X

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ లో ఎవరు ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. టాప్ 5 లో ఎవరు ఉంటారో అంచనా వేయొచ్చు.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటివరకు 89 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలవ్వగా.. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో.. వారు నేరుగా టాప్ 5లోకి వెళ్లిపోతారు. ఇప్పుడైతే హౌస్ లో మానస్-కాజల్-సన్నీ ఒక గ్రూప్. ప్రియాంక కూడా వాళ్ల గ్రూప్ లో ఒక మెంబర్ అనే అనుకుంటుంది కానీ అలా ట్రీట్ చేయడం లేదు. సిరి-షణ్ముఖ్ ఒక గ్రూప్ గా ఆడుతున్నారు. శ్రీరామ్ సోలో గేమ్ ఆడుకుంటున్నాడు. రవి అండ్ కో వెళ్లకముందు శ్రీరామ్ కూడా గ్రూప్ లోనే ఉండేవాడు. 

ఇప్పుడు వీరి ఏడుగురిలో ఫైనల్స్ లో ఎవరు ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. టాప్ 5 లో ఎవరు ఉంటారో అంచనా వేయొచ్చు. 

సన్నీ : 'ఉంటే ఉంటా.. పీకితే పీకుతా' అనే యాటిట్యూడ్ తో గేమ్ ఆడుతున్నాడు సన్నీ. తన మాటలు, యాక్షన్స్, కామెడీ ఇవన్నీ కూడా అతడికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేశాయి. హౌస్ లో సన్నీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోయాడు. అతడిని నామినేట్ చేస్తే.. ఆ ఎఫెక్ట్ తమపై ఎక్కడ పడుతుందో అని ఈ వారం సన్నీని ఎవరూ నామినేట్ కూడా చేయలేదు. సోషల్ మీడియాలో సన్నీకి ఉన్న ఫాలోయింగ్, అతడి క్రేజ్ చూస్తుంటే కచ్చితంగా అతడు టాప్ 5లో ఉంటాడనేది కన్ఫర్మ్. సన్నీ ఫ్యాన్స్ అయితే కప్పు కూడా అతడికే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

శ్రీరామ్ : హౌస్ లో శ్రీరామ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. ఇప్పుడు అతడు టాప్ 5లో ఉన్నాడనే విషయం లీకైంది. రెండు రోజులుగా శ్రీరామ్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. అతడి గేమ్స్ అన్నీ కూడా సన్నీనే ఆడుతున్నాడు. అతడు 'టికెట్ టు ఫినాలే' గేమ్ లో ముందుకు సాగడానికి కారణం కూడా సన్నీనే. అయితే ఇప్పుడు ఏకంగా టాప్ 5 లో శ్రీరామ్ ఉన్నాడనే విషయం బయటకు పొక్కింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీరామ్ పై పాజిటివిటీ బాగా పెరిగింది. వేరే కంటెస్టెంట్ సపోర్టర్స్ కూడా శ్రీరామ్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 

షణ్ముఖ్: టాప్ 5లో ఎవరున్నా..? లేకపోయినా..? షణ్ముఖ్ మాత్రం ఉంటాడనే విషయం క్రిస్టల్ క్లియర్. మొదటి నుంచి కూడా షణ్ముఖ్ గేమ్ ఆడినా.. ఆడకపోయినా.. అతడికి ఓట్లు ఎంతమాత్రం తగ్గలేదు. యూత్ లో షణ్ముఖ్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో నామినేట్ అయిన ప్రతీసారి సేవ్ అయిపోతూ వచ్చాడు. అతడు ఫినాలేలో ఉండాలని జనాలు కోరుకుంటున్నారు కాబట్టి అతడి బెర్త్ కన్ఫర్మ్. 

ప్రియాంక : ఫినాలే ప్రియాంక అంటే ఛాన్స్ లేదనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా ఆమె ప్రవర్తన హౌస్ మేట్స్ తో పాటు జనాలను కూడా ఇరిటేట్ చేస్తుంది. గేమ్ అంటే మానస్ చుట్టూ తిరగడం తప్ప ఇంకేం చేయడం లేదు ప్రియాంక. బహుశా మానస్ తో ఒక ట్రాక్ ఉంటేనే స్క్రీన్ స్పేస్ ఉంటుందని ప్రియాంక భావిస్తుందో.. లేక నిజంగానే మానస్ ని విడిచిపెట్టి ఉండలేకపోతుందో తెలియదు కానీ అతడికి మాత్రం కొంచెం కూడా స్పేస్ ఇవ్వడం లేదు. ఈ వారం ప్రియాంక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆమెకి ఫినాలే వరకు ఉండే ఛాన్స్ దక్కదేమో. 

విమెన్ స్ట్రాటజీ : బిగ్ బాస్ తన గేమ్ స్ట్రాటజీ ప్రకారం.. ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ని ఫైనల్స్ వరకు ఉంచాలని భావిస్తున్నారట. అలా చూసుకుంటే సిరి, కాజల్, మానస్ ల మధ్య వార్ తప్పదనిపిస్తోంది. సిరి 'టికెట్ టు ఫినాలే' సంపాదించుకుందని వార్తలు వస్తున్నాయి. ఆమె గనుక డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్తే.. కాజల్, మానస్ లు డేంజర్ జోన్ లో ఉంటారు. కాజల్ కంటే మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ బిగ్ బాస్ గనుక ఇద్దరు లేడీ కంటెస్టెంట్ ని ఫైనల్స్ వరకు ఉంచితే మానస్ ఎలిమినేషన్ తప్పదు.

అప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ గా సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, కాజల్, సిరి ఉంటారు. బిగ్ బాస్ గనుక విమెన్ స్ట్రాటజీని పక్కన పెడితే కాజల్ ఎలిమినేట్ అయి.. టాప్ 5 కంటెస్టెంట్స్ గా సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి, మానస్ లు నిలుస్తారు. మరేం జరుగుతుందో చూడాలి!

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!

Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh Siri Sunny sreeram Bigg Boss 5 Telugu finalists top 5 bigg boss 5

సంబంధిత కథనాలు

Big Boss Sunny & Anee Master: యానీ మాస్ట‌ర్‌కు కొవిడ్‌... స‌న్నీకి స‌పోర్ట్ చేయ‌నందుకు వ‌చ్చింద‌ని శాప‌నార్థాలు!

Big Boss Sunny & Anee Master: యానీ మాస్ట‌ర్‌కు కొవిడ్‌... స‌న్నీకి స‌పోర్ట్ చేయ‌నందుకు వ‌చ్చింద‌ని శాప‌నార్థాలు!

Deepthi Sunaina: హీరోయిన్‌గా దీప్తీ సునయిన‌... ఆమె రియాక్ష‌న్ ఏంటంటే?

Deepthi Sunaina: హీరోయిన్‌గా దీప్తీ సునయిన‌... ఆమె రియాక్ష‌న్ ఏంటంటే?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!