News
News
X

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

యాంకర్ స్రవంతికి ఊహించని షాక్ ఎదురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేశారు.

FOLLOW US: 

బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపుకు హ్యాకర్స్ ఊహించని షాకిచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌‌లోని ఫొటోలు, వీడియోలన్నీ డిలీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలేవీ అందులో లేవు. కేవలం ఆమె చీరతో ఉన్న సాంప్రదాయ ఫొటోలను మాత్రమే వదిలేశారు. ఈ సందర్భంగా స్రవంతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, ఎంతో కష్టం మీద తమ టెక్నికల్ టీమ్ మళ్లీ ఆ అకౌంట్‌ను రీస్టోర్ చేశారని స్రవంతి పేర్కొంది. 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ‘జబర్దస్త్’ స్పెషల్ షోస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన స్రవంతి.. ఇటీవల ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసింది. అయితే, ‘బిగ్ బాస్’లో స్రవంతి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. కానీ, అక్కడ మంచి స్నేహితులను సంపాదించుకుంది. అషురెడ్డి, అజయ్‌లు ఆమెకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉండేవారు. వారి దోస్తీ ప్రేక్షకుల నుంచి ఓట్లు కురిపించలేకపోయింది. దీంతో స్రవంతి 42వ రోజే బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్‌ను వదిలేయాల్సి వచ్చింది. 

‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్రవంతి తన విశ్వరూపం చూపించింది. గ్లామర్ డోస్ పెంచేసింది. అప్పుడప్పుడు మోడ్రన్ డ్రెస్‌లో హాట్ హాట్ ట్రీట్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకుంది. ఒక వైపు సాంప్రదాయ దుస్తుల్లో మరోవైపు, వెస్ట్రన్ స్టైల్లో స్రవంతి.. కుర్రకారుకు ఫేవరెట్‌గా మారింది. స్రవంతికి పెళ్లైపోయింది. ప్రస్తుతం ఆమె భర్తతో అత్తారింట్లోనే ఉంటోంది. ‘బిగ్ బాస్’ షో సమయంలో ఆమె కెమేరాల వైపు చూస్తూ.. అత్తగారిని ఆశీర్వాదం కోరడం వైరల్ అయ్యింది. ప్రస్తుతం స్రవంతి పలు ప్రైవేట్ సంస్థల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బిజీ బిజీగా గడిపేస్తోంది. 

ఆమెకు వస్తున్న పాపులారిటీని దెబ్బతీయడానికే హ్యాకర్లు ఈ పని చేసి ఉంటారని స్రవంతి ఫాలోవర్లు అంటున్నారు. ప్రస్తుతం స్రవంతి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో అన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్ అయిపోయాయి. కేవలం ఆమె పాత ఫొటోలు మాత్రమే మిగిలాయి. హ్యాకర్లు మొత్తం కంటెంట్‌ను డిలీట్ చేసేయడంతో స్రవంతి తీవ్ర ఆవేదనకు గురైంది. తన బాధను వీడియో ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంది. దీనిపై ఏమందో ఆమె మాటల్లోనే వినండి. 

స్రవంతి ఆవేదనను ఇక్కడ చూడండి: 

View this post on Instagram
 
A post shared by sravanthi_Chokarapu (@sravanthi_chokarapu)

Also Read : ఆ రెండూ తప్ప - తనకు తాను మహేష్ బాబు పెట్టుకున్న రూల్స్ ఏంటో తెలుసా?

Also Read : ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Published at : 09 Aug 2022 06:48 PM (IST) Tags: sravanthi chokarapu Sravanthi Chokarapu Instagram Sravanthi Chokarapu Instagram Account Sravanthi Chokarapu instagram hacked Sravanthi Chokarapu Hacked

సంబంధిత కథనాలు

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Devatha October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

Devatha  October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Ennenno Janmalabandham October 6th: మాళవిక, ఖైలాష్ ని ఉతికి ఎండగట్టిన సులోచన- కుమిలి కుమిలి ఏడ్చిన మాలిని

Ennenno Janmalabandham October 6th: మాళవిక, ఖైలాష్ ని ఉతికి ఎండగట్టిన సులోచన- కుమిలి కుమిలి ఏడ్చిన మాలిని

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Man Murder: పెళ్లికి నో అన్న బావ, పగ తీర్చుకున్న బావ మరిది - రెండు కుటుంబాల్లో విషాదం!

Man Murder: పెళ్లికి నో అన్న బావ, పగ తీర్చుకున్న బావ మరిది - రెండు కుటుంబాల్లో విషాదం!