అన్వేషించండి
Beast Movie: విజయ్ 'బీస్ట్' ఫస్ట్ సింగిల్, 'అరబిక్ కుతు' సాంగ్ వచ్చేసిందోచ్
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
![Beast Movie: విజయ్ 'బీస్ట్' ఫస్ట్ సింగిల్, 'అరబిక్ కుతు' సాంగ్ వచ్చేసిందోచ్ Beast Movie First Single Arabic Kuthu Released Beast Movie: విజయ్ 'బీస్ట్' ఫస్ట్ సింగిల్, 'అరబిక్ కుతు' సాంగ్ వచ్చేసిందోచ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/14/c5d13b49d56773d89b97497f5dba3018_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'అరబిక్ కుతు' సాంగ్ వచ్చేసిందోచ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బీస్ట్'. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 'డాక్టర్'తో తెలుగులోనూ మంచి విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'బీస్ట్' సినిమాలో తొలి పాట 'అరబిక్ కుతు'ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి డిస్కషన్స్ చేస్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయింది.
తాజాగా పూర్తి పాటను విడుదల చేశారు. అరబిక్ స్టైల్ లో ఈ సాంగ్ ను డిజైన్ చేశారు. ఈ పాటను హీరో శివ కార్తికేయన్ రాయడం విశేషం. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడంతో పాటు ఈ అరబిక్ కుతు సాంగ్ కూడా పాడారు. ఆయనతో పాటు జోనియా గాంధీ గొంతు కలిపింది. సాంగ్ బీట్ చూస్తుంటే రిపీట్ మోడ్ లో వినేలా ఉంది. కచ్చితంగా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం ఖాయం.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు.
#ArabicKuthu - #BeastFirstSingle is out now!
— Sun Pictures (@sunpictures) February 14, 2022
▶ https://t.co/C7YrT4fz35@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @Siva_Kartikeyan @hegdepooja @jonitamusic @manojdft @Nirmalcuts #Beast
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion