అన్వేషించండి
Bigg Boss 5 Telugu: ప్రియా చేసిన పనికి సిగ్గుపడుతూ.. నవ్వేసిన సన్నీ
లోబో తన దగ్గరున్న గోల్డెన్ ఎగ్ ను ఎవరికైతే ఇస్తాడో.. వారు నేరుగా కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి అర్హులవుతారు. ఎవరికైతే బ్లాక్ ఎగ్ ఇస్తాడో వారు అనర్హులవుతారు. మరి లోబో తన దగ్గరున్న ఎగ్స్ ఎవరికిచ్చాడో..!
![Bigg Boss 5 Telugu: ప్రియా చేసిన పనికి సిగ్గుపడుతూ.. నవ్వేసిన సన్నీ Bigg Boss 5 Telugu: Priya Funny Conversation with Housemates Bigg Boss 5 Telugu: ప్రియా చేసిన పనికి సిగ్గుపడుతూ.. నవ్వేసిన సన్నీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/41c2a6a61407d9b1a66f669418dc347f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రియా చేసిన పనికి సిగ్గుపడుతూ.. నవ్వేసిన సన్నీ
కొన్ని రోజులుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబోని తిరిగి హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు. మొదటి ప్రోమోలో లోబోని చూసి రవి, సన్నీ, శ్రీరామ్ లు బాగా ఎగ్జైట్ అవుతూ కనిపించరు. ఇక సీక్రెట్ టాస్క్ లో తనను ఎదవని చేశారంటూ షణ్ముఖ్.. సిరి, జెస్సీలపై ఫైర్ అవుతూ తెగ ఫీలైపోయాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో లోబో దగ్గర రెండు ఎగ్స్ ఉన్నట్లు చూపించారు. అందులో ఒకటి గోల్డెన్ ఎగ్ కాగా.. మరొకటి బ్లాక్ ఎగ్.
Also Read: చాందిని... మందు, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం
లోబో తన దగ్గరున్న గోల్డెన్ ఎగ్ ను ఎవరికైతే ఇస్తాడో.. వారు నేరుగా కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి అర్హులవుతారు. ఎవరికైతే బ్లాక్ ఎగ్ ఇస్తాడో వారు అనర్హులవుతారు. ఈ ఎగ్స్ ను పట్టుకొని లోబో కాసేపు హౌస్ మేట్స్ ని ఏడిపించాడు. అనంతరం రవి, యానీ, శ్రీరామ్, విశ్వ అర్ధరాత్రి లోబోతో మీటింగ్ పెట్టారు. అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని యానీ.. లోబోకి చెబుతుండగా.. 'మనం కూడా ఆడొచ్చు.. కానీ నువ్ అటు ఇటు జంప్ అవుతుంటావ్' అంటూ యానీకి కౌంటర్ ఇచ్చాడు.
ఆ తరువాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని తింటుండగా.. నేను కూడా జాయిన్ అవ్వొచ్చా అంటూ ప్రియా చైర్ పట్టుకొని వచ్చి కూర్చుంది. అక్కడే సన్నీ కూడా ఉండడంతో.. 'సన్నీ కెప్టెన్ అయితే నేను రేషన్ మ్యానేజర్ అవుతా.. అప్పుడైన సచ్చినట్లు మాట్లాడాలిగా..' అంటూ నవ్వించింది. ఆ వెంటనే 'నేను ఎవరి ప్లేట్ లో తింటున్నా..?' అంటూ సన్నీ ప్లేట్ చూపించింది. అది చూసిన హౌస్ మేట్స్ 'సన్నీ.. నీ ప్లేట్ లో తింటున్నారు ప్రియా గారు' అని చెప్పగా.. సన్నీ సిగ్గుపడుతూ నవ్వేశాడు.
#Lobo black egg evariki istadu, gold egg evariki istadu? #Sunny plate lo #Priya#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/OjmiIGeRlb
— starmaa (@StarMaa) October 21, 2021
Also Read: అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్తో... సమంత ఆధ్యాత్మిక యాత్ర
Also Read: 'భీమ్లా నాయక్' కొత్త స్టిల్.. పవన్, రానా పోజు చూశారా..?
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి లోబో రీ-ఎంట్రీ ..యదవనయ్యా అన్న షణ్ముక్-కన్నీళ్లు పెట్టుకున్న సిరి…!
Also Read: తమన్నా ఔట్-అనసూయ ఇన్..హాట్ యాంకర్ అంతకుమించి అనిపిస్తుందా..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion