Bigg Boss 5 Telugu: 'మీరు ఉన్నన్ని రోజులు నామినేట్ చేస్తూనే ఉంటా..' ప్రియాకు సన్నీ వార్నింగ్..
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగింది.

బిగ్ బాస్ సీజన్ 5 ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఆరోవారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ముందుకి కొనసాగాలంటే అగ్నిపరీక్షను ఎదుర్కోవాలన్న బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో వారి ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
ముందుగా 'ప్రతీసారి ఎదవ రీజన్స్ చెప్పుకుంటూ' అంటూ ప్రియాంక.. విశ్వను ఉద్దేశిస్తూ కామెంట్ చేయగా.. 'ఎదవ రీజన్స్ అని నువ్ మాట్లాడకు' అని విశ్వ చెప్పగా.. 'నా ఇష్టం' అనుకుంటూ పొగరుగా వెళ్లిపోయింది ప్రియాంక. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో దొంగతనం చేసి, నమ్మకాన్ని బ్రేక్ చేశాడంటూ రీజన్ చెప్పాడు లోబో. దానికి జెస్సీ.. 'నేను ఇక్కడకి గేమ్ ఆడదానికి వచ్చాను.. గేమే ఆడతాను' అంటూ రిప్లై ఇచ్చాడు.
'పదిహేనేళ్ల ఫ్రెండ్షిప్ అన్నావ్.. మా నమ్మకాన్ని బ్రేక్ చేసినట్లనిపించింది.. నీవల్లే గేమ్ ఓడిపోయాం అనిపించింది' అంటూ లోబోని నామినేట్ చేశాడు మానస్. 'మీ కన్వీనియన్స్ కోసం ఒక రిలేషన్షిప్ ని వాడుకోకండి' అని శ్రీరామచంద్ర.. షణ్ముఖ్ ని నామినేట్ చేస్తుండగా.. 'సో బేసిక్ గా నువ్ బిగ్ బాస్ హౌస్ కి దేవుడివి. నువ్ ఏ రూల్ చెప్తే మేం అది పాటించాలి అంతేనా..?' అంటూ ప్రశ్నించాడు షణ్ముఖ్. 'ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెట్టుకోవడానికి నేను ఈ హౌస్ లోకి రాలేదు..' అంటూ కాజల్ డైలాగ్ వేసింది.
'నువ్ నన్ను నామినేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా నామినేట్ చెయ్' అంటూ శ్వేతా.. కాజల్ కి చెప్పింది. ఆ తరువాత రవి.. సిరిని నామినేట్ చేశాడు. 'మీరు ఉన్నన్ని రోజులు నామినేషన్ 100 పెర్సెంట్ మీకే ఉంటుంది' అంటూ ప్రియాకి చెప్పాడు సన్నీ. దానికి ఆమె 'వార్నింగ్ ఇస్తున్నారా..?' అని అడగ్గా.. 'నా గేమ్ చెప్తున్నా' అంటూ బదులిచ్చాడు సన్నీ.
Most interesting ga jarigina nominations..Fire is on 🔥 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFire and #FiveMuchFun pic.twitter.com/YoQBP8RtK9
— starmaa (@StarMaa) October 11, 2021
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి




















