By: ABP Desam | Updated at : 09 Aug 2022 03:32 PM (IST)
Image Credit: Namratha/Instagram
Mahesh Babu Birthday: మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మహేష్ బాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే, అందరి విషెస్ కంటే ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పెట్టిన విషెస్ ప్రత్యేకమనే చెప్పుకోవాలి.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నమ్రత శిరోద్కర్ మహేష్ బాబుకు అభినందనలు తెలిపారు. ‘‘మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా నువ్వు నా ప్రపంచంలో వెలుగులు నింపావు. హ్యపీ బర్త్ డే MB. ఇలాగే మరిన్ని ఏళ్లు క్రేజీగా మన బంధాన్ని కొనసాగిద్దాం. లవ్ యూ’’ అని మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ విషెస్ చెప్పారు. కేవలం నమ్రతా మాత్రమే కాదు. చాలా మంది స్టార్ హీరోలు సైతం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మంత్రి రోజా ప్రత్యేక అభినందనలు తెలిపారు. సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వేలాది మంది శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో మహేష్ బాబు, నమ్రత ఒకరు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నమ్రత.. ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లల గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది. సితార చేసే అల్లరి, డ్యాన్స్, వారి వెళ్లిన వెకేషన్ ట్రిప్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు.. 2003లో మహేశ్ నటించిన రొమాంటిక్, యాక్షన్ సినిమాలు ‘పోకిరి’, ‘ఒక్కడు’ చిత్రాలను మంగళవారం థియేటర్లలో ప్రదర్శించారు. వాటితో వచ్చే డబ్బును చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల కోసం.. ఎంబీ ఫౌండేషన్‌కు అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా పోకిరి సినిమాను రీమాస్టర్ చేసి 4Kలో రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట కొన్ని థియేటర్లలలో మాత్రమే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అభిమానుల రెస్పాన్స్ అంతకంతకూ పెరగడంతో స్క్రీన్ల సంఖ్య పెంచుతూ వచ్చారు. ఇండియాతో పాటు ఓవర్సీస్‌తో కలిపి 175 స్క్రీన్స్ లో పోకిరిని 4K వెర్షన్‌లో విడుదల చేసినట్లు సమాచారం.
అత్యధిక సెంటర్లలో రెండోసారి ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా... రీ రిలీజ్ కు మూడు రోజుల ముందే అన్ని షోల టికెట్లు అమ్ముడైపోయాయి. హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్స్ అన్నింటిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలోని పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే థియేటర్లు హౌజ్ ఫుల్ అవటం ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది. అమెరికాలో దాదాపు 24 థియేటర్లలో పోకిరి స్క్రీనింగ్ కాబోతుంది. ఈ సినిమా విడుదలై పదహారేళ్లు అవుతున్నా ఎక్కడా క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం.
రాజన్నపై సూపర్ స్టార్ మహేశ్ మనసులో మాట.. #YSR #HBDSuperstarMahesh #MaheshBabu𓃵 #MaheshBabuBirthday pic.twitter.com/5NcbkBFdDG
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 9, 2022
Happiest Birthday @urstrulyMahesh !
— Ram Charan (@AlwaysRamCharan) August 9, 2022
Wishing you lots of happiness and great year ahead 🤗
ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022
మహేష్ బాబు.
ఆ భగవంతుడు అతనికి మరింత
శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻
Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi
Happy birthday dearest @urstrulyMahesh!
— Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2022
Wishing you love and laughter this year Chinnoda ❤️ pic.twitter.com/jPcmyazO8v
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>