Bigg Boss Telugu 7: శోభపై కోపం - లాఠీ విసిరేసి, అశ్వినీపై మండిపడ్డ అమర్ - ఫన్నీ టాస్క్ సీరియస్ టర్న్!
Bigg Boss Telugu 7: తాజాగా కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఒక మర్డర్ టాస్క్‌ను ఇచ్చారు. చాలావరకు ఈ టాస్క్ అంతా సరదాగా సాగుతుండగా.. అశ్విని, అమర్‌ల మధ్య గొడవ మొదలయ్యింది.
బిగ్ బాస్‌లో చాలావరకు టాస్కులు సీరియస్‌గానే జరిగినా.. కొన్ని టాస్కులు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా కూడా ఉంటాయి. అదే విధంగా తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన మర్డర్ టాస్క్.. కంటెస్టెంట్స్‌ను మాత్రమే కాదు.. ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. ఈ టాస్కులో ముందుగా అమర్‌దీప్, అర్జున్‌లను పోలీస్ ఆఫీసర్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇక మిగతా కంటెస్టెంట్స్‌కు ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు, మర్డర్ కేసును పోలీసులు ఎలా చేధించారు అనే విషయాలు నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో తెలియనున్నాయి. కొందరు కంటెస్టెంట్స్‌కు సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో ఈ మర్డర్ టాస్క్.. మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారింది.
నాకేమైనా పెళ్లామా..?
ఇప్పటికే బిగ్ బాస్ మర్డర్ టాస్క్‌కు సంబంధించి రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. మొదటి ప్రోమోలో అమర్, అర్జున్ కేసును చేధించే ప్రయత్నంలో ప్రేక్షకులను నవ్వించారు. దాంతో పాటు హౌజ్‌మేట్స్ అందరికీ తమ తమ పాత్రలను వివరించారు. అమర్.. కేసులో విచారణ జరిపిస్తుండగా.. ‘‘ఏం చేసి చచ్చావు ఇంతవరకు’’ అంటూ శివాజీ తనపై సీరియస్ అయ్యాడు. ఇక రతిక.. ‘‘నేనెప్పుడైనా నీతో మాట్లాడాలనుకుంటే కన్ను కొడతా పక్కకు రా’’ అని గౌతమ్‌తో చెప్పింది. దానికి ‘‘మంచిగా కన్ను కొట్టావు’’ అంటూ రతికకు కాంప్లిమెంట్ ఇచ్చాడు గౌతమ్.
ఇక నెక్లెస్ దొంగతనం చేయడానికి మీ మేడమ్‌ను హత్య చేశారు అని అర్జున్ చెప్పగానే హౌజ్‌మేట్స్ అంతా ఎమోషనల్ అయినట్టు ఓవరాక్షన్ మొదలుపెట్టారు. ‘‘చాలా ఓవర్‌గా ఉంటుంది అంత ఏడవకండి’’ అని శివాజీ.. వాళ్లకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ‘‘కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది కదా’’ అని ప్రియాంక చెప్పింది. ‘‘నాకేమైనా పెళ్లామా? కాదు కదా.. నాకు కూడా మేడమే కదా’’ అంటూ కామెడీ చేశాడు శివాజీ. ఆ తర్వాత శివాజీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్ బాస్.. తనకు నెక్లెస్‌ను అందజేశాడు. తనతో పాటు ప్రశాంత్‌కు కూడా ఒక సీక్రెట్ టాస్క్‌ను ఇచ్చాడు.
అమర్‌కు కోపం తెప్పించిన శోభా..
బిగ్ బాస్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్కును సక్సెస్‌ఫుల్ చేయడం కోసం ప్రశాంత్‌ను స్టోర్ రూమ్‌లో దాచిపెట్టాడు శివాజీ. దీంతో ప్రశాంతే నిందితుడు అంటూ పోలీసులు తనను వెతకడం మొదలుపెట్టారు. ఇలా టాస్క్ అంతా సరదాగా సాగుతున్న క్రమంలోనే అమర్‌దీప్, శోభా శెట్టిల మధ్య అనుకోకుండా గొడవ మొదలయ్యింది. ‘‘నువ్వు చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది శోభా. దానికి అమర్‌కు కోపం వచ్చి తన చేతిలో ఉన్న లాఠీని విసిరికొట్టాడు.
‘‘ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని. నేనేమైనా ఆపుతున్నానా’’ అంటూ సీరియస్ అయ్యాడు. దానికి అశ్వినికి కోపమొచ్చింది. ‘‘నన్ను చూసి చెప్పకు. నేనేం అనలేదు నిన్ను’’ అంటూ రివర్స్ అయ్యింది. ‘‘ఎందుకు చేస్తున్నారు వీళ్లు కావాలని నాకు అర్థం కావట్లేదు’’ అంటూ అయోమయంలో పడ్డాడు అమర్. ‘‘ఇప్పుడు గొడవ ఎవరికి జరిగింది తనకు, నీకు జరిగిందా? నీకు, నాకు జరిగిందా?’’ అని అరవడం మొదలుపెట్టింది అశ్విని. ‘‘గట్టిగా మాట్లాడకు జాగ్రత్త’’ అని తనకు వార్నింగ్ ఇచ్చాడు అమర్. అశ్విని కూడా ఏ మాత్రం తగ్గకుండా ‘‘నీకంటే గట్టిగా నేను మాట్లాడతా’’ అని కౌంటర్ ఇచ్చింది.
Also Read: విచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!