అన్వేషించండి

Bigg Boss 5 Telugu: హామీద అవుట్.. కాజల్ ఫేక్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది.. 

ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా నలుగురు సభ్యులను సేవ్ చేశారు నాగార్జున. ఇంకా డేంజర్ జోన్ లో మరో ఐదుగురు ఉన్నారు. 

దసరా ముందు ఆదివారం కావడంతో బిగ్ బాస్ హౌస్ పండుగ ఎపిసోడ్ కోసం ముస్తాబైపోయింది. నాగార్జున పంచెకట్టుతో బంగార్రాజులా ముస్తాబై వచ్చారు వేదిక మీదకి. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడిన ఆయన వారితో గేమ్స్ ఆడించారు. ముందుగా రవి, ప్రియాలను టీమ్ లీడర్స్ గా పెట్టి హౌస్ మేట్స్ ని డివైడ్ చేశారు. 
 
పాలపిట్ట అవార్డ్స్: 
 
రెండు టీమ్ లో ఉన్న హౌస్ మేట్స్ తో బుల్ ఫైట్ చేయించగా.. ఇందులో ఏ టీమ్ అయితే గెలుస్తుందో వారికి తమ ఫ్యామిలీ వీడియోలను వేయించి చూపిస్తామని చెప్పారు. ఇందులో రవి టీమ్ గెలవడంతో.. ఆ టీమ్ లో ఉన్న లోబోకి ఫ్యామిలీ వీడియో వేసి చూపించగా.. తన కూతురు మాట్లాడింది. ఆమె మాటలకు లోబో ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. 
 
ఆ తరువాత జెస్సీ ఫ్యామిలీ వీడియో చూపించారు. అతడి తల్లి మాట్లాడారు. ''కెప్టెన్సీ టాస్క్ లో దెబ్బలు తగిలించుకున్నా బాగా ఆడావ్. షన్ను, కాజల్, సిరిలతో నీ బాండింగ్ బావుంది. అది బయట కూడా కొనసాగాలని కోరుకున్నారు''
 
మానస్-జెస్సీ సేఫ్..   
నామినేషన్ లో ఉన్న తొమ్మిది మందితో నిలబడమని చెప్పిన నాగార్జున.. తన ముందున్న ఒక బాక్స్ లో సేవ్ కాబోతున్న వారి ఫోటో ఉందని చెప్పారు. ఆ బాక్స్ లో మానస్ ఫోటో ఉండడంతో అతడు సేవ్ అయ్యాడు. అదే బాక్స్ లో జెస్సీ ఫోటో కూడా ఉండడంతో అతడు కూడా ఈ వారం సేవ్ అయ్యాడు. 
 
గుడ్ ఓవర్ ఈవిల్.. 
ఆ తరువాత రవి టీమ్ నుంచి ప్రియాంక-లోబో-యానీమాస్టర్-రవి-సన్నీ-హమీద అందరూ కలిసి స్కిట్ వేశారు. ఆడపిల్ల పుడితే వద్దనుకునే తండ్రి స్టోరీతో స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో ఒక్కొక్కరూ తమ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశారు. 
 
ఆ తరువాత ప్రియా టీమ్ నుంచి విశ్వ-జెస్సీ-శ్రీరామ్-సిరి-కాజల్-మానస్-ప్రియా కలిసి రైతుల సమస్యల మీద స్కిట్ వేయగా.. అది ఎంతో ఎమోషనల్ గా సాగింది.
 
ఈ టాస్క్ లో రవి టీమ్ గెలవడంతో ఆ టీమ్ నుంచి యానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియోను ప్లే చేసి చూపించారు. అందులో తన కొడుకు, తల్లిని చూసుకొని కన్నీళ్లు పెట్టేసుకుంది యానీ. 
 
గేమ్ ఆఫ్ లక్: 
రెండు టీమ్ ల సభ్యుల ముందు బాక్స్ లను పెట్టి సెలెక్ట్ చేసుకోమని చెప్పగా.. వారిలో ప్రియాంక, హమీదా, షణ్ముఖ్ లకు స్వీట్స్ రాగా.. మానస్ కి వెల్లుల్లి, కాజల్ కి కాకరకాయ, ప్రియాకు ఉల్లిపాయ వచ్చాయి. ఈ టాస్క్ లో రవి టీమ్ గెలవడంతో.. రవి ఫ్యామిలీకి సంబంధించిన వీడియో ప్లే చేశారు. అందులో రవి భార్య నిత్య, కూతురు మాట్లాడడంతో రవి ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 
 
ఇంటెలిజెన్స్ : 
రెండు టీమ్ ల సభ్యులను పది ప్రశ్నలు అడిగారు నాగార్జున. ఇందులో ప్రియా టీమ్ గెలవడంతో.. ఆ టీమ్ లో ఉన్న విశ్వకి ఫ్యామిలీ వీడియో వేసి చూపించారు. 
 
ప్రియా, రవి సేఫ్..
ఆ తరువాత నామినేషన్ లో ఉన్న ఏడుగురి చేతిలో పౌచ్ లు పెట్టారు.. అందులో గోల్డ్ కాయిన్స్ వచ్చిన వాళ్లు సేఫ్ అని చెప్పగా.. ప్రియా, రవిలకుకు గోల్డ్ కాయిన్స్ రావడంతో వారిద్దరూ సేవ్ అయ్యారు. 
 
ఆ తరువాత కుండల టాస్క్ లో ప్రియా టీమ్ గెలవడంతో.. ప్రియా ఫ్యామిలీ వీడియోను ప్లే చేసి చూపించారు. ఇందులో తన కొడుకు మాట్లాడాడు. 
 
అనంతరం హౌస్ మేట్స్ తో బతుకమ్మ ఆట ఆడించారు నాగార్జున. బతుకమ్మ టాస్క్ లో ప్రియా టీమ్ గెలవడంతో.. వారి టీమ్ మెంబర్ కాజల్ ఫ్యామిలీ వీడియోను వేసి చూపించారు. తన కూతురు వీడియోలో మాట్లాడగా.. ఆమె మాటలకు కాజల్ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. 
 
ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన హైపర్ ఆది.. హౌస్ మేట్స్ పై కౌంటర్లు, పంచ్ లు వేశారు. లోబో మీ మీద అరిచినదానికంటే ఆయన ఏం మాట్లాడారో అర్ధంకాక ఏడ్చేశారు కదా..? అని ప్రియా మీద సెటైర్ వేశాడు. పింకీ, ప్రియాంకల మధ్య గుసగుసలు ఎన్ని మైకులు పెట్టినా క్యాచ్ చేయలేకపోతున్నామని కామెంట్ చేశారు. శ్రీరామచంద్ర అని పెట్టారు కానీ శ్రీకృష్ణ అని పెట్టాల్సింది అంటూ శ్రీరామ్ పై పంచ్ వేశాడు హైపర్ ఆది. ఆ తరువాత హౌస్ లో వంటలు చేసి చేసి.. మీరు వంటలక్క అయిపోయేలా ఉన్నారంటూ యానీ మాస్టర్ పై పంచ్ వేశాడు. జెస్సీను శ్వేతతో పులిహోర కలపడం వచ్చుగానీ చపాతీ పిండి కలపడం రాదా..? అని సెటైర్‌ వేశాడు. నేను టైటిల్‌ వెంట పడుతుంటే పింకీ నా వెంట పడుతుందేంటి? అని అనిపించిందా? అని మానస్‌ను గుచ్చిగుచ్చి అడిగాడు. కాజల్‌ను నిద్రలో నుంచి లేపి పేరేంటి? అని అడిగితే స్ట్రాటజీ అంటుందని ఆమె మీద పంచ్‌ వేయడంతో హౌస్ మేట్స్ పడిపడి నవ్వారు. ఆ తరువాత త్రిమూర్తులు అంటూ షణ్ముఖ్, సిరి, జెస్సీలపై హైపర్ ఆది వేసిన పంచ్ లు ఓ రేంజ్ లో పేలాయి. 
 
ఆ తరువాత నామినేషన్ లో ఉన్న ఐదుగురిలో లోబో సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 
 
మునిగినోళ్లే మొనగాళ్లు..
 
రెండు టీమ్ ల నుంచి హౌస్ మేట్స్ లో ఎవరైతే ఎక్కువ సేపు స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఉండగలరో వాళ్లే విన్నర్ అని చెప్పారు. ఈ టాస్క్ లో కూడా టీమ్ ప్రియానే గెలిచింది. దీంతో ఆమె టీమ్ లో ఉన్న సిరి ఫ్యామిలీ వీడియోను ప్లే చేసి చూపించారు. 
 
ఆ తరువాత హమీద ఫ్యామిలీ వీడియో ప్లే చేసి చూపించారు. 
 
నామినేషన్ లో ఉన్న షణ్ముఖ్, హమీద, విశ్వా, సన్నీలలో.. సన్నీ సేవ్ అయినట్లు ప్రకటించారు. 
 
బిగ్ బాస్ స్టేజ్ పై అఖిల్.. 
 
బిగ్ బాస్ స్టేజ్ పైకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీమ్ వచ్చేసింది. ఇందులో భాగంగా అక్కినేని అఖిల్, పూజాహెగ్డే బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ముందుగా వీరిద్దరూ ఎవరినీ పట్టించుకోకుండా తమ సినిమాలో పాటకు డాన్స్ చేస్తూ రొమాన్స్ లో మునిగిపోయారు.

ఇంతలో స్టేజ్ పైకి వచ్చిన నాగ్.. 'ఏరా.. ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా..?' అంటూ అఖిల్ పై సెటైర్ వేశారు. దానికి అఖిల్.. 'స్టేజ్ ఈజ్ యువర్స్ అని ఎవరో అన్నారని' అఖిల్ చెబుతుండగా.. 'దిస్ ఈజ్ మై స్టేజ్' అంటూ నాగార్జున అన్నారు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత అఖిల్-పూజాహెగ్డేలు హౌస్ మేట్స్ తో మాట్లాడారు.

ఆ సమయంలో అఖిల్ హౌస్ లో ఉన్న అబ్బాయిలకు ఒక టాస్క్ ఇచ్చారు. వారందరినీ పూజాహెగ్డేని ఇంప్రెస్ చేయమని అడిగారు. ఇంతలో శ్రీరామచంద్ర 'సామజవరగమన' పాట అందుకొని పూజాని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే నాగ్ 'నాకు తెలుసు శ్రీరామ్ నీకీ అడ్వాంటేజ్ ఉందంటూ' కౌంటర్ వేశారు. ఆ తరువాత షణ్ముఖ్ ఒక స్కిట్ వేసి పూజాని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక జెస్సీ ర్యాంప్ వాక్ చేయగా.. మానస్ డాన్స్ చేశాడు.
 
ఆ తరువాత నామినేషన్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ సేవ్ అయినట్లుగా అక్కినేని అఖిల్ ప్రకటించారు. 
 
ఇక ఫైనల్ గా హమీద-విశ్వలలో విశ్వ సేవ్ అవ్వగా.. హమీద ఎలిమినేట్ అయింది. 
 
ఇక స్టేజ్ పైకి వచ్చిన హమీద.. హౌస్ మేట్స్ గురించి మాట్లాడింది. మానస్ ఒక్కోసారి రియాక్షన్స్ మార్చేస్తూ ఉంటాడని.. అందులో మారాలని చెప్పింది. కాజల్ ఫేక్ పెర్సన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది హమీద. జెస్సీతో అంత ఎమోషన్ లేదని చెప్పింది. సిరిని ఫ్లిపర్ అని చెప్పింది. షణ్ముఖ్ మాయ చేస్తాడంటూ చెప్పింది. ప్రియాంక.. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదని చెప్పింది. ప్రియాతో గొడవలు ఉన్నా.. పరిష్కరించుకుని వచ్చినందుకు గిల్ట్ ఫీలింగ్ లేదని చెప్పింది. సన్నీ.. చాలా గుడ్ పెర్సన్ అని చెప్పింది. శ్వేతా గుడ్ పెర్సన్ అని.. రవి కూడా చాలా మంచోడని చెప్పింది. తనకు అన్నయ్య ఉంటే రవిలా ఉండాలనిపించిందని చెప్పింది. విశ్వ.. తను ఎప్పుడు బాధలో ఉన్నా వచ్చి మాట్లాడేవాడని చెప్పింది. లోబో మంచి ఎంటర్టైనర్ అని చెప్పింది. శ్రీరామచంద్ర గురించి మాట్లాడుతూ.. చాలా మంది వ్యక్తి అని, అతడి గురించి గొప్పగా చెప్పింది. వెంటనే శ్రీరామ్.. 'నన్ను హౌస్ లో అర్ధం చేసుకున్నది హమీద మాత్రమే అని.. చాలా జెన్యూన్ పెర్సన్ అని' చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు. 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget