అన్వేషించండి

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

ఈ వారం హౌస్ నుంచి ప్రియాను ఎలిమినేట్ చేసి షాకిచ్చారు బిగ్ బాస్. వెళ్తూ వెళ్తూ ఆమె హౌస్ మేట్స్ కి ఎన్ని మార్కులు ఇచ్చిందంటే..?

స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. అనంతరం హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు. నాక్ ఔట్ రౌండ్స్ అంటూ కొన్ని టాస్క్ లు చేయించారు. మొదటి రౌండ్ లో కాజల్, షణ్ముఖ్ అవుట్ అయ్యారు. ఆ తరువాత రౌండ్ లో ప్రియాంక, మానస్, ప్రియా ఓడిపోయారు. 

లోబో సేఫ్.. 

నామినేషన్ లో ఉన్న ఆరుగురిని మిసెస్ ప్రభావతి ముందు నుంచోమని చెప్పారు. ఎవరైతే ప్రభావతి ముందు నుంచున్నప్పుడు కోడి సౌండ్ వస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు చెప్పారు నాగార్జున. ఈ టాస్క్ లో జెస్సీ వెళ్లి ప్రభావతి ని 'ప్లీజ్ బేబీ' అంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ అతడు సేవ్ అవ్వలేదు. ఆ తరువాత రవి వెళ్లగా.. అతడిని ఉద్దేశించి మిసెస్ ప్రభావతిని ఇన్ఫ్లూయెన్స్ చేయు అంటూ సెటైర్ వేశారు నాగ్. దానికి రవి 'అది ఇన్ఫ్లూయెన్స్ కాదు సర్' అని సమాధానమిచ్చాడు. రవి కూడా ఈ టాస్క్ లో సేవ్ అవ్వలేదు. లోబో వెళ్లినప్పుడు మాత్రం కోడి సౌండ్ వినిపించడంతో అతడు సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. 

నాక్ అవుట్ రౌండ్ గేమ్ లో మిగిలిన ఐదుగురితో మ్యూజికల్ ఛైర్ ఆడిపించారు నాగ్. ఇందులో సిరి, సన్నీ ఓడిపోగా.. శ్రీరామ్, విశ్వ, యానీ మాస్టర్ గెలిచారు. ఆ ముగ్గురితో మరో గేమ్ ఆడించగా.. ఈసారి యానీ, విశ్వ గెలిచారు. 

Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?

రవి సేఫ్.. 

నామినేషన్ లో ఉన్న ఐదుగురిని నుంచోమని చెప్పిన నాగార్జున.. తన చేతిలో ఉన్న డాల్ ఎవరు సేఫ్ అవుతుందో చెప్తుందని అన్నారు. చాలా సేపు టెన్షన్ పెట్టిన నాగార్జున.. ఆ డాల్ లో రవి పేరు ఉన్నట్లు ప్రకటించారు. 

నాక్ అవుట్ రౌండ్ గేమ్ లో మిగిలిన విశ్వ, యానీ మాస్టర్ లతో మరో గానే ఆడిపించారు నాగార్జున. ఈ గేమ్ లో హౌస్ మేట్స్ సపోర్ట్ అడగడంతో ఎక్కువమంది యానీ మాస్టర్ కి మద్దతు తెలిపారు. ఎక్కువ మంది సపోర్ట్ తో యానీ మాస్టర్ విన్నర్ గా నిలిచారు. గెలిచిన యానీకి చిన్న మెమోంటోను గిఫ్ట్ గా ఇచ్చి.. దాని పవర్ ఏంటో బిగ్ బాస్ తరువాత చెప్తారని తెలిపారు. 

సిరి సేఫ్.. 

నామినేషన్ లో మిగిలిన నలుగురిని లైన్లోకి రమ్మని చెప్పిన నాగార్జున వారికి ఫ్రూట్ జాక్ పాట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో సిరి సేఫ్ అయినట్లు చెప్పారు నాగార్జున. 

జెస్సీ సేఫ్.. 

నామినేషన్ లో మిగిలిన ప్రియా, యానీ మాస్టర్, జెస్సీలను పిలిచి వారి చేతుల్లో బెలూన్స్ పెట్టారు. ఎవరి బెలూన్ లో అయితే సేఫ్ అని ఉంటుందో వాళ్లు సేఫ్ అని చెప్పారు. ఈ టాస్క్ లో జెస్సీ బెలూన్ లో సేఫ్ అని ఉండడంతో అతడు సేఫ్ అయ్యాడు. 

నామినేషన్ లో ఉన్న యానీ, ప్రియాను హౌస్ మేట్స్ కి గుడ్ బై చెప్పామన్నారు నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వాళ్లిద్దరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున.. అక్కడే ఉన్న రెండు బాక్సుల్లోకి వెళ్లమని చెప్పారు. 

వారిద్దరూ బాక్సుల్లోకి వెళ్లగానే లైట్స్ ఆన్ అయ్యాయి. లైట్స్ ఆగిపోయిన వెంటనే హౌస్ మేట్స్ ని వెళ్లి ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెక్ చేయమని చెప్పారు నాగార్జున. వెంటనే హౌస్ మేట్స్ పరుగెత్తుకొని వెళ్లి చూడగా.. రెండు బాక్సులు ఖాళీగా ఉన్నాయి. అది చూసిన నాగార్జున ఇద్దరూ స్టేజ్ పై వస్తారేమో అని కామెంట్ చేశారు. దీంతో 'ఇద్దరునా..?' అంటూ షాకయ్యారు హౌస్ మేట్స్.

కాసేపు తరువాత యానీ మాస్టర్ లివింగ్ రూమ్ లోకి రావడంతో.. ప్రియా ఎలిమినేట్ అయిందని హౌస్ మేట్స్ కి అర్ధమైంది. దీంతో ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చేసింది. యానీ మాస్టర్ ని చూసి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక సన్నీ కూడా యానీని పట్టుకొని ఏడ్చేశాడు. 

అనంతరం స్టేజ్ పైకి వచ్చిన ప్రియా హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి మార్కులు ఇచ్చింది. లోబోకి 5 మార్కులు ఇస్తూ.. ఒక సైడ్ ఉండడని రీజన్ చెప్పింది. ఆ తరువాత విశ్వకి 5 మార్కులు ఇస్తూ.. వేరే వాళ్లకి గేమ్ ఆడడానికి ఛాన్స్ ఇవ్వమని చెప్పింది. గేమ్ లో ఎవరినీ హర్ట్ చేయొద్దని చెప్పింది. రవికి 5 మార్కులు ఇస్తూ.. సిల్లీ రీజన్స్ తో నిన్ను నామినేట్ చేసేవాళ్లు ఉండరని చెప్పింది. షణ్ముఖ్ కి ఎనిమిదిన్నర మార్కులు ఇచ్చి.. చాలా స్వీట్ పెర్సన్ అని, ఇలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలని చెప్పింది. సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులు ఇచ్చి.. చిచ్చరపిడుగు, చాలా బాగా ఆడుతుందని చెప్పింది. శ్రీరామ్ కి 8 మార్కులు ఇస్తూ.. తన పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుందని చెప్పింది. ప్రియాంకకి 10కి వంద మార్కులు ఇచ్చింది ప్రియా.

యానీ మాస్టర్ కి 10 మార్కులు ఇచ్చి.. చాలా బ్యూటిఫుల్ సోల్ అని చెప్పింది. జెస్సీకి 8 మార్కులు ఇస్తూ.. చాలా బాగా ఆడుతున్నాడని చెప్పింది. కాజల్ కి 7 మార్కులు ఇచ్చి.. స్టార్టింగ్ లో బాగా ఆడావ్.. ఇప్పుడు నీ గేమ్ అందరికీ అర్ధమైపోతుందని చెప్పింది. మానస్ కి పదికి పది మార్కులు ఇచ్చి.. మొదటి రోజు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడని చెప్పింది. సన్నీకి 9 మార్కులు ఇచ్చి.. 'నా ప్లేట్ లో తినే రైట్.. నా కప్పులో తాగే రైట్ నీకు మాత్రమే ఉంది' అంటూ కామెడీ చేసింది. దీప్తికి ఏమైనా చెప్పనా..? షణ్ముఖ్ అని ప్రశ్నించింది ప్రియా. దానికి షన్ను 'ఆ మాట అన్నారు చాలు' అని అనగా.. 'తనను మిస్ అవ్వట్లేదని శుభ్రంగా ఉన్నావని చెప్తానని' ప్రియా అనగా.. 'ప్రియా గారు ఆ పని మాత్రం చేయకండి.. మా ఇంట్లో వాళ్లకు కూడా భయపడను తనకు భయపడతా..' అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. 

ప్రియా వెళ్లిపోయిందని గార్డెన్ ఏరియాలో కూర్చొని ఏడుస్తున్న ప్రియాంకను మానస్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. లోబో తనను అవసరం ఉన్నప్పుడే వాడుకుంటున్నాడని అన్న మాటలకు హర్ట్ అయిన రవి.. విశ్వ, లోబోలతో డిస్కషన్ పెట్టాడు. మనసు విరిగిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget