అన్వేషించండి
Satyabhama Serial Today December 02 Highlights : బంటిని ఉతికారేసిన క్రిష్ .. షాక్ సత్యకా మహదేవయ్యకా - సత్యభామ డిసెంబరు 02 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. చక్రవర్తి కొడుకే అని సత్యకి పూర్తి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
satyabhama serial December 02 episode Highlights
1/8

సత్యభామ సీరియల్ మొత్తం నడుస్తున్నది మామా-కోడలి మధ్యే. ఈ మధ్య ఎపిసోడ్స్ మొత్తం మహదేవయ్య - సత్య సవాల్-ప్రతిసవాల్ సాగుతోంది. నెగ్గెదెవరో - ఓడేదెవరో సత్యభామ డిసెంబరు 02 ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చేస్తుంది...
2/8

క్రిష్ మహదేవయ్య కొడుకు కాదని సత్యకు తెలిసినప్పటికీ సరైన ఆధారాలకోసం వెయిట్ చేస్తోంది...ఇలాంటి టైమ్ లో గంగను రంగంలోకి దించి నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది. గంగ కూడా తగ్గేదే లే అన్నట్టు మహదేవయ్యని వణికించేస్తోంది
3/8

ఆ గంగ ఎవరో తెలియదు అని మహదేవయ్య చెప్పినా కానీ భైరవి మాత్రం నమ్ముతున్నట్టే ఉన్నా లోపల అనుమానం అలాగే ఉండిపోయింది. ఎట్టకేలకు గంగ DNA టెస్ట్ వరకూ తీసుకొచ్చింది
4/8

గంగ, క్రిష్ నుంచి శాంపిల్స్ సేకరించారు..ఆలోచనలో పడిన మహదేవయ్యతో భైరవి, జయమ్మ, గంగ నిలదీయడంతో తప్పని పరిస్థితుల్లో శాంపిల్స్ ఇచ్చాడు. ఇక మీ పని అయిపోయింది మావయ్య అని సత్య కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది
5/8

సత్యభామ డిసెంబరు 02 ఎపిసోడ్ లో గంగ కొడుకు బంటిని క్రిష్ ఉతికి ఆరేశాడు. ఏకంగా మహదేవయ్య డ్రెస్ వేసుకుని అదే స్టైల్లో సిగార్ పట్టుకుని మహదేవయ్య కుర్చీలో కూర్చున్నాడు..అది చూసి షాక్ అవుతారు మహదేవయ్య , భైరవి.
6/8

బంటిని చూసి ఆవేశంతో ఊగిపోయిన క్రిష్.. వాడిని ఉతికేసి.. ఆ దుస్తులకు నిప్పు పెట్టేశాడు. ఓ వైపు సత్య ఎంత వారిస్తున్నా క్రిష్ ఆవేశం తగ్గలేదు..
7/8

మహదేవయ్య దాదాపు దొరికేసినట్టే DNA టెస్ట్ తో క్రిష్ కి నిజం తెలిసిపోతుంది..మహదేవయ్య తండ్రి కాదని తెలిసిపోతే అప్పుడుంటుంది కథ అని ఫిక్సైంది సత్య.. ఇక్కడే మహదేవయ్యని తక్కువ అంచనా వేస్తోంది సత్య.. ఇంత జరుగుతున్నా మహదేవయ్య సైలెంట్ గా అస్సలు ఉండడు..
8/8

మహదేవయ్య ఏం ప్లాన్ చేస్తాడో..నిజం ఒప్పుకుని క్రిష్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడో..లేదంటే.. మాస్టర్ ప్లాన్ తో సత్యకి చెక్ పెడతాడో సత్యభామ డిసెంబరు 02 ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చేస్తుంది
Published at : 01 Dec 2024 08:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
టెక్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















