవతలి టీంకు అస్సలు నచ్చట్లేదు. యష్మి గౌడ, ప్రేరణ కంబం, అభయ్ నవీన్, నబిల్ తో సహా అందరూ పృథ్వి ఆట తీరుపై కామెంట్స్ చేస్తున్నట్టుగా కనిపించింది తాజా ప్రోమోలో. అంతే కాకుండా వాళ్ళను కేరింగ్ గా చూసుకునే సోనియా "పృథ్వీ నువ్వు ఆవేశ పడుతున్నావు. కంట్రోల్లో ఉండు అని కంట్రోల్ చేయడం మానేసి పోరా పోయి ఆడు అని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్?" అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక నబిల్ కూడా "గేమ్లో ఒకలాగా, మానవత్వంలో ఒకలాగా ఉండరు.. తప్పది" అంటూ సోనియా గురించి చెప్పాడు. ఇక అభయ్ "మనీ మీదకు పృథ్వి ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చాడు. వాళ్లకి ధమాక్ లేదు.. ఒకనికి ఒక రూల్ ఇంకొకరికి రూల్ లేకుండా ఇదేం పనికిమాలిన గేమ్ నాకు అర్థం కావట్లేదు" అంటూ మళ్ళీ బిగ్ బాస్ పై నోరు జారాడు. 

Read Also : Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ

కంటెస్టెంట్స్ కు బిగ్ వార్నింగ్
ఆ తర్వాత నిఖిల్, మణికంఠ మధ్య ఎమోషనల్ డిస్కషన్ నడిచింది. నిఖిల్ తను గేమ్ ఎలా ఆడాడో వివరించబోతే మణికంఠ "ఒక ఫ్రెండ్ గా చెప్పాలనుకుంటున్నా. వినాలి అనుకుంటే విను లేకపోతే లేదు. నీలో ఆ యాంగిల్ ని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్న అంటూ మళ్ళీ కంటతడి పెట్టుకున్నాడు. తర్వాత సీన్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని నిలబెట్టి "ఈ సీజన్లో క్లాన్స్ అనేవి చాలా ముఖ్యమైన భాగం. ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు" అంటూ గేట్లు ఓపెన్ చేయడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. అయితే ఇది కచ్చితంగా అభయ్ కి ఝలక్ ఇవ్వడానికి చేసిన పనే అని అనిపిస్తోంది.

Read Also : Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget