(Source: ECI/ABP News/ABP Majha)
Jai Bhim: హీరో సూర్యకు హైకోర్టులో ఊరట, ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లేనా?
తమిళ నటుడు సూర్యకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. జై భీమ్ సినిమాకు సంబంధించిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
తమిళ నటుడు సూర్యకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సూర్య ప్రధాన పాత్రగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమాకి సంబంధించిన పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్టు మద్రాసు హైకోర్టు వెల్లడించింది. వన్నీయర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ సంతోష్ అనే వ్యక్తి సూర్య, డైరెక్టర్ జ్ఞానవేల్ మీద పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు పిటిషన్‌ను పరిశీలించిన మద్రాసు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. సతీష్ కుమార్ దాన్ని రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు.
రిటైర్డ్ అడ్వకేట్ చందు నిజ జీవిత కథ ఆధారంగా ‘జై భీమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో లాయర్ చందు పాత్రను సూర్య పోషించారు. దోపిడి చేశాడనే తప్పుడు ఆరోపణలతో ఒక పేద గిరిజనుడిని పోలీసులు ఏ విధంగా కేసులో ఇరికించారు, ఆ తర్వాత అతడిని ఏం చేశారనే కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలోని కోర్టు సన్నివేశాలు రక్తికట్టిస్తాయి.
ఈ సినిమాలో వన్నీయర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కేసు పెట్టారు. అంతే కాదు, చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అప్పట్లో ఇది చాలా వివాదాస్పదమైంది. సూర్యని కొట్టిన వాళ్ళకి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. దీంతో సూర్య ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ సినిమాకు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు మద్దతు తెలిపారు. ఈ సినిమా చాలా బాగుందని అప్పట్లో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు.
సూర్య నటించిన జై భీమ్ చిత్రం ప్రతిష్ఠాత్మక అవార్డుని గెలుచుకుంది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. 2D ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. 2021లో ఉత్తమ భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. 94వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్‌కు అర్హత సాధించిన 276 చిత్రాల్లో ఈ తమిళ చిత్రం కూడా షార్ట్ లిస్ట్ చెయ్యబడింది. కానీ తుది జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయింది. ‘జై భీమ్’ చిత్రం IMDb వెబ్ సైట్‌లో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ‘జై భీమ్’ చిత్రం 53 వేసే ఓట్లను పొంది 9.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరి ఈ వివాదానికి ఇప్పట్లో పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
Also Read: లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Also Read: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!
View this post on Instagram