అన్వేషించండి

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు: ప్రియాకు షాకిచ్చిన హమీద.. ప్రియాంక ప్రేమలో లోబో.. కెప్టెన్‌గా సిరి!

గురువారం (సెప్టెంబరు 9) ప్రసారమైన బిగ్ బాస్ 5వ ఎపిసోడ్ హైలెట్స్.

బిగ్ బాస్‌ ఎపిసోడ్ 5.. కాజల్‌కు మానస్‌కు ఇచ్చిన టాస్క్‌తో మొదలైంది. లహరీ అర్ధరాత్రి నిద్రలేవడంతో ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా నిద్రలేచారు. ఎవరైనా నిద్రలేస్తే.. కాజల్‌ను ముందుగా నిద్రలేపాలి. అయితే, లహరీ అలా చేయకపోవడంతో బజర్ మోగింది. ఆ తర్వాత శ్రీరామ్ కూడా అదే పొరపాటు చేయడంతో మరోసారి బజర్ మోగింది. మొత్తానికి అలా కంటెస్టెంట్ల నిద్రకు భంగం వాటిల్లింది. 

తర్వాతి రోజు ‘జాగో జాగోరే జాగో..’ పాటతో బిగ్ బాస్ కంటెస్టంట్లలో ఉత్సాహం నింపాడు. అయితే, సిరి ఇచ్చిన టాస్క్ ఇంకా కొనసాగడంతో షణ్ముఖ్.. లోబోత డోర్ తెరిపించుకున్నాడు. దీంతో లోబో అతడిని తిట్టుకుంటూ సరయు వద్ద తన గోడు చెప్పుకున్నాడు. తనకు కూడా టైమ్ వస్తుందంటూ ఫీలయ్యాడు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్ ద్వారా షణ్ముఖ్ తెలుసుకున్నాడు. లోబోకు టాస్క్ విషయంలో నేను పరిధి దాటుతున్నా ఏమో అని షణ్ముఖ్ రవి వద్ద తెలిపాడు. ‘అవుట్ ఆఫ్ లైన్’ అవుతుందని హౌస్ మేట్స్ అంటున్నారని పేర్కొన్నాడు.  అదేమీ ఉండదని, లోబో మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తాడని అన్నాడు. అయితే, లోబోకు తక్కువ పని చెబుతానని షన్ను అన్నాడు. ఇందుకు రవి కూడా సరే అన్నాడు. 

హమీదాకు పవర్.. ప్రియాకు కెప్టెన్సీ ఛాన్స్‌కు ఎసరు: హమీదా పవర్ రూమ్ యాక్సెస్ పొందింది. ఈ సందర్భంగా బిగ్ బాస్.. ‘‘మీకు లభించే పవర్‌తో బిగ్ బాస్ ఇంట్లో ఒకరిని ఎంపిక చేసుకోండి. వారు ఎప్పటికీ కెప్టెన్ కాలేరు’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా హమీద ప్రియాను సెలెక్ట్ చేసుకుంది. ఈ విషయాన్ని హమీదా బయటకు వెళ్లి అందరికీ చెప్పింది. ఈ షాకింగ్ విషయాన్ని ప్రియా చాలా కూల్‌గా హ్యండిల్ చేసింది. అంటే.. నేను ఈ సీజన్‌లో కెప్టెన్ కాలేనని, దాని వల్ల లభించే ఇమ్యునిటీ కూడా తనకు దక్కదని చెబుతూ.. పాజిటివ్‌గా స్పందించింది. ‘‘దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా’’ అని తెలిపింది. ప్రియా ఆ విషయాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నందుకు రవి, సిరి మెచ్చుకున్నారు. అయితే, లహరీ.. సన్నీ దీని గురించి మాట్లాడుకున్నారు. నేనైతే ఆమెలా కెప్టెన్సీ వదిలేయలేనని.. ఏడ్చేస్తానని అన్నది. సన్నీ ప్రియాతో మాట్లాడుతూ.. కెప్టెన్ కాలేనని తెలిసి బాధ కలిగింది. కానీ, హౌస్‌లో ఎవరో ఒకరి పేరు ఆమె చెప్పాల్సిందే కదా అని పేర్కొంది. 

‘కప్పు’ కోసం పంచాయతీ: బిగ్ బాస్ హౌస్‌లో ఫిమేల్ కంటెస్టెంట్లు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చూస్తున్నారు. చివరికి కప్పు కడిగే విషయంలో కూడా యానీ, ప్రియ మధ్య కాసేపు అనవసరమైన చర్చ జరిగింది. మొత్తానికి ఇద్దరూ కూల్ కావడంతో పెద్దగా గొడవ కాలేదు. అయితే, సేవకుడి టాస్క్ వల్ల లోబో కాస్త ఫీలైనట్లు కనిపించింది. స్మోకింగ్ ఏరియాలో విశ్వతో మాట్లాడుతూ.. ‘‘నేను ఫ్రీ బర్డ్. ఇక్కడ సూట్ కాను’’ అని అన్నాడు. ఇందుకు విశ్వ.. ఇది ఒక క్యారెక్టర్ అనుకో అని విశ్వ సలహా ఇచ్చాడు. దీంతో లోబో కాస్త తేలికపడ్డాడు. 

ప్రియాంక ప్రేమలో లోబో.. సరయు కన్నీళ్లు: వాష్ రూమ్ వరండాలో ప్రియాంక.. లోబోను అన్నయ్య అని పిలిచింది. దీంతో లోబో నన్ను అన్నయ్య పిలవద్దు అన్నాడు. ఆ తర్వాత ప్రియాంకకు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. ‘‘మనిషి అంటే ఒక ఆశ ఉంటుంది కదా’’ అని తనలో తాను అనుకున్నాడు. వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ప్రియాంకను లోబో అలాగే చూస్తుండిపోయాడు. దీంతో ప్రియాంక.. ‘‘నువ్వు నన్ను చూస్తున్నావని మానస్‌కు చెబుతా. దమ్ముంటేు మానస్ ముందు నాకు లైనేయ్’’ అని లోబోను రెచ్చ గొట్టింది. అక్కడే ఉన్న రవి ‘‘లోబోకు దమ్ము ధైర్యం లేవు. మెదడు కూడా లేదు’’ అంటూ గాలి తీసేశాడు. ఆ తర్వాత మానస్ అక్కడి రావడంతో.. ‘‘నేను పింకీ(ప్రియాంక)ను ఇష్టపడుతున్నా. ఫస్ట్ లుక్‌లోనే పడిపోయా. తాను చాలా అందంగా కనిపిస్తోంది’’ అని లోబో తెలిపాడు. ‘‘తనకు లైన్ వేయాలంటే మానస్ పర్మిషన్ తీసుకో అని అంది’’ అని లోబో చెప్పడంతో.. మానస్ స్పందిస్తూ.. ‘‘నా పర్మిషన్ అవసరం లేదు. నువ్వు ఏమైనా చేసుకో’’ అనడంతో లోబో సంతోషించాడు. ఆ తర్వాత ప్రియాంక లోబోకు ఫన్నీ మేకప్ వేసింది. దీంతో లోబో కాసేపు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే, సరయు ఇంట్లో గ్రూపులు మొదలవుతున్నాయంటూ యానీ మాస్టర్ వద్ద వాపోయింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైంది. గ్రూపులు ఉన్నా.. లేకపోయినా నువ్వు పట్టించుకోకు అని యానీ మాస్టర్.. సరయుకు తెలిపింది. నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావు గేమ్ ఆడు అని సలహా ఇచ్చింది.

Also Read: బిగ్ బాస్.. ఈ లేడీస్‌కు కాస్త పూలు చూపించు.. అబ్బాయిలు క్లాస్, అమ్మాయిలు ఊర మాస్!

రచ్చగా మారిన కెప్టెన్సీ టాస్క్.. సిరి విజయం: ఈ రోజు ‘శక్తిని చూపరా డింబకా’ టాస్క్ పూర్తయ్యినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అందరి కంటే ముందు పవర్ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత పొందిన హమీద, మానస్, విశ్వ, సిరి‌ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైనట్లు బిగ్ బాస్ తెలిపాడు. ఈ సందర్భంగా ‘తొక్కరా తొక్కు హైలెస్సా టాస్క్’ ఇచ్చాడు. సైకిల్‌కు ఉండే బల్బ్ ఆరకుండా సైకిల్ తొక్కుతూనే ఉండాలి. బల్బ్ ఆగితే వారు టాస్క్ నుంచి తప్పుకోవాలి. సభ్యులు ఎవరికైనా సపోర్ట్ చేయవచ్చని చెప్పడంతో ఆర్జే కాజల్.. దీన్ని అవకాశంగా తీసుకుంది. అమ్మాయిలే కెప్టెన్ కావాలంటూ.. కాజల్ విశ్వ సైకిల్ టైర్ మీద ఆయిల్ పోసింది. దీంతో అతడి సైకిల్ బల్బ్ ఆరిపోయింది. ఆ తర్వాతను లోబో డిస్ట్రబ్ చేయడంతో దిగిపోయింది. చివరిగా మానస్ కూడా సైకిల్ మీద నుంచి దిగిపోవడంతో సిరి విజేతగా నిలిచింది. అయితే, ఈ టాస్క్‌కు సంచాలకుడిగా ఎంపిక చేసేందుకు కూడా హౌస్‌లో రాజకీయాలు జరిగాయి. సన్నీ.. ప్రియా సంచాలకురాలిగా ఉంటుందని చెప్పడంతో.. యానీ మాస్టర్, రవి.. తమ అభిప్రాయం తీసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటావని ప్రశ్నించారు. దీంతో మరోసారి ఓటింగ్ చేసి ప్రియాంకను సంచాలకురాలిగా ఎంపిక చేశారు. టాస్క్‌లో విశ్వకు సపోర్ట్ చేసిన సరయుకు, కాజల్‌కు మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. కాజల్ రెండేసి మాటలు మాట్లాడుతోందంటూ సరయు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వ అందరి కంటే స్ట్రాంగ్ కాబట్టి తనని టార్గెట్ చేసుకున్నానని, అది తన గేమ్ ప్లాన్ అని తెలిపింది. ఇలా కాసేపు వాదోపదవాదనలు జరిగాయి. సిరి కెప్టెన్‌గా ఎన్నికైనందుకు బిగ్ బాస్ విష్ చేశాడు. ఆతర్వాత ప్రియా.. అతడి చేతికి కెప్టెన్ బ్యాండ్ తొడిగింది.  

Also Read: ఎంత పనిచేశావ్ హమీదా.. జస్సీకి ఎలిమినేషన్ గండం.. ప్రియాకు కెప్టెన్సీ ఛాన్స్ పాయే!

ఉమా vs ప్రియాంక vs లహరి: కెప్టెన్‌గా సిరి బాధ్యతలు స్వీకరించగానే.. విశ్వను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసుకుంది. ఫ్రిజ్‌ను కేవలం రేషన్ మేనేజర్ మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. లంచ్ బాధ్యతలు ప్రియాంక తీసుకుంటానని తెలిపింది. అయితే.. నాన్-వెజ్ వంటలు తాను వండనని, నాన్-వేజ్ పాత్రలను తాను శుభ్రం చేయనని ఉమా తెలిపింది. మార్నింగ్ ఫుడ్ బాధ్యతలు తీసుకోండని ప్రియాంక తెలిపింది. ఈ సందర్భంగా ఉమా గట్టిగా మాట్లాడటంతో ప్రియాంక కూడా రివర్స్ అయ్యింది. ఆ తర్వాత లహరీ కూడా ఉమా మీద విరుచుకుపడింది. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడింది. మార్నింగ్ సెక్షన్‌లో నాన్-వెజ్ ఉండదని, అందుకే తీసుకుంటున్నామని చెబుతున్నామని చెప్పింది. కాసేపు అరుపులు.. కేకల మధ్య ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. రేపు బిగ్ బాస్ హౌస్‌లో వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget