అన్వేషించండి

Naga Shaurya: ఆ సలహాలన్నీ నా సినిమాలకేనా? వేరే హీరోలకు ఎందుకు ఇవ్వరు? - నాగశౌర్య

ఈసారి ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగ శౌర్య. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు.

‘రంగబలి’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు నాగ శౌర్య. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. చాలా కాలం తర్వాత ఎలాంటి డైవర్షన్స్ పెట్టుకోకుండా మాట ఇచ్చిన్ ప్రకారం రంగబలి సినిమాలో నటించినట్టు చెప్పాడు. తను నటించిన కొన్ని సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయో కూడా వివరించాడు.

నాకే ఎందుకు ఈ సలహాలు

“ఒక సినిమా తీస్తున్నప్పుడు చాలా మంది వచ్చి సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయమని సలహాలు ఇస్తారు. నా సినిమాలకే ఎందుకు సలహాలు ఇస్తారు, వేరే హీరోల సినిమాలకు ఎందుకు సలహాలు ఇవ్వరు. వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డైరెక్షన్ చేయవచ్చు కదా. నేను చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఎందుకు ప్లాప్ అవుతున్నాయో నాకు మాత్రమే తెలుసు. అందుకే అప్పటి నుంచి ఒకటే అనుకున్నా ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కూడా నో చెప్పాలని డిసైడ్ అయ్యాను” అని అన్నారు. ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా దర్శకుడు తను అనుకున్నట్టుగానే తీసిన సినిమా ‘రంగబలి’. ఇది తప్పకుండా హిట్ అవుతుందని నాగ శౌర్య అంటున్నాడు. దర్శకుడు, నిర్మాత, హీరో ఒకే మాట ఉంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడు.

ఆ సినిమా అందుకే ప్లాప్

“ఒక సినిమా చేశాను. అందుకోసం భారీగా శరీరంలో మార్పులు కూడా చేసుకున్నా. కానీ మొదట్లో చెప్పినట్టుగా కాకుండా కొన్ని మార్పులు చేశారు. షూటింగ్ జరిగేటప్పుడే ఇది ఘోరంగా ప్లాప్ అవుతుందని చెప్పాను. కానీ నా మాట వినలేదు. కథ చెప్పినప్పుడు భారీ సెట్టింగ్ అలా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెట్ కి వెళ్తే మరొక విధంగా ఉంది. అప్పుడే అన్నాను ఇలా చేస్తే సినిమా ప్లాప్ అవుతుందని.. అయినా వినిపించుకోలేదు. కానీ ఆ సినిమా ఘోరంగా పరాజయం అయ్యింది” తన సినిమా విషయంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా పేరు మాత్రం బయటపెట్టలేదు. ఇలా సలహాలు ఇచ్చే వ్యక్తుల మాటలు వింటే సినిమా నాశనం అవుతుందని అన్నారు.

‘రంగబలి’ సినిమాలో యుక్తి దరెజా నాగశౌర్యకి జోడీగా నటించింది. జులై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్‌గా నటిస్తున్నాడు.‘ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 

Also Read; చియాన్ విక్రమ్ 'తంగళన్' వచ్చేది అప్పుడేనట? - ఆ మూవీ రిలీజ్ వాయిదానే కారణమా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ravi Mohan Vs Sujatha Vijayakumar: అల్లుడిగా అది నీ బాధ్యత... ఆమాత్రం ఖర్చు పెట్టలేవా? 'జయం' రవిపై అత్త సుజాత ఫైర్
అల్లుడిగా అది నీ బాధ్యత... ఆమాత్రం ఖర్చు పెట్టలేవా? 'జయం' రవిపై అత్త సుజాత ఫైర్
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
Tamil Producer K Rajan Death: నదిలో దూకి తమిళ నిర్మాత ఆత్మహత్య... షాక్‌లో కోలీవుడ్
నదిలో దూకి తమిళ నిర్మాత ఆత్మహత్య... షాక్‌లో కోలీవుడ్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC VS RR Result Updates: డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
Virat Kohli Records: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Embed widget