By: ABP Desam | Updated at : 03 Dec 2021 09:47 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Star Maa/Hotstar
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి టాస్క్‌లో ఐస్ టబ్‌లో కాళ్లు పెట్టి ఇంటి సభ్యులు కొందరు గాయపడ్డారు. రెండో టాస్క్‌లో 29 నిమిషాలు లెక్కపెట్టాల్సి ఉండగా, ఈ ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. మూడో టాస్క్ లో భాగంగా స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఈ మూడు టాస్క్ లు పూర్తయ్యేసరికి 'టికెట్ టూ ఫినాలే' రేసులో మానస్, శ్రీరామ్,సిరి, సన్నీ ఉన్నారు. ఈ నలుగురు టికెట్ టు ఫినాలే కోసం తలపడనున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా మానస్ 18 పాయింట్లతో ముందున్నాడు. తరువాత స్థానంలో 16 పాయింట్లతో శ్రీరామ్, 15 పాయింట్లతో సిరి మూడో స్థానంలో ఉంది. 10 పాయింట్లతో సన్నీ టికెట్ టు ఫినాలేకి అర్హత సాధించిన వారిలో చివరి స్థానంలో ఉన్నాడు. ఈ నలుగురిలో విజేత ఎవరనేది బిగ్ బాస్ అభిమానుల్లో ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఈ టాస్క్ లో విజేతగా నిలిచిన వారు ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే చాలు డైరక్ట్ గా టాప్ 5కి వెళ్లిపోతారు. దీంతో ఆ లక్కీ పర్సన్ ఎవరా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇందులో విజేతగా సిరి నిలించిందని టాక్.
Distraction chese mode lo #Kajal... #Sunny & #SreeRamChandra serious #BiggBossTelugu5 tomorrow at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/HHWeZubCn2
— starmaa (@StarMaa) December 2, 2021
హగ్గుల్లో తగ్గేదే లే...
సిరి విజేతగా నిలిచిందనగానే ఆమె ఫాలోవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నప్పటికీ బిగ్ బాస్ అభిమానులు కొందరు తల పట్టుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున సహా సిరి-షణ్ముక్ పేరెంట్స్ వచ్చి చెప్పినా హగ్గులు విషయంలో అస్సలు తగ్గడం లేదు. పైగా హగ్ చేసుకున్న ప్రతీసారీ ఇది ఫ్రెండ్ షిప్ అంటూ షణ్ముక్ హడావుడి చేస్తుంటే... నన్ను బాగా చూసుకుంటున్నాడు హగ్ ఇవ్వకపోతే ఎలా అంటూ సిరి కవర్ చేస్తోంది. ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ లో సిరి విజేతగా నిలిచిందని టాక్. అంటే ఈ లెక్కన షో చివరి వరకూ వీళ్లిద్దరూ కనిపించిన ప్రతిసారీ కళ్లు మూసుకోవాల్సిందే అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. మరోవైపు ఇప్పటికే షణ్ముక్ గేమ్ దెబ్బతినడానికి కారణం సిరి అని, షణ్ను ద్వారా ఓట్లు సాధించేందుకు ఆమె తెగ తాపత్రయ పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫస్ట్ ఫైనలిస్ట్ మాత్రం సిరి అంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..ఈ వారం ఆమె ఎలిమినేట్ కాకుండా ఉంటేనే ఫైనలిస్ట్ అవుతుంది. ఒకవేళ ఎలిమినేట్ అయితే మాత్రం టికెట్ టు ఫినాలే లో గెలిచినా వ్యర్థమే. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.. .
Also Read: అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: సెట్స్‌కు వచ్చిన మెగాస్టార్... నెర్వస్‌లో డైరెక్టర్
Also Read: రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన దర్శకుడితో విక్రమ్... దళిత్ సినిమా కన్ఫర్మ్
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డబ్బింగ్ థియేటర్‌లో నయనతార...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
/body>