అన్వేషించండి

Thangalaan Release Date: చియాన్ విక్రమ్ 'తంగళన్' వచ్చేది అప్పుడేనట? - ఆ మూవీ రిలీజ్ వాయిదానే కారణమా?

విక్రమ్, పా రంజిత్ కాంబోలో వస్తున్న చిత్రం 'తంగళన్'. ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి క్రేజీ అప్ డేట్ వైరల్ గా మారింది.

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా హిస్టారికల్ అడ్వెంచర్ గా రూపొందుతున్న సినిమా తంగళన్. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి తాజా అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే యాభై శాతం మించిపోయింది. ఖర్చు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా 8 అంతర్జాతీయ అవార్డుల్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదే కారణమా..?

విక్రమ్ తంగళన్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకోవడానికి కారణం మరొక భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2 అని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2( తెలుగులో భారతీయుడు 2) నటిస్తున్నారు. ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ ఇది ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండియన్ 2 నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మిగిలే ఉందని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ కి ఇండియన్ 2 వాయిదా పడుతుందని తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి విక్రమ్ తంగళన్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రూపొందింది. అయితే, అదే కేజీఎఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా ‘తంగళన్’ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం 3Dలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు.

విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే 'తంగళన్' సినిమాకు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.  వీడియోలో ప్రధానంగా విక్రమ్ పాత్రను హైలెట్ చేసింది. విక్రమ్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్న విజువల్స్ ను అద్భుతంగా చూపించారు. ‘తంగళన్‌’లోని  పాత్రకు తగినట్లుగా విక్రమ్ తన బాడీని మలుచుకున్నారు. భారీగా బరువును తగ్గడంతో పాటు తన మజిల్స్ లో బలాన్ని తగ్గించుకున్నారు.  2023లో మోస్ట్ అవైటెడ్ గా తంగళన్ క్రేజ్ దక్కించుకుంది.

సంక్రాంతికి సినిమాల పండగే పండగ

ఇప్పటికే సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా విడుదల అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రవితేజ ‘ఈగల్’ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా సినిమా ‘హనుమాన్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12ణ విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విక్రమ్ సినిమా కూడా ఇదే టైమ్ కి వస్తే బరిలో భారీ బడ్జెట్ సినిమాలు నిలిచినట్టే.

Read Also: రష్మీ గొడవలోకి అనసూయ, పచ్చి బూతులతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 6th :కేశవ్‌తో ప్రేమ విషయం తెలిసి శైలూ ఇంట్లో గొడవలు...మహాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి
పొదరిల్లు: కేశవ్‌తో ప్రేమ విషయం తెలిసి శైలూ ఇంట్లో గొడవలు...మహాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి
Brahmamudi Serial Today July 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆస్తి కోసం రేఖ కొత్త ప్లాన్‌ - రాజును ఓదార్చిన వెంకీ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఆస్తి కోసం రేఖ కొత్త ప్లాన్‌ - రాజును ఓదార్చిన వెంకీ
Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
Gundeninda Gudigantalu July 06 Episode:సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.
గుండెనిండా గుడిగంటలు: సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget