By: ABP Desam | Updated at : 30 Jul 2021 10:12 AM (IST)
బిగ్ బాస్ సీజన్ 5.. బిగ్ అప్‌డేట్
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. నిజానికి ఇప్పటికే షో టెలికాస్ట్ కావాల్సింది కానీ కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు టెలికాస్ట్ చేయడానికి తేదీలను ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. సెప్టెంబర్ 5 నుండి ఈ షో బుల్లితెరపై వీక్షకులను అలరించడానికి రాబోతుంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో మొదలుపెట్టాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారట.
ప్రముఖ ఛానెల్ స్టార్ 'మా'లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారిగా ఈ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అతడి హోస్టింగ్‌ను ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. రెండో సీజన్ కోసం హీరో నానిని తీసుకొచ్చారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లకు సీనియర్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ ఎవరు కానున్నారనే వార్తలు వస్తున్నాయి. నాగార్జునకు బదులుగా హీరో రానాను తీసుకోబోతున్నట్లు టాక్. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో త్వరలో తెలియనుంది.
ఐదో సీజన్ పై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో సెట్ నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రతి సీజన్ మాదిరే ఈసారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితాలో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ-విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే వీరిలో ఎంతమందిని ఫైనల్ చేశారో తెలియదు. రీసెంట్ గా యాంకర్ రవిని ఇదే విషయంపై ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. ''ఏమో మరి.. అంట'' అంటూ వెటకారంగా బదులిచ్చాడు. దీన్ని బట్టి ఆయనైతే బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.
Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!
Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?
Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
/body>