News
News
X

Balakrishna: 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 2 - బాలయ్య ఎంత డిమాండ్ చేశారంటే?

బాలయ్య హోస్ట్ చేయడం వలనే 'ఆహా'కి సబ్ స్క్రిప్షన్లు 15 లక్షల వరకు పెరిగాయని అంచనా.

FOLLOW US: 
 
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదటి నుంచి సరికొత్త షోలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. అన్నిటికంటే 'అన్ స్టాపబుల్'(Unstoppable) షో పెద్ద హిట్ అయింది. తొలిసారి బాలయ్య హోస్ట్ చేసిన షో కావడంతో దీనిపై విపరీతమైన బజ్ వచ్చింది. బాలయ్య లాంటి అగ్ర హీరో మిగిలిన స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ షోకి భారీ పాపులారిటీ వచ్చింది. ఈ ఒక్క షో చూడడానికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కో సెలబ్రిటీని బాలయ్య హ్యాండిల్ చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన పంచ్ లు, జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.

ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో రెండో సీజన్‌కు బాలకృష్ణ, ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు. రీసెంట్ గానే దీనికి సంబంధించిన టీజర్ ని వదిలారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి బాలయ్య ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మొదటి సీజన్ కి బాలయ్య కేవలం రెండున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారని టాక్. అప్పటికి ఆ షో ఇంపాక్ట్ బాలయ్యకు తెలియదు. 

అందుకే ఆయన తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే బాలయ్య హోస్ట్ చేయడం వలనే 'ఆహా'కి సబ్ స్క్రిప్షన్లు 15 లక్షల వరకు పెరిగాయని అంచనా. ఇప్పుడు సీజన్ 2 కోసం బాలయ్య కాస్త భారీ రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ఫైనల్ కాలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

మరి బాలయ్య అడిగినంత ఇస్తారా..? లేక బేరం సాగిస్తారా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎలా లేదన్నా.. బాలయ్యకు ఐదారు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కూడా సబ్ స్క్రిప్షన్లు బాగా పెరుగుతాయని ఆహా ఆశిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆహా క్రేజ్ కాస్త తగ్గింది. సబ్ స్క్రిప్షన్లు కూడా బాగా తగ్గాయట. 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 2తో మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 

News Reels

మొదటి గెస్ట్ ఎవరంటే..?

ఫస్ట్‌ గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసక్తికరమైన క్వశ్చన్స్‌తో గెస్ట్‌లను తికమక పెట్టే బాలయ్య... తన వియ్యంకుడు, పార్టీ అధినేతను ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగి ఉంటుంది. పార్టీతో పాటు చంద్రబాబు వ్యక్తిగత విషయాలు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనివి ఏమైనా అడిగి ఉంటారా అనేది కూడా టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్‌ పేరుతో ఆనాటి అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని ఏమైనా టచ్ చేసి ఉంటారా... భవిష్యత్‌లో పార్టీలో జరగబోయే మార్పులు గురించి అడిగి ఉంటారా అనేది చూడాల్సి ఉంది.  

నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు, మరోవైపు  రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి అలరించిన  సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది.

Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?

Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Published at : 06 Oct 2022 03:52 PM (IST) Tags: Balakrishna Unstoppable 2 Balakrishna remuneration

సంబంధిత కథనాలు

Karthika Deepam December 6th Update: కార్తీక్ దగ్గర నిజం దాచిన డాక్టర్ చారుశీల, సౌందర్య దగ్గరకు బయలుదేరిన దీప-కార్తీక్

Karthika Deepam December 6th Update: కార్తీక్ దగ్గర నిజం దాచిన డాక్టర్ చారుశీల, సౌందర్య దగ్గరకు బయలుదేరిన దీప-కార్తీక్

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

Gruhalakshmi December 6th: వీరనారి అవతారమెత్తిన తులసి- భాగ్య ఐడియా, లాస్యకి షాకిచ్చిన నందు

Gruhalakshmi December 6th: వీరనారి అవతారమెత్తిన తులసి- భాగ్య ఐడియా, లాస్యకి షాకిచ్చిన నందు

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Ennenno Janmalabandham December 6th: ఆదిత్య చెంప పగిలింది, నిజం తన్నుకొచ్చింది- వేద చేసిన పనికి యష్, మాళవిక షాక్

Ennenno Janmalabandham December 6th: ఆదిత్య చెంప పగిలింది, నిజం తన్నుకొచ్చింది-  వేద చేసిన పనికి యష్, మాళవిక షాక్

టాప్ స్టోరీస్

Telangana Cabinet Meeting: డిసెంబర్ 10న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే కీలకాంశాలు ఇవే

Telangana Cabinet Meeting: డిసెంబర్ 10న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే కీలకాంశాలు ఇవే

జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్

జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్

Siddipet News: డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆటోడ్రైవర్ ఆత్మహత్య, కౌన్సిలరే కారణమంటూ సెల్ఫీ వీడియో!

Siddipet News: డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆటోడ్రైవర్ ఆత్మహత్య, కౌన్సిలరే కారణమంటూ సెల్ఫీ వీడియో!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!