Sound Party Trailer: ట్రైలర్ తో రీ సౌండ్ క్రియేట్ చేస్తోన్న`సౌండ్ పార్టీ`- స్టార్టింగ్ To ఎండింగ్ పంచులే పంచులు!
Sound Party Trailer: వీజే సన్నీ, హ్రితిక జంటగా నటించిన తాజా చిత్రం `సౌండ్ పార్టీ`. సంజయ్ శేరి తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.

Sound Party MovieTrailer: టాలీవుడ్ లో ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. తాజాగా ఇదే కథాంశంతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే `సౌండ్ పార్టీ`. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా సంజయ్ శేరి ఈ సినిమాను రూపొందించారు. త్వరలో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో, తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటోంది. సినిమాపైనా భారీగా అంచనాలు పెంచుతుంది.
పంచ్ డైలాగులతో అలరించిన ట్రైలర్
ఇప్పటికే `సౌండ్ పార్టీ` చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండున్నర నిమిషాలున్న ఈ ట్రైలర్ అదిరిపోయే పంచు డైలాగ్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వీజే సన్ని, శివన్నారాయణ మధ్య డైలాగ్స్ క్రేజీ గా ఉంటూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం యూత్ అంతా జియో, ఓయో మీదే నడుస్తోందంటూ శివన్నారాయణ చెప్పిన డైలాగ్ భలే ఆకట్టుకుంటుంది. వీరితో పాటు సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ సహా పలువురు టాలీవుడ్ మెడియన్స్ ఈ సినిమాలో తమ మార్క్ కామెడీతో అలరించబోతున్నారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన `సౌండ్ పార్టీ`
ఇక మోహిత్ రెహమానికి మ్యూజిక్ , శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్రఫీ అదుర్స్ అనిపిస్తోంది. దర్శకుడు సంజయ్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో, మంచి కాస్టింగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేశారు. ‘సౌండ్ పార్టీ‘ చిత్రాన్ని చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా ఈ చిత్రం రూపొందింది. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జయ శంకర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈనెల 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకానుంది.
View this post on Instagram
Read Also: అదిరిపోయే డ్యాన్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, ‘యానిమల్’ టీమ్ తో బాలయ్య రచ్చ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

