News
News
X

Radha in Bigg Boss: ‘బిగ్ బాస్’ స్టేజ్‌పై అలనాటి తార రాధ - త్వరలో ఆ షోతో బుల్లితెరపై సందడి

‘బిగ్ బాస్’ వేదికపై సీనియర్ నటి రాధ ఎంట్రీ ఇచ్చారు. త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నట్లు ప్రకటించారు.

FOLLOW US: 
Share:

‘బిగ్ బాస్’ ఫినాలేలో సీనియర్ నటి రాధా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె వేదికపై భలే యాక్టీవ్‌‌గా కనిపించారు. వేదిక మీదకు స్టెప్పులు వేసుకుంటూ వచ్చిన ఆమెను చూస్తూ.. ‘‘రావడం కూడా స్టెప్స్‌తోనే వస్తున్నారా’’ అని అన్నారు. రాధా స్పందిస్తూ.. ‘‘స్టెప్స్ లేకుండా నడవలేను. నాలుగో తరగతి నుంచే నేను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను’’ అని అన్నారు. ఆ తర్వాత బాలాదిత్య.. మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను అని రాధాతో అన్నాడు. దీంతో నాగ్.. ‘‘మొన్న తమన్నా వచ్చినప్పుడు కూడా’’ అదే అన్నాడని పంచ్ వేశారు. అనంతరం బాలాదిత్యతో కలిసి రాధా స్టెప్పులు వేశాడు. త్వరలో ‘బీబీ జోడి’తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు రాధా ప్రకటించారు. ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నట్లు నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ షోకు శ్రీముఖి యాంకర్. 

ఇంతకు ముందు ‘బిగ్ బాస్’ హౌస్‌లోని మీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ‘కార్తికేయ-2’తో మంచి సక్సెస్ అందుకున్న నిఖిల్.. ‘18 పేజెస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునకు నిఖిల్ ఆ మూవీ విశేషాలను తెలిపాడు. అనంతరం నాగార్జున నిఖిల్‌కు ఒక టాస్క్ ఇచ్చారు. రెడ్ క్యాప్‌తో ఇంట్లోకి వెళ్లమని చెప్పారు. ఆ తర్వాత రెండ్ క్యాప్‌ను తలపై పెట్టి టాప్-5లో ఒకరిని ఎలిమినేట్ చేసి.. హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి.. హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్నాడు. క్యాప్ పట్టుకుని వారి చుట్టూ తిరుగుతూ.. టెన్షన్ పెట్టాడు. చివరికి రోహిత్‌కు రెడ్ క్యా్ప్ పెట్టి తనతోపాటు బయటకు తీసుకెళ్లిపోయాడు. 

కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా హౌస్ జర్నీని వేశారు నాగార్జున. అది చూసి అందరూ ఎమోషన్ అయ్యారు.కొందరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీరు చెంపల మీద నుంచి జారినా వారు కంట్రోల్ లో ఉన్నారు. కానీ గీతూ మాత్రం వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెను ఫైమా ఓదార్చసాగింది. అంతేకాదు టాప్ 5 కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడుతున్నంత సేపు ముఖం మాడ్చుకునే ఉంటుంది గీతూ. మిగతా అందరూ ఎలిమినేట్ వాళ్లే. కానీ వారు చాలా సాధారణంగా ప్రవర్తించారు. ఈమె మాత్రం తానే విన్నర్ అవ్వాల్సింది,మిస్ అయిపోయినట్టు తెగ ఫీలైపోతుంది. తన ప్రవర్తనలోనే లోపం ఉందని ఆమె ఇప్పటికీ తెలుసుకోలేకపోతుంది. 

‘బిగ్ బాస్’ సీజన్-6 ఈ ఏడాది సెప్టెంబరు 4న మొదలైంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరికి టాప్-4లో కీర్తి భట్, రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరు విజేత అవుతారనేది ఉత్కంఠంగా ఉంది. ప్రస్తుతం ముగ్గురి మధ్యే అసలైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, రేవంత్‌, శ్రీహాన్‌లలో ఒకరికి విజేత అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం సింగర్ రోహిత్ విజేతగా నిలిచే అవకాశాలున్నాయని, శ్రీహన్ రన్నరప్ అని తెలుస్తోంది. అసలు రిజల్ట్ ఏమిటనేది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. 

‘బిగ్ బాస్’ సీజన్-6లో పాల్గొన్న కంటెస్టెంట్లు వీరే

1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్  (సింగర్)

Published at : 18 Dec 2022 08:38 PM (IST) Tags: radha Bigg Boss Telugu season 6 Nagarjuna BB 6 Telugu BB Jodi

సంబంధిత కథనాలు

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Income Tax Rule: బిగ్‌బాస్‌, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Income Tax Rule: బిగ్‌బాస్‌, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!