అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: 'చెయ్ అతి చేయకు..' సిరికి డైలాగ్ కొట్టిన బాయ్ ఫ్రెండ్.. దీప్తిని చూసి ఫుల్ ఖుషీ అయిన షణ్ముఖ్..
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో సన్నీ, శ్రీరామ్ సేఫ్ అయ్యారు. ఎవరెవరు అన్ సేఫ్ అయ్యారంటే..?
ఈ వీక్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉంటుందనిపిస్తుందని సన్నీ.. కాజల్ తో చెప్పాడు. దానికి 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' నీకోసమే వాడుకోమంటూ కాజల్.. సన్నీతో చెప్పింది. మానస్ పై నీ ఒపీనియన్ ఏంటని సన్నీ.. ప్రియాంకను అడిగాడు. దానికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. సన్నీ అదే ప్రశ్న గుచ్చి గుచ్చి అడగడంతో 'ఐ లైక్ హిమ్' అని చెప్పింది. లవ్ లేదా అని సన్నీ అడగ్గా.. లేదని చెప్పింది ప్రియాంక.
హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాగార్జున.. నిన్నటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి పంపించామని.. ఈరోజు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రాబోతున్నారని చెప్పాడు. అయితే దానికోసం ప్రతీఒక్కరూ ఏదైనా త్యాగం చేయాలని ఫిటింగ్ పెట్టారు నాగార్జున. ముందుగా రవి పేరు పిలవడంతో.. తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న బొమ్మను త్యాగం చేశాడు.
రవి అన్ సేఫ్..
రవి తల్లి స్టేజ్ పైకి వచ్చింది. ఎమోషనల్ అయిపోయిన రవిని చూస్తూ.. 'కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బిగ్‌బాస్ కి రాజావి' అంటూ డైలాగ్ వేసింది అతడి తల్లి. ఆ తరువాత రవి స్నేహితుడు, బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ కూడా స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. రవితో మాట్లాడుతూ.. 'ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ పాయింట్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపో' అంటూ సలహా ఇచ్చాడు. 'ఇప్పుడు తెలిసిందా బిగ్‌బాస్ అంటే ఏంటో' అంటూ హౌస్ మేట్స్ ని శివ బాలాజీ ఆటపట్టించారు. ఆ తరువాత నాగార్జున 'టాప్ 5 ఎవరో చెప్పమని అడగ్గా'.. 'బయలుదేరతా బాయ్ బాయ్' అంటూ చెప్పాడు శివబాలాజీ. ఇక రవి తల్లి టాప్ 5 మెంబర్స్ గా రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్ ల ఫొటోలు బోర్డుపై పెట్టింది. ఆ తరువాత ఆమె చేతికి ఎన్విలాప్ ఇచ్చి రవి సేఫా..? కాదా..? అనే విషయాన్ని చెప్పామన్నారు. దానిలో రవి 'అన్ సేఫ్' అని వచ్చింది.
ప్రియాంక అన్ సేఫ్..
ప్రియాంక తనకు ఇష్టమైన మేకప్ కిట్ ను త్యాగం చేయగా.. ఆమె కోసం కమెడియన్ జబర్దస్త్ అప్పారావు, సాయిలేఖ స్టేజ్ పైకి వచ్చారు. ఆ తరువాత శ్రీరామచంద్రని ఉద్దేశిస్తూ.. 'నువ్ ఎవరూ లేరని బాధపడుతున్నావ్ అని సాయిలేఖను తీసుకొచ్చా' అని చెప్పగా.. 'లోపలికి పంపండి' అని శ్రీరామ్ అనడం 'అంత కరువుగా ఉన్నావా..? నువ్' అని అప్పారావు కౌంటర్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. ఆ తరువాత అప్పారావు, సాయిలేఖ కలిసి టాప్ 5 కంటెస్టెంట్స్ గా ప్రియాంక, సన్నీ, శ్రీరామ్, రవి, మానస్ ల ఫొటోలను బోర్డుపై పెట్టారు. సాయి లేఖ చేతిలో ఉన్న ఎన్విలాప్ ఓపెన్ చెఉఅగా.. అందులో ప్రియాంక అన్ సేఫ్ అని వచ్చింది.
సన్నీ సేఫ్..
సన్నీ తనకు ఇష్టమైన గిఫ్ట్ ను త్యాగం చేయగా.. అతడిని కలవడం కోసం ఫ్రెండ్స్ వెంకట్, నిఖిల్ స్టేజ్ పైకి వచ్చారు. 'కప్పు ముఖ్యం బిగులూ' అంటూ డైలాగ్ వేశారు. టాప్ 5 కంటెస్టెంట్స్ గా సన్నీ, షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్ ల ఫొటోలు పెట్టారు. వెంకట్ తన చేతిలో ఉన్న ఎన్విలాప్ ఓపెన్ చేయగా.. అందులో సన్నీ సేఫ్ అని వచ్చింది.
చెయ్.. అతి చేయకు..
సిరి తన బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన బ్రేస్ లెట్ ను త్యాగం చేయగా.. వెంటనే శ్రీహాన్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. అతడిని చూసిన సిరి వెక్కి వెక్కి ఏడ్చేసింది. 'సిరి వదిలేస్తున్నావా' అని శ్రీహాన్ అడగడంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది. 'ఎక్కువ ఆలోచించొద్దని.. నీకోసం బయట ఒకడున్నాడని' శ్రీహాన్ చెప్పాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ గా సన్నీ ఫొటో ముందుగా పెట్టాడు. షణ్ముఖ్ ని సెకండ్ ప్లేస్ లో పెడుతూ.. 'నేను లేకపోయినా సిరికి తోడుగా నా ఫ్రెండ్ ఉన్నాడనే ధైర్యంతో ఉన్నాను' అంటూ డైలాగ్ వేశాడు శ్రీహాన్. ఆ తరువాత రవి, శ్రీరామచంద్ర, సిరి ఫొటోలు పెట్టాడు. మగాళ్లతో పోటీ పడుతూ గేమ్ ఆడడం మాములు విషయం కాదని సిరిని ఉద్దేశిస్తూ చెప్పాడు. ఆ తరువాత 'చెయ్.. అతి చేయకు' అంటూ ఫన్నీగా డైలాగ్ వేశాడు. తన చేతిలో ఉన్న ఎన్విలాప్ ఓపెన్ చేయగా.. అందులో సిరి సేఫ్ అని వచ్చింది. 'నేనొచ్చా కాబట్టే నువ్ సేఫ్ అయ్యావ్' అంటూ డైలాగ్స్ వేశాడు శ్రీహాన్.
మానస్ తన తల్లి పంపించిన బ్రేస్ లెట్ ను త్యాగం చేయగా.. మానస్ తండ్రి, ఫ్రెండ్ అమర్ దీప్ స్టేజ్ పైకి వచ్చారు. కాసేపు సరదాగా మాట్లాడారు. తరువాత టాప్ 5 కంటెస్టెంట్స్ గా మానస్, సన్నీ, కాజల్, శ్రీరామచంద్ర, కాజల్ ల ఫొటోలు బోర్డుపై పెట్టారు.
కాజల్ అన్ సేఫ్..
కాజల్ తను ఎంతో ప్రేమగా చూసుకొనే బొమ్మను త్యాగం చేసింది. దీంతో ఆమెని కలవడానికి కాజల్ సిస్టర్ జెరీన్, సింగర్ లిప్సిక వచ్చారు. టాప్ 5 కంటెస్టెంట్స్ ముందుగా కాజల్, సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్ ల ఫొటోలను బోర్డుపై పెట్టారు. లిప్సిక తన చేతిలో ఉన్న ఎన్విలాప్ ని ఓపెన్ చేయగా.. అందులో కాజల్ అన్ సేఫ్ అని వచ్చింది.
శ్రీరామ్ సేఫ్..
శ్రీరామచంద్ర.. హమీద తనకు గిఫ్ట్ ఇచ్చిన ఒక వస్తువుని త్యాగం చేయగా.. స్టేజ్ పైకి శ్రీరామ్ తల్లి, అతడి ఫ్రెండ్ సౌమ్య వచ్చారు. శ్రీరామ్ ని చూసి ఎమోషనల్ అయ్యారు అతడి తల్లి జయలక్ష్మి. టాప్ 5 కంటెస్టెంట్స్ గా శ్రీరామ్, రవి, ప్రియాంక, సన్నీ, షణ్ముఖ్ ల ఫొటోలను బోర్డుపై పెట్టారు. ఆ తరువాత శ్రీరామ్ తల్లి జయలక్ష్మి చేతిలో ఉన్న ఎన్విలాప్ ఓపెన్ చేయగా.. అందులో శ్రీరామ్ సేఫ్ అని వచ్చింది.
షణ్ముఖ్ కి దీప్తి సలహా..
షణ్ముఖ్.. దీప్తి తనకు గిఫ్ట్ గా ఇచ్చిన టీషర్ట్ ను త్యాగం చేయగా.. ముందుగా షణ్ముఖ్ బ్రదర్ సంపత్ స్టేజ్ పైకి వచ్చారు. ఆ తరువాత దీప్తి ఎంట్రీ ఇచ్చింది. అది చూసిన షణ్ముఖ్ తెగ ఆనందపడిపోయాడు. దీప్తి రాగానే.. 'ఐ మిస్డ్ యు.. అని చెప్పి సచ్చినోడా..' అని తిట్టేసింది. 'ఎందుకు అంత వీక్ అయిపోతున్నావ్.. ఎమోషన్స్ అన్నీ స్ట్రెంగ్త్ అయ్యేలా చూస్కో..' అంటూ సలహా ఇచ్చింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్ ఫొటోలను బోర్డుపై పెట్టారు. షణ్ముఖ్ నువ్ తోపు అంటూ డైలాగ్ వేసింది. దీప్తి తన చేతిలో ఉన్న ఎన్విలాప్ ఓపెన్ చేయగా.. అందులో షణ్ముఖ్ అన్ సేఫ్ అని వచ్చింది.
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion