Besharam Rang row: ‘పఠాన్’ మూవీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం - షారుఖ్ దిష్టిబొమ్మ దహనం చేసిన నిరసనకారులు
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే ఇప్పుడీ చిత్రానికి నిరసన సెగ తగులుతోంది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే ఇప్పుడీ చిత్రానికి నిరసన సెగ తగులుతోంది. ‘పఠాన్’లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, అందుకే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదు అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఈ సినిమా సమస్యల్లో ఇరుక్కున్నట్లైంది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసిన ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో షారుక్ ఖాన్ ‘పఠాన్’ ఒకటి. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ‘బేషరమ్ రంగ్’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ విడుదల అయిన దగ్గర నుంచీ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట లో దీపికా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. దీపికా-షారుక్ కెమిస్ట్రీ బాగా వైరల్ కావడంతో దీనిపై చర్చ మొదలైంది. తాజాగా ఈ పాటలో అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆరోపించారు. ఆ సన్నివేశాలను తొలగిస్తేనే సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామని, లేదంటే నిషేధిస్తామని హెచ్చరించారు.
ఈ పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ కాషాయం రంగులో ఉండటంతో ఈ సినిమాకు నిరసన సెగ మొదలైంది. మధ్యప్రదేశ్ లో వీర్ శివాజీ గ్రూప్ దీనిపై ఇండోర్ సిటీలో ‘పఠాన్’ కు వ్యతిరేకంగా నిరసన చేశారు. హీారో షారుక్ ఖాన్ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. సినిమాలపై ఇలా నిరసన సెగలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా హిందూ సంస్కృతిని దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్న సినిమాలపై హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అంతకముందు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా పై కూడా హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో హిందూ దేవతలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపించాయి. దీనిపై నిరసనకు కూడా దిగారు. తప్పును సరిదిద్దుకోకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ‘పఠాన్’ సినిమాపై హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపణలు మొదలైయ్యాయి. అయితే ఈ వివాదం పై ప్రస్తుతానికైతే చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.
కాగా దాదాపు మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. 2018 వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. తర్వాత కొన్ని కారణాల వలన సినిమా లేట్ అవుతూ వచ్చింది. అయితే ‘పఠాన్’ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుంచి సినిమాపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలైయ్యాయి. సోషల్ మీడియాలో కూడా మూవీను బహిష్కరించాలని కామెంట్లు చేశారు కొంతమంది నెటిజన్స్. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు