Bheed Trailer Removed: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం
అనుభవ్ సిన్హా తాజా సినిమా ‘భీడ్’కు సంబంధించిన ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ తొలగింపుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తున్నారు.
![Bheed Trailer Removed: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం Bheed Trailer Of Anubhav Sinha’s Film Removed From YouTube, know reason Bheed Trailer Removed: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/7f70d1efa1072c39e4e4f66a8d6990211678962916388544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘భీడ్’. లాక్ డౌన్ నాటి పరిస్థితులను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కావాల్సి ఉండగా, 10న ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. కానీ, తాజాగా ఈ ట్రైలర్ యూట్యూబ్ నుంచి తొలగించారు. లాక్ డౌన్ ను తప్పుబట్టేలా ఈ ట్రైలర్ ఉందనే కారణంతో యూట్యూబ్ తొలగించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను 1947 నాటి దేశ విభజనతో పోల్చి చూపించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ నుంచి తొలగించారు.
ట్రైలర్ తొలగింపుపై సర్వత్రా విమర్శలు
అటు ఈ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారత్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీడియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయని మండిపడుతున్నారు. మరికొంత మంది ఈ ట్రైలర్ తొలగింపును ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తున్నారు
The official trailer of the movie 'Bheed' is now private on Youtube after backlash. The movie is about the Covid lockdown mismanagement and the plight of the poor migrant labourers, who were forced to walk back home.
— Advaid അദ്വൈത് (@Advaidism) March 16, 2023
Mother of democracy, ladies and gentlemen! pic.twitter.com/NeylMRDtQG
సినిమా కథేంటంటే?
కరోనా విజృంభణ నేపథ్యంలో 2020 మార్చి 22 న దేశంలో ‘జనతా కర్ఫ్యూ’ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేసింది. దీంతో దేశం స్తంభించిపోయింది. వలస కూలీలు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో ఎంతో మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. అయితే, దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితులను బేస్ చేసుకుని ‘భీడ్’ అనే సినిమా రూపొందించారు అనుభవ్ సిన్హా. రాజ్ కుమార్ రావు హీరోగా నటించారు. ఈ మూవీని మార్చి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
కరోనా లాక్ డౌన్ ను దేశ విభజనతో పోల్చిన దర్శకుడు
రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను మూవీ నిర్మాణ సంస్థ టి-సిరీస్ విడుదల చేసింది. ట్రైలర్ లో ప్రధానంగా కరోనా లాక్ డౌన్ సమయంలో వసల కార్మికుల పరిస్థితులను కళ్లకుకట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటనతో ట్రైలర్ మొదలవుతుంది. వేలాది మంది వలస కార్మికులు తమ సొంతఊర్లకు వెళ్లడానికి బయలుదేరినపుడు వారిని అడ్డుకోవడం కోసం పోలీసులు వారిని కొట్టడం, కెమికల్ వాటర్ ను చల్లడం వంటి అంశాలను చూపించారు. ఇందులో రాజ్ కుమార్ రావు ఓ నిజాయితీ గల పోలీస్ అధికారిగా కనిపించారు. ట్రైలర్ లో రాజ్ కుమార్ ‘న్యాయం ఎప్పుడూ శక్తివంతుల చేతుల్లోనే ఉంటుంది, పేదవారికి చేసే న్యాయం వేరుగా ఉంటుంది’’ అనే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. అలాగే మూవీలో కృతికా కామ్రా జర్నలిస్ట్ గా కనిపించింది. ఆమె ఈ లాక్ డౌన్ పరిస్థితిను భారత్ లో జరిగిన 1947 విభజనతో పోల్చుతుంది. కరోనా సమయంలో కుల మత బేధాలు ఎలా ప్రభావం చూపాయో చూపించారు. తబ్లిఘి జమాత్ తర్వాత అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయనే పుకార్ల మధ్య పంకజ్ కపూర్ తన బస్సులోని పిల్లలను ముస్లిం పురుషులు ఇచ్చే ఆహారాన్ని తిననివ్వకపోవడం వంటి సన్నివేశాలు కూడా ఇందులో కనిపించాయి. ఈ మూవీ ట్రైలర్ మొత్తం బ్లాక్ ఆండ్ వైట్ లోనే చూపించారు.
Read Also: 37 ఏళ్ల తర్వా త డిగ్రీ పట్టా అందుకున్న ఆర్జీవీ, సూపర్ థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు వెల్లడి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)