Bigg Boss 6 Telugu: సిసింద్రీ టాస్క్‌లో రేవంత్ గెలవకుండా అడ్డుకున్న ఫైమా, ఫైర్ అయిన రేవంత్
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ కొత్త ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. బొమ్మల టాస్క్ లోనూ అగ్గిరాజుకుంది.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 పదో రోజుకు చేరుకుంది. నేటి ప్రోమోను విడుదల అయింది. ఇందులో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ కంటెండర్ టాస్కును ఇచ్చాడు. దీనిలో ప్రతి ఇంటి సభ్యునికి ఒక బొమ్మను ఇస్తారు. దాన్ని తమ బేబీలా చూసుకోవాలి. సమయానికి ఏడుపు వినిపించి, తమకు ఏం కావాలో చెబుతాయి బొమ్మలు. ఆ పనులను ఇంటి సభ్యులు చేసి పెట్టాలి. మెరీనా- రోహిత్ బొమ్మ ఆకలి అనగానే పాలు పెట్టినట్టు నటించింది మెరీనా. గీతూ బొమ్మ ఏడుస్తూ ‘గీతూ... డైపర్’ అంది. దానికి గీతూ ఏడుస్తూ డైపర్ మార్చేందుకు సిద్ధపడింది. వెంటనే ఇనయా ముందుగా కడగాలి అనగానే గీతూ కాస్త నీళ్లు పోసి కడిగినట్టు యాక్ట్ చేసింది.
సిసింద్రీలో రెండో టాస్కుగా ‘సాక్స్ అండ్ షేప్స్’ ఇచ్చారు. ఇందులో గోనె సంచులను తొడుక్కుని, గెంతుకుంటూ వెళ్లి ప్లస్, మైనస్ వంటి గుర్తును అమర్చి రావాలి. ఇందులో రేవంత్ గెలిచే సమయంలో ఫైమా అడ్డుపడి ఓడిపోయేలా చేసింది. దీంతో చంటి విజయం సాధించాడు. ఇక రేవంత్ కోపం కట్టలు తెంచుకుంది. ఫైమాను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ ‘ఒకరిని ఓడగొట్టాలని చూస్తే మనమే ఓడిపోతాం’ అన్నాడు. కంగ్రాట్స్ చంటన్నా అని అరిచాడు. ‘నేనే రియల్ ఫైటర్’ అన్నాడు. ఇవన్నీ చంటి సీరియస్ గా వింటూ నిల్చున్నాడు.
అభినయశ్రీ మాట్లాడుతూ ‘ఈ గేమ్‌లో గేమ్ ఛేంజర్ ఫైమా’ అంది. దానికి రేవంత్ ‘అలాగే గెలవాలి, లేకుంటే గెలవడం కష్టం కదా’ అన్నాడు. ‘నువ్వు రాకూడదు అని తను అనుకుంది, అందుకే చేసింది’ అంది అభినయశ్రీ. దానికి రేవంత్ ‘ఇక్కడ నేనుంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది’ అన్నాడు. దానికి ఫైమా ‘నువ్వు గెలవడానికి నేను ఆడి ఎందుకన్నా’ అంది. దీంతో ప్రోమో ముగిసింది.
సోమవారం నామినేషన్ ఎపిసోడ్ మాత్రం చాలా వాడీ వేడిగా సాగింది. రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, కీర్తి భట్ మధ్య గట్టి వాదనలు అయ్యాయి.
ఈ వారం నామినేట్ అయిన సభ్యులు
1. రాజశేఖర్
2. రేవంత్
3. అభినయశ్రీ
4. ఆదిరెడ్డి
5. గీతూ
6. షానీ
7. రోహిత్ -మెరీనా
8. ఫైమా
Don't miss the fun loaded Captaincy Contenders task! 😂
— starmaa (@StarMaa) September 13, 2022
Catch today's episode on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/UPvfdM3f88
Also read: నామినేషన్ డే - రెండో వారమే వేడెక్కిన వాతావరణం, ఏం ఇరగదీశావ్ అంటూ ఆరోహిపై ఆదిరెడ్డి ఫైర్