Balu Gani Talkies: షకీలా పాపకు గుడి కటిస్తానంటున్న తాత - ఇంతకీ ఆమెతో కనెక్షన్ ఏంటో?
Aha Original Film: ‘బాలు గాని టాకీస్’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చింది ఆహా. ఈ సినిమాలోని తాతకు షకీలా పాప మీద ఉన్న ఇష్టాన్ని చూపిస్తూ వదిలిని ఓ వీడియో క్లిప్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Balu Gani Talkies New Update: తెలుగు ఓటీటీ సంస్థ ఆహా మరో సరికొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే ఆహా తెరకెక్కించిన పలు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘కొత్త పోరడు’, ‘భామ కలాపం’, ‘కలర్ ఫొటో’ లాంటి సినిమాలు అందరినీ అలరించాయి. ఆహా సమర్పణలో తెరకెక్కిన ‘బాలు గాని టాకీస్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శివ రామ్ చంద్రవరపు, శరణ్య శర్మ జంటగా నటిస్తున్నారు. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అలరించింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షకీలా డైహార్ట్ ఫ్యాన్ అంటూ సుధాకర్ రెడ్డికి సంబంధించిన ఓ క్లిప్ రిలీజ్ చేసింది ఆహా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాతకు షకీలా పాపకు లింకేంటి?
ఈ వీడియోలో సుధాకర్ రెడ్డి షకీలాకు డైహార్ట్ ఫ్యాన్ గా చూపించారు. ‘బాలు గాని టాకీస్’లో పడే ప్రతి షకీలా సినిమాను తాత కచ్చితంగా చూసి తీరుతాడు. ఊళ్లో అందరూ ఆయనను షకీలా తాత అని పిలుస్తారు. ‘డబ్బులు లేక ఆగిన కానీ, లేదంటే షకీలాకు గుడి కట్టించే వాడిని” అంటూ ఆయన చెప్పే డైలాగ్ అకట్టుకుంటోంది. ఈ స్పెషల్ వీడియో సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
View this post on Instagram
అక్టోబర్ 4 నుంచి నేరుగా ఆహాలో స్ట్రీమింగ్
ఇక ‘బాలు గాని టాకీస్’ మూవీ అక్టోబర్ 4న నేరుగా ఓటీటీలోకి విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 13నే విడుదల అవుతుందని ఆహా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాలతో అక్టోబర్ 4ను వాయిదా వేసింది. మా ‘బాలు గాని టాకీస్’లో అక్టోబర్ 4 నుంచి ఆటలు మొదలవుతాయి’ అంటూ రీసెంట్ గాసోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘బాలు గాని టాకీస్’ కథ ఏంటంటే?
‘బాలు గాని టాకీస్’ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో పేరు బాలు. అతడికి ఓ థియేటర్ ఉంటుంది. ఎప్పడూ థియేటర్లో బూతు బొమ్మలు నడిపిస్తుంటాడు. ఆయన బాలయ్యకు వీరాభిమాని. ఎలాగైనా తన థియేటర్లో బాలయ్య సినిమాను ఆడించాలి అనుకుంటాడు. ఇంతకీ అతడి ఆశ నెరవేరిందా? లేదా?. థియేటర్ కారణంగా అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనేది సినిమాఓ చూడాలి. ఇక ఈ సినిమాలో రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదిత్య బీఎన్ మ్యూజిక్ అందిస్తున్నారు.