అన్వేషించండి

Bigg Boss 17: రూ.2 కోట్లు ఇస్తా, బిగ్ బాస్ నుంచి నన్ను బయటకు పంపేయండి - కంటెస్టెంట్ సీరియస్ కామెంట్స్

Bigg Boss 17 : బిగ్ బాస్ హిందీలో సీజన్ 17కు చెందిన ఒక కంటెస్టెంట్.. తాజాగా తన హౌజ్‌లో ఉండడం నచ్చడం లేదని, డబ్బులు ఇచ్చి అయినా సరే వెళ్లిపోతా అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్‌ అనేది అందరు కంటెస్టెంట్స్‌కు కొత్తే. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొందరు సెలబ్రిటీలు తమంతట తాముగా ఈ రియాలిటీ షోలోకి వస్తారు. అలా వచ్చిన అందరినీ బిగ్ బాస్ సమానంగానే చూస్తారు. ఎవరైనా ధైర్యం కోల్పోతే.. వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కానీ కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఆట విషయంలో మాత్రం బిగ్ బాస్ జోక్యం చేసుకోరు. టాస్కులు ఇచ్చినప్పుడు కంటెస్టెంట్ నుండే ఒకరిని సంచాలకులుగా ఎంపిక చేసి వారి నిర్ణయమే ఫైనల్ అని చెప్తారు. కానీ తాజాగా బిగ్ బాస్ 17లో బిగ్ బాస్ మాత్రమే కాదు.. సల్మాన్ ఖాన్ సైతం పక్షపాతంగా ఉంటున్నాడంటూ ఒక కంటెస్టెంట్.. స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా ఇప్పటికిప్పుడు హౌస్ నుంచి వెళ్లిపోతా అని కూడా అన్నాడు.

సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు..
ప్రస్తుతం హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 17లో ఒక కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు అనురాగ్ దోభల్. యూకే07 రైడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్.. గతకొంతకాలంగా బిగ్ బాస్‌పైనే ద్వేషం పెంచుకున్నాడు. మామూలుగా బిగ్ బాస్ హౌస్‌లో అందరిని సమానంగా చూడడం లేదని, కొందరికి ప్రత్యేకమైన సౌకర్యాలు అందుతున్నాయని కంటెస్టెంట్స్ ఆరోపించడం మామూలే. కానీ బిగ్ బాస్ హోస్ట్ అయిన సల్మాన్ ఖాన్‌ను సైతం పక్షపాతి అని పిలిచాడు అనురాగ్. సల్మాన్ ప్రతీసారి కావాలనే తన ఫ్యాన్‌బేస్ గురించి, ఫాలోయింగ్ గురించి, ఫ్యాన్ క్లబ్స్ గురించి మాట్లాడతాడు అని అనురాగ్.. తన తోటి కంటెస్టెంట్ అయిన సనా రేయిస్ ఖాన్‌తో చెప్పుకొచ్చాడు.

రూ.2 కోట్లు ఇచ్చి వెళ్లిపోతా..
ఏదో ఒక విషయంలో తరచుగా తనను అవమానించినట్టుగా అనిపిస్తుందని అనురాగ్.. ఇతర కంటెస్టెంట్స్‌తో చెప్పి బాధపడడం మొదలుపెట్టాడు. తనకు అసలు హౌస్‌లో ఉండాలని లేదని బిగ్ బాస్‌పై ఎప్పుడూ ఏదో ఒక కంప్లయింట్ ఇస్తూనే ఉన్నాడు ఈ కంటెస్టెంట్. ఆఖరికి బిగ్ బాస్ కూడా పక్షపాతంగానే వ్యవహరిస్తున్నాడని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తనకు ఈ గేమ్‌ కంటే ఫ్యామిలీ, ఫ్రెండ్సే ముఖ్యమని అన్నాడు. ఒకవేళ షోను మధ్యలో నుంచి వదిలేయాలంటే డబ్బులు కట్టాలి అంటే తాను రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమన్నాడు. అది విన్న తన తోటి కంటెస్టెంట్స్ అభిషేక్ కుమార్, మన్నారా చోప్రా.. ఆ డబ్బులు తమకు ఇవ్వొచ్చు కదా అంటూ కామెడీ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 17 కంటెస్టెంట్స్ లిస్ట్..
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 17లో అంకితా లోఖండే, అభిషేక్ కుమార్, ఈషా మాల్వియా, నీల్ భట్, సన్నీ ఆర్య, రింకూ దావన్, అరున్ మాషెట్టి, ఫిరోజా ఖాన్ అలియాస్ ఖాన్‌జాదీ, సనా రేయిస్ ఖాన్, అనురాగ్ దోభల్, మన్నారా చోప్రా, మునావర్ ఫారుఖీ, విక్కీ జైన్, ఐశ్వర్య శర్మ, సమర్థ్ జురేల్.. కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎలిమినేషన్‌లో జిగ్నా వోరా.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయింది. ఇక బాలీవుడ్‌లోని ఏ పార్టీలో చూసినా కనిపించే ఒర్హాన్ అవత్రామని అలియాస్ ఓర్రీ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడని టాక్ మొదలయ్యింది. 

Also Read: అర్జున్ ఆలోచన వంకర - శివాజీ స్టేట్‌మెంట్, టికెట్ టు ఫైనల్ రేసులో ఆ ఇద్దరూ, SPY బ్యాచ్ ఔట్?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget