News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Bigg Boss 5 Telugu: ఓడియమ్మ.. ఎంత క్యూట్ గా ఉందో..బిగ్ బాస్ హౌస్ లో సిరి జర్నీ...

ఈ వారంతో బిగ్ బాస్ షో కి శుభంకార్డ్ పడబోతోంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వాళ్లకు చూపిస్తున్నారు బిగ్ బాస్. తన జర్నీ చూసుకుని సిరి చాలా ఎగ్జైట్ అయింది. ఆ జర్నీ మీరూ చూసేయండి...

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి వారానికి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరవుతారో అన్నది తెలియడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మొత్తం 19 మంది మెంబర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టగా ఫైనల్ గా ఐదుగురు మిగిలారు. సన్నీ, షన్నూ, సిరి, శ్రీరామచంద్ర, మానస్ హౌజ్ లో ఉన్నారు.  ఎలాగో హౌస్‌లో చివరి వారం కాబట్టి నామినేషన్లు, టాస్కుల హడావుడి ఏమీ ఉండదు. ఇన్ని వారాలుగా కష్టపడి ఆడి ఫైనల్స్ కి చేరుకున్న కంటెస్టెంట్స్ కి ఈ వారం మొత్తం ఫన్ అందిస్తున్నారు బిగ్ బాస్. ఇంట్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ పిలిచి వారి టాస్కులు, అల్లరి, ఆటలు, గొడవలు అన్నింటినీ ఫొటోల రూపంలో చూపిస్తున్నారు. ఆ తర్వాత వారి ఏవీ ప్లే చేసి సర్ ప్రైజ్ అందిస్తున్నారు. ఇప్పటికే ఇంటి సభ్యులకు సంబంధించి శ్రీరామ్, సన్నీ, మానస్, షణ్ముక్ ఏవీలు, ఫొటోలు చూసుకుని వచ్చారు. ఇప్పుడు సిరి వంతొచ్చింది. ఈ మేరకు ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. 

మీ అనుభవాల పునాదులపై మీకుగా మీరు సిరి అంటే ఏంటో ప్రపంచానికి చూపాలన్న తపన కళ్లకు కట్టినట్టు అందరికీ కనిపించింది. మీ ఇష్టమైనా, బంధమైనా, కోపమైనా మీరు నమ్మిన దానికోసం మీ గొంతు గట్టిగా వినిపించారు. ఈ బిగ్ బాస్ ఇల్లు ఎన్నో భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు అంటూ ప్రోమో సాగింది. అంతకుముందు ఫ్రెండ్స్ లో ఉన్న ఫొటోలు చూసి సిరి మురిసిపోయింది.  

ఇక బిగ్ బాస్ ఫినాలే వీక్ కావడంతో ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఆసక్తికరంగా సాగుతోంది. ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో బుల్లితెర ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకుంటున్నారు. ఇక, ఈ వారం మొదటి నుంచే వీజే సన్నీ ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.ఈ సీజన్ ఆరంభం నుంచి చక్కని ఆటను కనబరచడంతో పాటు అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించిన వారిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని అందరి కంటే ముందే ఫైనల్స్‌లో అడుగు పెట్టాడతను. ఇక, మొదటి రోజు ఓటింగ్‌లో శ్రీరామ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. మానస్‌ మాత్రం నాలుగో స్థానంలో, సిరి హన్మంత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి టైటిల్ విజేత ఎవరో వెయిట్ అండ్ సీ...
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
Also Read: బాలయ్యతో లెజెండరీ దర్శకుడు రాజమౌళి... త్వరలో ప్రోమో విడుదల
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 15 Dec 2021 01:15 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Shanmukh Siri Sunny Sunny journey Bigg Boss 5 Telugu Maanas Journey Sri Ram Journey Shanmukh Journey Siri Journey

ఇవి కూడా చూడండి

Jagadhatri December 4th Episode : కంగారులో నోరు జారిన మాధురి.. రంగంలోకి దిగిన ధాత్రి, కేధర్!

Jagadhatri December 4th Episode : కంగారులో నోరు జారిన మాధురి.. రంగంలోకి దిగిన ధాత్రి, కేధర్!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్

Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
×