అన్వేషించండి

Tollywood Review January: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!

Hits and Flops of Tollywood 2024 January: జనవరి 2024లో 20కు పైగా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో రెండు అంటే రెండు మాత్రమే సంపూర్ణ విజయం సాధించాయి. తెలుగు సినిమాకు 2024 ఫస్ట్ మంత్ ఎలా సాగిందో చూద్దాం!

తెలుగు సినిమాకు 2024 శుభారంభాన్ని ఇచ్చింది. కమర్షియల్ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని భరోసా ఇచ్చింది. కంటెంట్ మీద నమ్మకం ఉంటే భారీ సినిమాలతో పోటీ పడవచ్చని చిన్న హీరోలు, దర్శక నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చింది. జనవరిలో ఏయే సినిమాలు విడుదల అయ్యాయి? అందులో విజయాలు ఎన్ని? అనేది ఒకసారి చూద్దాం.

ఫేమస్ ఫిమేల్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయమైన 'సర్కారు నౌకరి'తో థియేటర్లలో తెలుగు సినిమా బోణీ కొట్టింది. 2024లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇది. ఆ రికార్డు దక్కింది. కానీ, ఆకాష్ పేరు మీద హిట్ రికార్డ్ అయితే రాలేదు. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో 'సర్కారు నౌకరి' విఫలమైంది. ఆ సినిమా థియేటర్లలో నుంచి త్వరగా బయటకు వచ్చింది. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. కానీ, 'సర్కారు నౌకరి'ని సోమవారం విడుదల చేశారు. ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. శుక్రవారమైన జనవరి 5న 'రాఘవ రెడ్డి', 'దీనమ్మ జీవితం', 'డబుల్ ఇంజిన్', '14 డేస్ లవ్' తదితర సినిమాలు విడుదల అయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడలేదు. అన్నీ ఫ్లాపులే.

సంక్రాంతి నుంచి అసలు సిసలైన సందడి షురూ!
2024లో థియేటర్లలో అసలు సిసలైన సందడి సంక్రాంతి సినిమాలతో మొదలు అయ్యిందని చెప్పాలి. జనవరి 11న పెయిడ్ ప్రీమియర్లతో 'హనుమాన్', మర్నాడు జనవరి 12న 'గుంటూరు కారం', 13న 'సైంధవ్', 14న 'నా సామి రంగ' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' భారీ విజయం సొంతం చేసుకుంది. అందులో కించిత్ సందేహం కూడా ఎవరికీ అవసరం లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉత్తరాదిలో, హిందీలో సైతం విజయ ఢంకా మోగించింది. 'హనుమాన్' 20 రోజుల హిందీ వెర్షన్ వసూళ్లు 'కెజియఫ్' లైఫ్ టైమ్ కలెక్షన్స్ కంటే ఎక్కువ. నార్త్ ఇండియాలో సినిమా సక్సెస్ ఏ రేంజ్ అనేది చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇక, ఓవర్సీస్ విషయానికి వస్తే... ఆల్రెడీ ఐదు మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మరో మిలియన్ డాలర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ కలెక్షన్లకు వస్తే రూ. 250 కోట్ల మార్క్ దాటింది. 'హనుమాన్'తో హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టార్ లీగ్‌లో ఎంటరైనట్టే! సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు రూపాయికి నాలుగైదు రూపాయలు లాభం అందించారు.

'గుంటూరు కారం' అంచనాలు అందుకోవడంలో ఒక అడుగు వెనుకబడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ డ్యాన్స్, ఆ ఎనర్జీకి పేరు వచ్చింది. అయితే, త్రివిక్రమ్ స్థాయి సినిమా కాదని విమర్శలు వచ్చాయి. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో ఓపెనింగ్స్ వచ్చాయి. పండగ సెలవుల తర్వాత కొన్ని ఏరియాల్లో 'గుంటూరు కారం' తీసేసి 'హనుమాన్'కు థియేటర్లు ఇవ్వవలసి వచ్చింది. చిన్న హీరో, సినిమా కావడంతో 'హనుమాన్'కు అన్యాయం జరిగిందని చెడ్డ పేరు మూట కట్టుకోవలసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 231 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. అది తప్పని కొన్ని కలెక్షన్స్ ట్రాకింగ్ సైట్స్ కామెంట్ చేశాయనుకోండి. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు లాస్‌ వచ్చిందని టాక్‌. అది పక్కన పెడితే... మహేష్ అభిమానులను 'గుంటూరు కారం' మెప్పించింది. 

విక్టరీ వెంకటేష్ ప్రయాణంలో 'సైంధవ్' మైలురాయి. హీరోగా ఆయనకు 75వ సినిమా ఇది. 'హిట్' ఫ్రాంఛైజీతో శైలేష్ కొలను విజయాలు అందుకోవడంతో విడుదలకు ముందు అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, 'సైంధవ్'కు హిట్ టాక్, కలెక్షన్స్... రెండూ రాలేదు. 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామి రంగ' జోరు ముందు థియేటర్లలో కనిపించకుండా పోయింది. కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ' హిట్ అనిపించుకుంది. పండక్కి విడుదల కావడం, ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఉండటం, తక్కువ రేట్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడంతో... అందరూ హ్యాపీ. జనవరిలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిన రెండో సినిమా 'నా సామి రంగ'. థియేట్రికల్‌ రైట్స్‌ను కేవలం రూ. 18 కోట్లకు ఇచ్చారు. అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా లాభాలు తెచ్చి పెట్టింది. డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ రూ. 33 కోట్లకు అమ్మడంతో నిర్మాత కూడా హ్యాపీ!

సంక్రాంతి తర్వాత వారం ఖాళీ
రిపబ్లిక్ డే వీకెండ్ సందడి లేదు! 
'నా సామి రంగ' ఆదివారం విడుదలైంది. సంక్రాంతి సినిమాల తర్వాత, శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు రాలేదు. శనివారం 'కొత్త రంగుల ప్రపంచం' అని ఓ చిన్న సినిమా వచ్చినట్టు మీడియా జనాలకు సైతం తెలియదు.

రిపబ్లిక్ డే వీకెండ్ కూడా సరైన కొత్త సినిమా లేక వెలవెలబోయింది. తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్'ను జనవరి 26న తెలుగు రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే, 'కెప్టెన్ మిల్లర్' విడుదల కాగా... తమిళ ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా 'అయలాన్' విడుదల నిలిచింది. ధనుష్ సినిమా పర్వాలేదనే టాక్ వచ్చింది. కానీ, తెలుగులో వసూళ్లు రాలేదు. తమిళంలో వంద కోట్లు కలెక్ట్ చేసిన 'అయలాన్' తెలుగు ఓపెనింగ్స్ కోల్పోయింది.

Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

తెలుగు సినిమాలకు వస్తే... సాయి కుమార్ 'మూడో కన్ను', 'బిఫోర్ మ్యారేజ్', 'రామ్' (ర్యాపిడ్ యాక్షన్ మిషన్), 'ప్రేమలో', హన్సిక '105 మినిట్స్' తదితర సినిమాలు ఈ జనవరి 26న థియేటర్లలోకి వచ్చాయి. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. '105 మినిట్స్'లో అయితే హన్సిక క్యారెక్టర్ ఒక్కటే. అది ప్రయోగాత్మక సినిమా అని ఒక సెక్షన్ విమర్శకులను ఆకట్టుకుంది. మిగతా సినిమాలు షెడ్డుకు వెళ్లాయి.

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా 'మేరీ క్రిస్మస్'. జనవరి 12న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. అయితే... తెలుగులో ఈ సినిమాను చూసిన జనాలు చాలా తక్కువ. హృతిక్ రోషన్ 'ఫైటర్' తెలుగులో విడుదల కాలేదు. కానీ, రిపబ్లిక్ డేకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో భారీగా రిలీజ్ అయ్యింది. అయితే.. వసూళ్లు పెద్దగా రాలేదు.

'అ!', 'జాంబీ రెడ్డి' సినిమాలను హాలీవుడ్ శైలిలో తీసి, ప్రయోగాలు చేసిన ప్రశాంత్ వర్మ... కమర్షియల్ ఫార్మాటులో సూపర్ హీరో సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు అన్నిటితో 'హనుమాన్' తీశారు. హిందూ మైథాలజీ టచ్ ఇచ్చారు. అది బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 'నా సామి రంగ' కూడా కమర్షియల్ ఫిల్మ్. దానికీ కాసుల వర్షం కురిసింది. పండక్కి విడుదలైన ఈ రెండు సినిమాలనూ ప్రేక్షకులు ఆదరించారు.

Also Readతండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Joe Root Recods: సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
Embed widget