అన్వేషించండి
Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ పై రివెంజ్ తీర్చుకున్న రవి..
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో సూపర్ హీరోస్ టీమ్ రవిని దారుణంగా టార్చర్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ లో రవికి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది.

షణ్ముఖ్ పై రివెంజ్ తీర్చుకున్న రవి..
బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం మరో కంటెస్టెంట్ హౌస్ ని వదిలి వెళ్లబోతున్నారు. ఈసారి యానీ మాస్టర్, షణ్ముఖ్, మానస్ తప్ప మిగిలిన వాళ్లంతా నామినేషన్ లో ఉండడంతో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
Also Read: బాలయ్య షోతో 'ఆహా'కి ఎన్ని బెనిఫిట్సో..
ముందుగా నాగార్జున ధోతీ వేసుకున్న రవిని ధోతీవాలా రవి అని పిలిచారు. రవి లేచి నుంచోగానే నాగ్ అలా చూస్తూ ఉన్నారు. దీంతో రవిలో టెన్షన్ మొదలైంది. కానీ హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూ కనిపించారు. వెంటనే నాగార్జున చప్పట్లు కొట్టారు. ''నిన్ను నరకం పెట్టారు చూడూ.. అదేం నరకం.. ఇట్ ఈజ్ పేబ్యాక్ టైమ్'' అంటూ రవికి ఓ ఛాన్స్ ఇచ్చారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో రవికి చితవిచిత్రమైన డ్రింక్స్ ఇచ్చి తాగమన్నారు.
ఇప్పుడు రవికి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ రావడంతో.. షణ్ముఖ్ ని పిలిచి తన చేతులతో చేసిన వెరైటీ డ్రింక్ ని ఇచ్చి తాగమన్నారు. షణ్ముఖ్ నానా ఇబ్బందులు పడుతూ డ్రింక్ తాగాడు. ఆ తరువాత శ్రీరామచంద్రకి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. అతడు సన్నీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎగ్, సోయా సాస్ ఇలా రకరకాల ఇంగ్రేడియంట్స్ తో డ్రింక్ తయారు చేసి ఇచ్చాడు. అది సన్నీ తాగలేకపోవడంతో ఉల్లిపాయ చేతిలో పెట్టి ఒక ముక్క తిని తాగేయ్ అని అన్నాడు శ్రీరామ్. దానికి సన్నీ.. 'మగడా.. ఆగరా.. ఏదో జన్మలో నా మొగుడివి నువ్' అంటూ కష్టపడి డ్రింక్ తాగేశాడు.
Weekend is here and it's time for a solid payback!!#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/oMeTUCVJez
— starmaa (@StarMaa) November 6, 2021
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion