Bigg Boss 5 Telugu: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..

ఆకలి విలువ తెలిసేలా యాంకర్ రవి, నటరాజ్, విశ్వ, లోబో, ప్రియా కలిసి ఓ స్కిట్ వేశారు. 'ఆకలిరాజ్యం' సినిమాలో సీన్ ను స్కిట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ స్కిట్ లో ప్రతి ఒక్కరూ జీవించేశారు. 

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం నాల్గో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక నిన్నటి నుంచి షోలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. 'గెలవాంటే తగ్గాల్సిందే' అనే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు తమ బరువుని తగ్గించుకోవాల్సి ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో శ్రీరామచంద్ర-హామీద గెలిచారు. 

ఇక ఈరోజు ఎపిసోడ్ లో సన్నీ-మానస్ వర్కవుట్ చేస్తూనే ఉన్నారు. కానీ మధ్యలో ఆకలేస్తుందని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ కామెడీ చేశారు. గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తూ.. ఎవరైనా ఉంటే ఓ బిరియాని ప్యాకెట్ పడేయండి అంటూ అరిచాడు సన్నీ. లోబోని ఆకలి కంట్రోల్ చేసుకోమని.. అదే టాస్క్ అంటూ చెప్పారు నటరాజ్. 'ఏడు సముద్రాలు దాటంట.. ఇంటిముందున్న మురికిగుంటలో కాలెట్టేశారు' అంటూ లోబోతో సామెత చెప్పారు మాస్టర్. ఆ తరువాత ఫుడ్ బండి ద్వారా.. పావ్ బాజీ పంపించారు బిగ్ బాస్. కానీ హౌస్ మేట్స్ ఎవరూ టెంప్ట్ అవ్వకుండా ఫుడ్ ని తిరిగి పంపించేశారు. ప్రతి సెకన్ నాకు అన్నం విలువ అర్ధమవుతుందని యాంకర్ రవి ఎమోషనల్ గా అన్నాడు. 
ఆకలి విలువ తెలిసేలా యాంకర్ రవి, నటరాజ్, విశ్వ, లోబో, ప్రియా కలిసి ఓ స్కిట్ వేశారు. 'ఆకలిరాజ్యం' సినిమాలో సీన్ ను స్కిట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ స్కిట్ లో ప్రతి ఒక్కరూ జీవించేశారు. 

Also Read:టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని

జెస్సీకి వార్నింగ్..

బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం.. 'ఫుడ్ బండి' వచ్చిన తర్వాతే ఇంటి సభ్యుల్లో ఒకరు ఆహారం తీసుకోవాలి. అయితే, లోబో తాను దాచుకున్న ఆహారాన్ని తిన్నాడు. దీనిపై బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూల్ తప్పినందుకు కెప్టెన్ జెస్సీతోపాటు అతడికి పార్టనర్‌గా ఉన్న కాజల్‌ను కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించారు. దీంతో జెస్సీ ఆగ్రహానికి గురయ్యాడు. తాను వారిస్తున్నా.. నీకు మానవత్వం లేదా అన్నారని, ఇప్పుడు చూడండి అంటూ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు. 'నన్ను టాస్క్ కోసం సెలెక్ట్ చేసుకున్నావ్ అక్కా నాకు చాలా గిల్టీగా ఉంది' అంటూ కాజల్ కి సారీ చెప్పాడు. ఆ తరువాత బెడ్ రూమ్ లో కాజల్ తో డిస్కస్ చేస్తూ.. 'హౌస్ మేట్స్ అంతా టార్గెట్ చేసి చేసినట్లు అనిపిస్తుంది నాకు.. నాగ్ సార్ ముందు వీక్ అనిపించేలా చేస్తున్నారు' అంటూ కామెంట్స్ చేశాడు జెస్సీ. ''నేను ఈ హౌస్ కి ఫిట్ కాను.. ఒక్కరు కూడా నా మాట వినలేదు..'' అంటూ షణ్ముఖ్ దగ్గర వాపోయాడు జెస్సీ. దానికి షణ్ముఖ్ 'అరవడం వేరు కమాండింగ్ వేరు.. నీలో అరవడమే చూశా.. కానీ నీదే తప్పు అని చెప్పట్లేదు.. వాళ్లు నిన్ను గ్రాంటెడ్ గా తీసుకున్నారు'' అంటూ హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ చెప్పాడు షణ్ముఖ్. ''ఇక్కడ అందరూ ఒకటే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. అందర్నీ పేరు పెట్టి పిలువు. అన్న అని అనాల్సిన అవసరం లేదు'' అని జెస్సీకి సలహా ఇచ్చాడు షణ్ముఖ్‌.

గేమ్ లో పవర్ రూమ్ యాక్సెస్ రవి-విశ్వలకు రాగా.. పవర్ రూమ్ లోకి వెళ్లిన వీరిద్దరూ తమతో గేమ్ ఆడదానికి ప్రియా-ప్రియాంకలను ఎన్నుకున్నారు. ఇది ఫిజికల్ టాస్క్ అయినప్పటికీ ప్రియా-ప్రియక టఫ్ కాంపిటిషన్ ఇచ్చారు. ఫైనల్ గా రవి-విశ్వలే గెలిచారు. 

రవితో షణ్ముఖ్ డిస్కషన్.. 
ఆ తరువాత షణ్ముఖ్-రవి కూర్చొని డిస్కషన్ పెట్టుకున్నారు. 'నేను ఎవరితోనైనా.. ఎమోషనల్ బాండ్ పెట్టుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటా.. టాస్క్ లో ఆడుతున్నప్పుడు కూడా నీ కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అనిపిస్తుంది' అని రవితో అన్నాడు షణ్ముఖ్. 'ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి నేనెక్కడ మాట్లాడాను నీతో..?' అంటూ ప్రశ్నించాడు రవి.

ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో.. 
లోబో.. ఆకలిని తట్టుకోలేక చెత్త బుట్టలో ఆహారం కోసం వెతుకుతున్నాడు. అది చూసిన రవి, ప్రియాంక వెంటనే అతడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లారు. ఇంటి సభ్యులు అటుగా వస్తున్నారని తెలిసి.. ముఖం కడుకున్నట్లు నటించాడు లోబో. 

ఆ తరువాత సన్నీ-మానస్ లకు పవర్ రూమ్ యాక్సెస్ దొరకగా.. వారు తమతో గేమ్ ఆడడానికి నటరాజ్-లోబోలను ఎన్నుకున్నారు. తనను సెలెక్ట్ చేసుకోలేదని సిరి ఫీలైపోయింది. ఫైనల్ గా ఈ టాస్క్ లో సన్నీ-మానస్ లు గెలిచారు. 

బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ బిరియాని పంపించారు. ఎవరికి కావాలంటే వారు తినొచ్చని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ ఆనందంలో మునిగిపోయారు. హాయిగా మటన్ బిరియాని ఆరగించేశారు. కానీ సన్నీను మాత్రం మానస్ తిననివ్వలేదు. ఆ తరువాత హమీద వచ్చి సన్నీను ఫుడ్ తినమంటూ ఫోర్స్ చేసే ప్రయత్నం చేసింది. షణ్ముఖ్-సిరి కూడా టాస్క్ కోసం ఫుడ్ తినలేదు. పాపం.. షణ్ముఖ్ మటన్ బిరియాని తినలేకపోతున్నానని తెగ ఫీలైపోయాడు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Sep 2021 11:24 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Ravi Lobo vishwa Nataraj master

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం