అన్వేషించండి

Bigg Boss OTT 2 : అందుకే ముద్దు పెట్టా, ‘బిగ్ బాస్’ నన్ను ఎందుకు ఆపలేదు - సల్మాన్‌పై ఆకాంక్ష ఫైర్

సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2' ప్రసారమవుతుండగా, ఈ షోలో కంటెస్టెంట్ ఆకాంక్ష పూరి, జైద్ ల లిప్ లాక్ వివాదంగా మారడంతో, దానిపై ఆకాంక్ష తాజాగా వివరణ ఇచ్చింది.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2' స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ షోలో కంటెస్టెంట్ ఆకాంక్ష పూరి మరో కంటెస్టెంట్ జైద్ కి లిప్ కిస్ ఇచ్చింది. కెమెరాలు ఉన్నాయనే విషయం తెలిసి కూడా ఈ జంట ముద్దుల్లో మునిగి తేలడంతో ఈ జంటపై విమర్శలు వెల్లువెత్తాయ్. ముఖ్యంగా ఆకాంక్ష పూరిని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెని షో నుంచి తప్పించారు. ఈ ఆదివారం ఆకాంక్ష ఎలిమినేట్ అయింది. ఆమెపై హోస్ట్ సల్మాన్ ఖాన్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆకాంక్ష దీనిపై వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

"నేను జియో నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ కోసం లిప్ లాక్ సన్నివేశాలు చేశాను. ఒకవేళ అది మన సంస్కృతికి విరుద్ధమైతే బిగ్ బాస్ మిమ్మల్ని అక్కడే ఆపేసి ఉండేవారు. కానీ అలా చేయలేదు. దానికి తోడు ఆ లిప్ కిస్ వీడియోని ప్రోమోగా కట్ చేసి వారి పేజీల్లో ప్రచారం చేస్తున్నారు. ఆ క్లిప్ నుంచి రీల్స్ ను సైతం తయారు చేస్తున్నారు. హోస్ట్ క్షమాపణ చెప్పాల్సినంత దారుణంగా అది ఉంటే, దాన్ని ప్రోమోగా ఎందుకు వాడారు? అంటూ అంటూ ప్రశ్నించింది ఆకాంక్ష.  

ఇక లిప్ కిస్ వివాదం పై మాట్లాడుతూ.. "నేను టాస్క్ లో భాగంగా మాత్రమే జైద్ కి ముద్దు ఇచ్చాను. షోలో టాస్కులు పూర్తి చేయడం చాలా ముఖ్యం. అందులో భాగంగానే ఓ 30 సెకండ్ల టాస్క్ లో భాగంగా జైద్ కి ముద్దు పెట్టాను. దాన్ని కేవలం నేను టాస్క్ లాగానే చూశాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఆ స్థానంలో జైద్ కాకుండా ఎవరన్నా ముద్దు పెట్టేదాన్ని అని అన్నారు ఆకాంక్ష పూరి. ఎందుకంటే ఎలాగైనా నేను ఈ టాస్క్ గెలవాలని అనుకున్నాను. లేకుంటే నా జట్టు మొత్తం ఓడిపోయేది. కానీ నేనెప్పుడూ నా జట్టు ఓడిపోవాలని అనుకోను. నేను ఎప్పుడైనా గెలిపించాలని ప్రయత్నిస్తాను. అందుకే గెలవడం కోసం అలా చేశాను" అంటూ తెలిపింది

"జైద్ కి ముద్దు ఇచ్చే సమయంలో నా మనసులో ఏం లేదు. అలాగే లిప్ కిస్ ఇవ్వడం ఇంత పెద్ద వివాదం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. సల్మాన్ ఖాన్ కోప్పడతారని కూడా నేను ఏమాత్రం భావించలేదు. వ్యక్తిగతంగా ముద్దు పెట్టాలనే ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అది టాస్క్ లో భాగంగా జరిగిపోయిందంటూ" వివరణ ఇచ్చారు ఆకాంక్ష పూరి. కాగా ఆకాంక్షపూరి తాజాగా ఇచ్చిన వివరణలో తనకు తాను సమర్థించుకొని మాట్లాడినట్లు ఉండడంతో కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ముద్దు వివాదంతో కంటెస్టెంట్ జైద్ పై కూడా తీవ్ర విమర్శలు రాగా అతను కూడా ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవారం ఎలిమినేషన్ లో జైద్ కూడా ఉండటంతో మరో నాలుగు రోజుల్లో అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అయి, బయటికి రావచ్చనే టాక్ వినిపిస్తోంది.

Also Read : ఆ సలహాలన్నీ నా సినిమాలకేనా? వేరే హీరోలకు ఎందుకు ఇవ్వరు? - నాగశౌర్య

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget