News
News
X

Besharam Rang song : దీపిక గ్లామర్‌ను డామినేట్ చేసేలా షారుఖ్ - ఆ బాడీ ఏంటి బాసూ!?

షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న 'పఠాన్' సినిమాలో 'బేషరమ్ రంగ్...' సాంగ్ విడుదలైంది. అందులో దీపిక గ్లామర్ కంటే షారుఖ్ ప్యాక్డ్ బాడీ గురించి నెటిజన్లు మాట్లాడుతున్నారు. 

FOLLOW US: 
Share:

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వయసు ఎంత? 57 సంవత్సరాలు! అందులో దాచడానికి ఏమీ లేదు. అయితే, ఆయన అబద్ధం చెబుతున్నారనేది కొందరు నెటిజన్లు చెప్పే మాట! దానికి 'బేషరమ్ రంగ్...' (Besharam Rang Song) సాంగ్ కారణం! అసలు విషయంలోకి వెళితే...

షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ (Deepika Padukone) జంటగా రూపొందుతున్న సినిమా 'పఠాన్' (Pathan Movie). ఇందులోని తొలి పాట 'బేషరమ్ రంగ్...'ను సోమవారం విడుదల చేశారు. పాటలో దీపిక బికినీ, మోనోకినీలో కనిపించారు.

సాంగ్ కంటే ముందు దీపిక లుక్స్ రివీల్ చేస్తూ బికినీ స్టిల్స్ విడుదల చేశారు. అప్పుడు అందరూ ఆమె అందం గురించి మాట్లాడారు. సాంగ్ విడుదలైన తర్వాత మాత్రం షారుఖ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. 

57 ఏళ్ళ వయసులో షారుఖ్ ఫిజిక్ చూశారా?
'పఠాన్' కోసం షారుఖ్ ఖాన్ ఎయిట్ ప్యాక్ చేశారు. కండలు తిరిగిన దేహంతో 'బేషరమ్ రంగ్...' పాటలో కనిపించారు. 57 ఏళ్ళ వయసులో అలా కనిపించడం, అటువంటి బాడీ బిల్డ్ చేయడం షారుఖ్‌కు మాత్రమే సాధ్యమని అంటున్నారంతా! నెటిజన్లు ఆయన ఫిజిక్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ గురించి అందరూ మాట్లాడుతున్నారని, షారుఖ్‌ను చూడమని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

షారుఖ్ ఫిజిక్, ఆయన లుక్స్ దీపిక గ్లామర్‌ను డామినేట్ చేశాయి. 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రాల్లో వీళ్ళిద్దరి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు... వాళ్ళ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. 'పఠాన్' ఫస్ట్ సాంగ్ 'బేషరమ్ రంగ్...'లో కూడా షారుఖ్, దీపిక మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఓ పాటను విడుదల చేశారు. మరో పాటను కూడా ట్రైలర్ కంటే ముందు విడుదల చేయనున్నారు.

తెలుగులో కూడా 'బేషరమ్ రంగ్' సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. లైక్స్, కామెంట్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారనుకోండి.  

Also Read : మారుతి సినిమాలో ప్రభాస్ లుక్కు - రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు

తెలుగులోనూ జనవరి 25న 'పఠాన్' 
Pathaan Movie Telugu Release : 'పఠాన్'ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కంటే ఒక్క రోజు ముందు జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. 'వార్' వంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 'పఠాన్'ను నిర్మించింది. షారుఖ్, యశ్ రాజ్ ఫిల్మ్స్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. పైగా, ఆదిత్య చోప్రా నిర్మాణంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్స్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేశాయి. దానికి తోడు 'పఠాన్' ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. థియేటర్లలో ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Published at : 13 Dec 2022 09:20 AM (IST) Tags: deepika padukone Shah Rukh Khan Pathaan movie Besharam Rang

సంబంధిత కథనాలు

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?