Bigg Boss Abhijeet: 'బిగ్ బాస్' అభిజీత్‌కు త్వరలో సర్జరీ - ఆయనకు ఏమైందంటే?
Bigg Boss Abhijeet Injured: యంగ్ హీరో, 'బిగ్ బాస్' ఫేమ్ అభిజీత్ త్వరలో సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇంతకీ, ఆయనకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
![Bigg Boss Abhijeet: 'బిగ్ బాస్' అభిజీత్‌కు త్వరలో సర్జరీ - ఆయనకు ఏమైందంటే? Bigg Boss Abhijeet is preparing for surgery Know reasons behind his injury Bigg Boss Abhijeet: 'బిగ్ బాస్' అభిజీత్‌కు త్వరలో సర్జరీ - ఆయనకు ఏమైందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/84b35af97804e235ffd52120ab02c1731706688059959313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss Abhijeet getting ready for surgery: 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయమైన యువకుడు అభిజీత్. ఆ తర్వాత 'బిగ్ బాస్' షోతో ఆయనకు మరింత పాపులారిటీ వచ్చింది. ఇటు వెండితెర, అటు డిజిటల్ తెర ప్రేక్షకులకు అభిజీత్ బాగా తెలుసు. ఆయన అభిమానులకు ఓ న్యూస్. అది ఏమిటంటే... త్వరలో అభిజీత్ సర్జరీ చేయించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ, ఆయనకు ఏమైంది? ఏం సర్జరీ చేయించుకోబోతున్నారు? వంటి వివరాల్లోకి వెళితే...
ఫుట్ బాల్ ఆడేటప్పుడు... 2019లో!
ప్రస్తుతం అభిజీత్ నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు 2019లో ఓ ఇంజ్యూరీ అయ్యింది. ఫుట్ బాల్ ఆడేటప్పుడు మోకాలి దగ్గర ఇబ్బంది మొదలు అయ్యింది. ఆ తర్వాత చెకప్ చేయించుకుంటే గాయమైందని తెలిసింది. లిగ్మెంట్ సమస్య ఉందట. అందువల్ల, కాస్త పట్టి పట్టి నడుస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్య మళ్ళీ తిరగబెట్టింది. దాంతో సర్జరీ చేయించుకోక తప్పడం లేదు. అసలు, మళ్ళీ ఆ గాయం తిరగబెట్టడానికి కారణం ఏమిటంటే... ట్రెకింగ్!
నేపాల్ వెళ్ళినప్పుడు... ట్రెకింగ్ చేస్తుంటే?
అభిజీత్ ప్రకృతి ప్రేమికుడు. ఆయనకు బైక్ రైడింగ్, ట్రెకింగ్ వంటివి చాలా చాలా కష్టం. సాధారణంగా అందరూ సిమ్లా, మనాలి వంటి ప్రదేశాల్లో ట్రెకింగ్ చేయడానికి వెళతారు. కానీ, అభిజీత్ నేపాల్‌లోని ఓ ప్రదేశంలో ట్రెకింగ్ చేయాలని ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్లినప్పుడు మోకాలి సమస్య మళ్లీ తిరగబెట్టిందట!
Also Read: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పోటీగా రాంబాబు... ఏపీ ప్రజల ఓటు ఎటు వైపు?
Miss Perfect Web Series streaming date: ''నేపాల్‌లోని దసరా లేదా దీపావళి వంటి ప్రాంతాల్లో ట్రెకింగ్ చేస్తారు. ఆ టైంలో మనం తప్పకుండా ఇంటి దగ్గర ఉండాలి. లాస్ట్ టైం ట్రెకింగ్ పూర్తి చేయలేదు. ఈసారి తప్పకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాను'' అని అభిజీత్ చెప్పారు. ఆయన నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' ఫిబ్రవరి 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అభిజీత్... నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఏమైంది? అని అడిగితే... ఈ విషయం చెప్పారు.
Also Read: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!
అభిజీత్ నటించిన నాలుగో వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. ఇంతకు ముందు 'పెళ్లి గోల' అని ఒకటి చేశారు. తెలుగులో ఓటీటీ వేదికలకు ఇంతటి ఆదరణ లేని సమయంలో ఆ సిరీస్ వచ్చింది. ఆ తర్వాత 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' చేశారు. యాంథాలజీగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆయన ఓ కథలో కనిపించారు. 'మెయిల్' కూడా చేశారు. ఈ 'మిస్ పర్ఫెక్ట్' తనకు మరోసారి మంచి పేరు తీసుకు వస్తుందని అభిజీత్ చాలా నమ్మకంగా ఉన్నారు. తాము మంచి ప్రయత్నం చేశామని ఆయన చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)