News
News
X

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన హైలైట్స్ మీకోసం..

FOLLOW US: 

వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు. 'లాస్ట్ వీక్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని మా అందరికి చెప్పావ్ కదా మరి ఇప్పుడు హౌస్ లో అలా జరిగితే ఏం పీకావ్?' అని నాగార్జున గతవారం కెప్టెన్ ఆది రెడ్డిని ప్రశ్నించారు. అసలేం జరిగిందో తనకు తెలియదని ఆది అన్నారు. దీంతో సూర్య డస్ట్ బిన్ లో అన్నం పడేసిన విజువల్ వేసి చూపించారు. సూర్య అలా చేయడం తను చూడలేదని ఆది అన్నారు. 

ఆర్జే సూర్యపై నాగార్జున సీరియస్:

ఆరోహి, సూర్య మధ్య జరిగిన గొడవ వల్ల సూర్య అన్నం చెత్త బుట్టలో వేయడం మీద నాగ్ సీరియస్ అయ్యారు. పారేసిన అన్నం లేక ఎంతమంది అల్లాడుతున్నారో తెలుసా? అని కోప్పడ్డారు. 'ఏ బేసిస్ మీద చిన్నా, పెద్దా అని అన్నావ్?' అని శ్రీహాన్ ని ప్రశ్నించారు. తను సరదాగా అన్నానని.. బాడీ షేమింగ్ చేయలేదని కానీ ఇనయా అలా మాట్లాడిందని శ్రీహాన్ అన్నారు. దీంతో నాగార్జున.. ఇనయాకు క్లాస్ పీకారు. ఆ తరువాత హౌస్ లో అందరికంటే పెద్దవాడు చంటి కాదని.. శ్రీహాన్ అని సరదాగా అన్నారు నాగార్జున. 

హౌస్ లో అద్భుతం:

News Reels

ఈ వారం హౌస్ లో ఒక అద్భుతం జరిగింది.. బాలాదిత్యకి కోపం వచ్చింది.. నీకు కోపం రావడం ఎంత అద్భుతమో ఇంకొకరికి దుఖం, బాధ వచ్చింది ఉన్న ఒక్కగానొక్క ఫ్యామిలీ మెంబర్ గీతూతో కన్నీళ్లు పెట్టించాడంటూ బాలాదిత్యతో అన్నారు. వారిద్దరి మధ్య జరిగిన దాని గురించి బాలాదిత్య చెప్పబోతుంటే అది దుబాకోర్ రీజన్ అని కొట్టిపడేసింది గీతూ. దీంతో ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. 

ఆటని సరిగ్గా అర్ధం చేసుకొని ఆడాలని సూర్యకి సజెషన్ ఇచ్చారు నాగార్జున. అర్జున్ కళ్యాణ్.. గేమ్ గురించి మాట్లాడుతూ.. టాస్క్ లో ఉన్న డబ్బులన్నీ ఒకరికే(శ్రీసత్య) ఇవ్వడం గురించి మాట్లాడారు. చాలా కాలం తరువాత తనపై ఒకరు ఎఫెక్షన్ చూపించారని అర్జున్ అన్నారు. దీంతో నాగార్జున ఏడిపించారు. హోటల్ టాస్క్ లో గీతూ బాగా పెర్ఫార్మ్ చేసిందని ఆమెని పొగిడారు. ఆడినంత సేపు చాలా బాగా ఆడావు అంటూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. 

రేవంత్ భార్య శ్రీమంతం గురించి నాగ్ మాట్లాడుతూ ఎలా ఉందని అడిగారు. నువ్వు ఎప్పుడు చేయించుకుంటున్నావ్ శ్రీమంతం అని అడగడంతో ఇంట్లో నవ్వులు పూసాయి. ఫైమా గేమ్ తీరుని పొగిడారు నాగార్జున. సుదీప కూడా గేమ్ బాగా ఆడిందని చెప్పారు. ఆర్జే సూర్యను ఉద్దేశిస్తూ.. టాస్క్ లో ప్రతి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి బాగా ఆడావని చెప్పారు. ఆట సగం వరకు బాగా ఆడావని ఆరోహిని ఉద్దేశిస్తూ అన్నారు నాగార్జున. కెప్టెన్ గా ఎన్నికైన కీర్తికి కంగ్రాట్స్ చెప్పారు నాగ్. శ్రీసత్య అద్భుతంగా ఆడిందని పొగిడారు నాగార్జున. 

చంటికి నాగార్జున క్లాస్:

చంటి అసలు గేమ్ ఆడకపోవడంపై నాగార్జున ప్రశ్నించారు. దానికి చంటి తను గేమ్ ఆడలేకపోయానని.. సీక్రెట్ టాస్క్ చేయడానికి మనసు ఒప్పుకోలేదని చెప్పారు. ఈ వారం నిరూపించుకుంటానని చెప్పారు. వసంతి గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు నాగార్జున. మెరీనా, రోహిత్ ల గేమ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావని, గేమ్ కూడా సరిగ్గా ఆడలేదని ఆదిరెడ్డిని ఉద్దేశిస్తూ అన్నారు నాగార్జున. దానికి అతడు తన వెర్షన్ వినిపించారు. శ్రీహాన్ చాలా బాగా ఆడారని చెప్పారు నాగ్. 

ఇనయా సుల్తానా గేమ్ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది అన్నారు నాగార్జున. గేమ్ సరిగ్గా ఆడని ఆదిరెడ్డి, బాలాదిత్య, చంటి, ఇనయాలలో ఒకరిని ఎన్నుకోమని హౌస్ మేట్స్ ని అడిగారు నాగార్జున. అందరికంటే ఎక్కువ ఓట్లు చంటికి రావడంతో.. ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ పోటీకి అతడి అర్హత రద్దు చేయబడిందని చెప్పారు. 

ఆ తరువాత నాగార్జున తనను చీర్ అప్ చేయలేదని కీర్తి కన్నీళ్లు పెట్టుకుంది. ఎంత కష్టపడి ఆడినా.. చిన్న అప్రిసియేషన్ కూడా లేదని ఏడ్చేసింది. దీంతో నాగార్జున ఆమెని ఎందుకు ఏడ్చావని ప్రశ్నించగా.. విషయం చెప్పింది. దానికి నాగార్జున 'బాగా ఆడావ్ కాబట్టే కెప్టెన్ అయ్యావ్. నీ మీద చాలా అంచనాలు ఉన్నాయని.. వాటిని రీచ్ అయినప్పుడు కచ్చితంగా అప్రిషియేట్ చేస్తానని' అన్నారు.

 'బీబీ ఛాట్ బండార్' గేమ్:

హౌస్ మేట్స్ తో 'బీబీ ఛాట్ బండార్' అనే గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్ మేట్స్ కి సంబంధించి కొన్ని బిరుదులు ఇస్తూ పానిపూరిని తమకి నచ్చిన విధంగా చేసి వేరే వాళ్లతో తినిపించాలి. శ్రీసత్య.. సోమరిపోతు అని ఆమెకి పొటాటో పానీపూరి తినిపించింది సుదీప. ఇక గీతూ సోమరిపోతు అని వాసంతి తనకి పానిపూరీ తినిపిస్తుంది. చంటి పానీపూరిలో బాగా ఉప్పు వేసి గీతూకి తినిపిస్తారు. గీతూ అందులో వాటర్ కలిపేసుకుని అలాగే తినేస్తుంది. కొన్నిసార్లు ఇష్టమొచ్చినట్లు మాటలు జారుతుందని చెప్పారు. బాలాదిత్య తనను ఏడిపించాడని.. ఉల్లిపాయ పానీపూరి తినిపించింది ఫైమా. ఆదిరెడ్డి సోమరిపోతు అని పానీపూరి తినిపించాడు రాజ్. 

గీతూ రూడ్, చంటి టాక్సిక్:

గీతూ రూడ్ అని సిల్లీసాస్ పానీపూరిని తినిపించింది ఆరోహి. శ్రీహాన్ టాక్సిక్ అని.. అతడికి కాకరకాయ పానీపూరి తినిపించింది ఇనయా. గీతూ సోమరిపోతు అని కీర్తి.. పానీపూరి తినిపించింది. గీతూ తన వంతు రాగానే చంటి మీద పగ తీర్చుకుంటుంది. మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అని గీతూ చంటికి పానిపూరీ ఇస్తుంది. శ్రీసత్య.. సోమరిపోతు అని రేవంత్ పానీపూరి తినిపించాడు. బయట చాలామంది తనను ఏడిపిస్తారని.. కానీ ఇంట్లో రేవంత్ బాగా ఏడిపిస్తున్నాడని.. అతడికి పానిపూరీ తినిపించాడు శ్రీహాన్. బయట ఎవరు ఏడిపించేది అని నాగ్ అంటే శ్రీహాన్ ఇద్దరి పేర్లు చెప్తాడు. బాగా కవర్ చేశావ్ అని నాగార్జున అందరి ముందు గాలి తీసేస్తారు. ఆరోహి.. రూడ్ అని శ్రీసత్య పానీపూరి తినిపించింది. 

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Published at : 01 Oct 2022 10:31 PM (IST) Tags: Srihaan Revanth Bigg Boss 6 Telugu Bigg Boss 6 Geetu chanti Nagarjuna

సంబంధిత కథనాలు

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి