అన్వేషించండి

Bigg Boss 5 Telugu: నామినేషన్ లో ఏడుగురు.. 'నేనే లీడర్' అంటూ శ్రీరామ్ కి సన్నీ పంచ్..

ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ రోజు జరిగే నామినేషన్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

19 మంది కంటెస్టెంట్ తో మొదలైన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ రోజు జరిగే నామినేషన్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. 

Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..

నామినేషన్ ప్రక్రియ: 
 
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. హౌస్ మేట్స్ ముందు వాళ్ల ఫొటోలతో దిష్టి బొమ్మలు పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ తము నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు కంటెస్టెంట్ల దిష్టిబొమ్మలపై కుండను పెట్టి పగలగొట్టాల్సి ఉంటుంది.
 
రవి - ఇంట్లో పనులు సరిగ్గా చేయడం లేదని సన్నీని నామినేట్ చేశాడు. ఇంట్లో పనులు కూడా పెర్ఫెక్ట్ గా చేస్తే నువ్వు బెటర్ పెర్సన్ అవుతావని సన్నీకి రవి చెప్పగా.. 'నువ్ మారమంటే నేను మారితే అది నేను కాదు మామ' అంటూ రిప్లై ఇచ్చాడు సన్నీ. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. సిరి-షణ్ముఖ్ లపై ఉన్న డౌట్ ను రవి చెప్పాడని ఫిట్టింగ్ పెట్టడం కరెక్ట్ కాదని రీజన్ చెప్పాడు. ఈ విషయంలో కాజల్-రవిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరి మధ్య రిలేషన్ చెడగొట్టాలని చూశావ్ అని కాజల్ పై మండిపడ్డాడు రవి. 
 
ప్రియాంక - షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. 'నేను గేమ్ సరిగ్గా ఆడలేదని అంటున్నారు. కానీ మీరు లాస్ట్ వీక్ నుంచి సరిగ్గా ఆడలేదు' అని నామినేట్ చేసింది. ఆ తరువాత సిరిని నామినేట్ చేస్తూ.. 'ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడు..' అంటూ కామెంట్ చేసింది. 'నువ్ నన్ను కామెడీ చేస్తూ.. నా వెనుక మాట్లాడుతున్నావ్' అంటూ సిరి మండిపడింది. 
 
షణ్ముఖ్ - రవిని నామినేట్ చేస్తూ.. 'కెప్టెన్ గా, సంచాలక్ గా నువ్ స్ట్రాంగ్ గా లేవనిపించింది' అని రీజన్ చెప్పగా.. రవి వాదించాడు. ఏది కరెక్ట్ చేయలేదని షణ్ముఖ్ ని ప్రశ్నించాడు. 'నేను కెప్టెన్ గా చేసినప్పుడు సంచాలక్ గా బెటర్ చేశాననిపించింది' అని రవికి రీజన్ చెప్పాడు షణ్ముఖ్. దానికి రవి 'కంపారిజన్స్ అంటే.. గేమ్ నీకంటే అందరూ బాగా ఆడుతున్నారు' అంటూ కౌంటర్ వేశాడు. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలని.. నాగార్జున సార్ ముందు అడగడం నచ్చలేదని' రీజన్ చెప్పాడు. 
 
శ్రీరామ్ - కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో సన్నీ కారణంగా తన గేమ్ ఆగిపోయిందని శ్రీరామ్ రీజన్ చెప్పగా.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సమయంలో శ్రీరామ్ 'నేను ఐదు కోట్ల మంది ప్రజలు ఒక గ్రూప్' అని అనగా.. 'ఆ గ్రూప్ కి లీడర్ ని నేను' అంటూ పంచ్ వేశాడు సన్నీ. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఒకర్ని సేవ్ చేసే ఆప్షన్ ఉన్నప్పుడు నువ్ ఇద్దరినీ డిస్ట్రాయ్ చేయడం నాకు నచ్చలేదు' అని రీజన్ చెప్పగా.. 'నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు నాకు నచ్చినట్లు నేను గేమ్ ఆడతాను' అని బదులిచ్చింది కాజల్. 'నువ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు వాల్యూస్ కూడా మర్చిపోతావ్' అని డైలాగ్ వేశాడు శ్రీరామ్. దానికి కాజల్ సీరియస్ అయింది. 'నువ్ సర్వం అగ్ని' అంటూ కౌంటర్ వేశాడు శ్రీరామ్.
 
సన్నీ - రవిని నామినేట్ చేస్తూ.. 'ఏదో ఒక పర్సన్ ని బ్లేమ్ చేయడానికి ముందుంటావ్ కానీ మంచి చెప్పడానికి వెనక ఉంటావ్' రీజన్ చెప్పాడు. 'తప్పు చేస్తే మొహం మీదే చెప్తా' అంటూ రవి వేలు చూపించి మాట్లాడాడు. వెంటనే సన్నీ 'వేలు దింపు' అని అడగ్గా.. 'నువ్ చూపీరా' అంటూ రెచ్చగొట్టాడు రవి. 'మోస్ట్ ఫేక్ పర్సన్ అంటే నువ్వే మచ్చా' అంటూ రవికి డైలాగ్ వేశాడు సన్నీ. 'ముందు కామన్ సెన్స్ తెచ్చుకో..' అంటూ రవి.. 'నీకు ఉంటే పక్కనోళ్లకు చెప్పడానికి' అంటూ పంచ్ వేశాడు సన్నీ. ఆ తరువాత శ్రీరామ్ ని నామినేట్ చేశాడు. సన్నీ రీజన్స్ చెప్పగా.. శ్రీరామ్ ఫైర్ అయ్యాడు. 'మొహం చూసి మాట్లాడు.. అటు ఇటు చూసి కాదు' అని శ్రీరామ్ అనగా.. 'మజాక్ లు ఆడుకుంటూ.. మొహం మీద మాస్క్ లు వేసుకొని' అని సన్నీ డైలాగ్ వేయగా.. 'ఛల్ ఛల్.. గ్రూప్ లాడుకుంటూ.. నువ్వేం మాట్లాడతావ్' అంటూ సన్నీని రెచ్చగొట్టేలా శ్రీరామ్ మాట్లాడగా.. 'నేనిలానే ఉన్నా.. ఒరిజినల్' అంటూ సినిమాటిక్ గా చెప్పాడు సన్నీ. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. మధ్యలో మానస్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు.  
 
సిరి - ప్రియాంకను నామినేట్ చేస్తూ.. 'నువ్ నా వెనక మాట్లాడడం, నన్ను నామినేట్ చేయడం' నచ్చలేదని రీజన్ చెప్పింది. ఆ తరువాత రవిని నామినేట్ చేసింది. 
 
కాజల్ - రవిని నామినేట్ చేస్తూ.. 'నీకు ధైర్యం లేదా..? జ్ఞాపకశక్తి లేదా..?' అని ప్రశ్నించింది కాజల్. 'నా మెమొరీ గురించి నాకు తెలుసు.. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు' అని చెప్పాడు రవి. 'ఒకరి ఇంటెన్షన్ బ్యాడ్ ఉంది.. రిలేషన్ పాడు చేయాలనుకుంటుందని బ్లేమ్ చేయకు. ఈ హౌస్ లో నాకు ఇష్టంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే' అంటూ రీజన్స్ చెప్పింది. ఆ తరువాత శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. 'గేమ్ మధ్యలో ఉసురు పోసుకోవడం వంటి వర్డ్స్ యూజ్ చేయడం నచ్చలేదని' రీజన్ చెప్పింది. 
 
మానస్ - శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. 'కెప్టెన్ అవ్వగానే.. ఆల్ ది బెస్ట్ సంచాలక్ అని అన్నావ్. నన్ను టార్గెట్ చేయడానికి ఎదురుచూస్తున్నావ్' అంటూ రీజన్ చెప్పాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేస్తూ.. 'హౌస్ లో ఏం జరగాలో నువ్ డిసైడ్ చేయకు' అని డైలాగ్ వేశాడు మానస్. 
 
ఈ వారం నామినేట్ అయిన సభ్యులు రవి, సన్నీ, శ్రీరామ్, కాజల్, సిరి, షణ్ముఖ్, ప్రియాంక.
 
 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget