Bigg Boss 5 Telugu: యానీ మాస్టర్ అవుట్.. వెళ్తూ వెళ్తూ కాజల్ కి ఏం చెప్పిందంటే..?

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఉండడంతో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..?

FOLLOW US: 

స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున.. హౌస్ మేట్స్ తో ఓ టాస్క్ ఆడించారు. ఒక్కో కంటెస్టెంట్ ని ఇతర హౌస్ మేట్ అడిగిన ప్రశ్నను చదివి వినిపిస్తానని.. కానీ ఆ హౌస్ మేట్ ఎవరో చెప్పనని అన్నారు నాగార్జున. ముందుగా శ్రీరామచంద్రను 'శ్రీరామ్ ఎన్నో మాస్క్ ల వెనకాల దాక్కున్నాడా..?' అని నాగ్ చదవగా.. ఫస్ట్ వీకే తీసేశానని అన్నాడు. వెంటనే నాగార్జున.. 'మానస్ నీకెందుకు అలా అనిపించిందని' అడిగేశారు. 'నువ్ యాక్టింగ్ సూపర్ స్టార్ కాకుండా.. సింగింగ్ సూపర్ స్టార్ ఎలా అయ్యావ్' అని అడిగారు నాగార్జున. నేనేం యాక్ట్ చేయడం లేదని అన్నాడు శ్రీరామ్. 

Also Read: విజయ్ దేవరకొండతో అనన్య పాండే హార్స్ రైడింగ్..

షణ్ముఖ్ తో ఉన్న బాండింగ్ వలన ఆటలో వెనక బడుతున్నావా..? అని సిరిని ప్రశ్నించారు నాగార్జున. లేదని సమాధానం చెప్పింది సిరి. షణ్ముఖ్-సిరి కలిసి గేమ్ ఆడాలని ముందే అనుకొని హౌస్ లోకి వచ్చారా..? అని రెండో ప్రశ్న అడగ్గా.. 'లేదని.. అసలు బయట షణ్ముఖ్ కి తనకి అసలు పడదని' చెప్పుకొచ్చింది సిరి.

షన్నును ప్రశ్నిస్తూ.. టాస్క్ అనగానే సన్నీ వైపు చూస్తావ్.. అతడు మరీ అంత వైల్డా? అని నాగ్ ప్రశ్నించారు. 'ఎస్ సార్.. టాస్క్ విషయంలో తను వైల్డ్' అని చెప్పాడు. 'నువ్ సేఫ్ ప్లేయర్ అనుకుంటున్నావు. ఎమోషన్స్ కోసం గేమ్ లో డీవియేట్ అవుతున్నావ్' అని రెండో ప్రశ్న అడగ్గా.. 'నేను సేఫ్ ప్లేయర్ ని కాదు. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. ఎమోషన్స్ వలన డీవియేట్ అయినా.. మళ్లీ బ్యాక్ వచ్చేస్తానని' అన్నాడు షణ్ముఖ్. 
ఆ తరువాత మానస్ ని 'నాతో స్ట్రెయిట్ గా మాట్లాడడానికి భయపడుతున్నావా..?' అని షణ్ముఖ్ అడిగాడని నాగార్జున ప్రశ్నించారు. 'అదేం లేదని.. మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా.. షణ్ముఖ్ మాట్లాడలేదని' సమాధానం ఇచ్చాడు మానస్. 'ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఎలా ఉంటుంది?' రెండో ప్రశ్న అడిగారు నాగార్జున. దీనికి మానస్.. 'ఫ్రెండ్స్‌గా ఉంటాం' అని సమాధానం ఇచ్చాడు. దీంతో సన్నీ ఆన్సర్ దొరికిందా అనగానే.. మీరు నా పేరు చెప్పందంటే చెప్పేశారు అని ఫన్నీగా అన్నాడు. ప్రియాంక ప్రశ్న చదువుతూ.. 'నువ్వు మానస్ నుంచి ఏమి ఆశిస్తున్నావ్' అని అడిగారు నాగార్జున. ఈ ప్రశ్న మానస్ అడిగాడు అని చెప్పగానే ప్రియాంక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాజల్ కొంచెమైనా నీకు నచ్చుతుందా..? అని అడగ్గా.. బాగా నచ్చుతుందని చెప్పింది ప్రియాంక. 

యానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తూ.. 'నీ బుర్రను వంట చేసేప్పుడు, మేకప్ అయ్యేప్పుడు మాత్రమే వాడతావా?' అని అడిగారు నాగార్జున. ఇందుకు యానీ 'లేదని' సమాధానం చెప్పడంతో.. నాగ్ 'బుర్రలేదా' అని పంచ్ విసిరారు. ఆ ప్రశ్న రవి అడిగాడని తెలుసుకున్న యానీ.. అతడిని కుమ్మేసింది. 

'నువ్ బీబీ టైటిల్ గెలవడానికి వచ్చావా..? గెలిపించడానికి వచ్చావా..?' అని సన్నీని ప్రశ్నించగా.. 'టాస్క్ లో నా గేమ్ నేను ఆడతానని, ఫ్రెండ్స్ గురించి ఆడనని' సమాధానం చెప్పాడు సన్నీ. 'నీకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండడం ఇష్టమా..?' అని ప్రశ్నించగా.. 'అందరిలో ఒకడిగా ఉండాలనుకుంటాను' అని చెప్పడాడు సన్నీ. 'నువ్ ఆడితే గేమ్.. అవతలివాళ్లు ఆడితే ఎందుకు తీసుకోలేవని' సిరి ప్రశ్నించిందని.. సన్నీని అడిగారు నాగ్. 'స్ట్రాటజీతో ఆడనని, గేమ్ ఎలా అనిపిస్తే ఆలా ఆడతానని' చెప్పుకొచ్చాడు సన్నీ. 

'నువ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా..? గేమ్ లో నా మైండ్ ని ప్రవోక్ చేయడానికి ట్రై చేస్తున్నావా..?' అని రవిని నాగార్జున ప్రశ్నించారు. ఈ ప్రశ్న శ్రీరామ్ అడిగారని చెప్పారు. 'అసలు లేదని' సమాధానం చెప్పాడు రవి. 'నువ్ స్ట్రెయిట్ గా ఎందుకు ఆడవు. ఇక్కడ అందరిని ఎందుకు వాడుకుంటున్నావ్..?' అని ప్రశ్నించగా.. 'ఇక్కడ ఉన్నది వాడుకోవడానికే కదా..' అని సమాధానం చెప్పాడు రవి. 'సన్నీని ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తున్నావా..?' అని కాజల్ ని అడగ్గా.. 'అవునని చెప్పింది' కాజల్. 

కాజల్ సేఫ్.. 

నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో కాజల్ సేవ్ అయిందని.. ముందుగా ప్రకటించారు నాగార్జున. 

బిగ్ బాస్ హౌస్ లో 'అనుభవించు రాజా' టీమ్..  

బిగ్ బాస్ స్టేజ్ పైకి 'అనుభవించు రాజా' సినిమా టీమ్ వచ్చింది. హీరో రాజ్ తరుణ్ ను చూసి బాగా ఎగ్జైట్ అయ్యింది సిరి. రాజ్ అంటూ గట్టిగా అరిచింది. 'ఏంటి సిరి విశాఖపట్టణం కనెక్షనా..?' అని అడిగారు నాగార్జున. ఆ తరువాత రాజ్ తరుణ్ 'హే సిరి సంబంధాలు చూస్తున్నాం' అని అనగా.. దానికి సిరి సిగ్గుపడింది. వెంటనే రాజ్ తరుణ్ 'నీకు కాదు..' అంటూ ఆటపట్టించాడు. 

ఆ తరువాత హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఒక్కో కంటెస్టెంట్ కి వేరే హౌస్ మేట్స్ పేర్లు ఇచ్చి.. బోర్డు మీద వాళ్ల గురించి డ్రాయింగ్ గీస్తే.. మిగిలిన వాళ్లు గెస్ చేయాలి. సన్నీ ఫైర్ గురించి కమెడియన్ సుదర్శన్ పంచ్ లు వేయగా.. నవ్వేశాడు సన్నీ. ఆ తరువాత ప్రియాంక బోర్డు మీద ఏవో పిచ్చిగీతలు వేయగా.. అది శ్రీరామ్ అని కరెక్ట్ గా గెస్ చేశాడు మానస్. వెంటనే నాగార్జున.. 'ప్రియాంక పిచ్చిగీతలను అర్ధం చేసుకున్న మానస్' అంటూ కామెంట్ చేశారు.

మానస్, షణ్ముఖ్ సేఫ్.. 

నామినేషన్ లో ఉన్న మిగిలిన ఐదుగురిని మైక్ ముందుకు వచ్చి మాట్లాడమన్నారు నాగార్జున. ఎవరు మాట్లాడినప్పుడు చప్పట్లు వినిపిస్తాయో వాళ్లు సేఫ్ అని చెప్పారు. ఈ టాస్క్ లో మానస్, షణ్ముఖ్ సేవ్ అయ్యారు. 

డైలాగ్ కొట్టు గురు.. 

హౌస్ మేట్స్ తో డైలాగ్ కొట్టు గురు అనే టాస్క్ ఆడించారు. సన్నీకి 'నన్ను రెచ్చగోక్కు' అనే డైలాగ్ ఇచ్చాడు మానస్. రెచ్చగొట్టనంత వరకే సైలెంట్ గా ఉంటాడని రీజన్ చెప్పాడు. రవికి 'నమ్మకం లేదు దొరా' అనే డైలాగ్ ఇచ్చాడు షణ్ముఖ్. ఆ తరువాత 'సర్ సర్లే చాలా చూశాం..' అనే డైలాగ్ ను రవి.. షణ్ముఖ్ కి ఇచ్చాడు. యానీ 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో' అనే డైలాగ్ రవికి ఇచ్చింది. 'ఓన్లీ వన్స్ ఫసక్' అనే డైలాగ్ ను మానస్ కి ఇచ్చింది ప్రియాంక. 'ఏమో సార్ నాకు కనపడదు' అనే డైలాగ్ ను షణ్ముఖ్ కి ఇచ్చాడు శ్రీరామ్. 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అనే డైలాగ్ ను షణ్ముఖ్ కి ఇచ్చింది సిరి. 'నీ బొంద రా నీ బొంద' అనే డైలాగ్ ను శ్రీరామ్ కి ఇచ్చింది కాజల్. 'అయిపాయే' అనే డైలాగ్ ను రవికి ఇచ్చాడు సన్నీ. 

సిరి సేఫ్.. 
నామినేషన్ లో ఉన్న ముగ్గురిలో సిరి సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. 

యానీ అవుట్.. 

యానీ, ప్రియాంక నామినేషన్ లో లాస్ట్ వరకు ఉండడంతో.. వారిద్దరినీ గార్డెన్ ఏరియాకు పిలిచారు నాగార్జున. వారిద్దరికీ అడుగుల టాస్క్ ఇచ్చిన నాగార్జున.. ఫైనల్ గా యానీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వెంటనే ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. యానీని హత్తుకొని ఏడ్చేసింది. కాజల్ కూడా యానీని హగ్ చేసుకొని గుడ్ బై చెప్పింది.

మానస్ కి ప్రేక్షకుల నుంచి ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే.. 'ముందు వారాలు బాగానే ఆడిన మీరు.. కొన్ని వారాలుగా పింకీతో ఉంటున్నారు.. కంటెంట్ కోసమా..?' అని అడగ్గా.. 'పింకీ కనెక్ట్ అయిందని.. కొన్ని రోజులుగా కొట్టుకుంటున్నామని.. కానీ జెన్యూన్ గా ఉన్నామని.. కంటెంట్ కోసం ఆమెతో ఉండడం లేదని.. నచ్చి ఉంటున్నానని' సమాధానం చెప్పాడు మానస్.  

స్టేజ్ పైకి వచ్చిన యానీ మాస్టర్ ని హౌస్ మేట్స్ గురించి ఏం అనుకుంటున్నారో చెప్పమని అడిగారు నాగార్జున. 'ఫస్ట్ నుండి నన్ను బాగా మోటివేట్ చేశావ్ అని' రవికి చెప్పింది యానీ. 'శ్రీరామ్ కొన్ని వారాలుగా తనకు అండగా ఉన్నాడని' చెప్పింది యానీ. 'మనం ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పుడు మాట్లాడినా.. బాగా మాట్లాడారు' అని షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. 'పటాకా' అంటూ సిరికి చెప్పింది. 'నీ గేమ్ నువ్ బాగా ఆడుతున్నావ్.. అలానే ఆడు' అని ప్రియాంకకి చెప్పింది. టాప్ 8లో ఉన్న కాజల్ కి కంగ్రాట్స్ చెప్పింది యానీ. 'బయటకొచ్చాక మనం ఫ్రెండ్స్ అవుదామని' మానస్ తో, సన్నీని మిస్ అవుతానని చెప్పింది యానీ. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 Siri Bigg Boss 5 Telugu Elimination Anee Master

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Bigg Boss OTT Telugu: ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే?

Bigg Boss OTT Telugu: ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న