News
News
X

Balakrishna Daughter: నిర్మాతగా మారనున్న బాలయ్య కూతురు!

బాలకృష్ణ కుమార్తె తేజస్విని 'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

FOLLOW US: 
 
ఆహా ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ చేస్తున్న 'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టాక్ షోస్ అందు 'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షో వేరు అన్నట్టు రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు రెండో సీజన్ టెలికాస్ట్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ గెస్ట్ లుగా వచ్చారు. రెండో ఎపిసోడ్ కి విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా రానుంది. ఈ షో సక్సెస్ వెనుక చాలా మంది కష్టం ఉంది. వారిలో బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా ఉన్నారు.

బాలకృష్ణ కుమార్తె తేజస్విని 'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల నిర్వహణలో బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ఎంత విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణి ఎప్పుడూ, ఎక్కడా ఎక్కువగా మాట్లాడింది లేదు. సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ‌తారు. ఇప్పుడు బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా అదే బాటలో నడుస్తున్నారు. సైలెంట్‌గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు.

'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షోకు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ అయినప్పటికీ... ఆమె గురించి బాలకృష్ణ కూడా షోలో గానీ, బయట గానీ చెప్పలేదు. అసలు... ఇప్పటి వరకూ బాలకృష్ణ కుమార్తెకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. సైలెంట్‌గా వ‌చ్చిన‌ తేజస్విని తొలి స్టెప్‌లోనే... సక్సెస్ ఫుల్ అయ్యారు. 'అన్‌స్టాప‌బుల్‌' షో గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ బాలకృష్ణ లుక్, ఆయన స్టైల్, స్పాంటేనియస్‌గా ఆయ‌న వేసే పంచ్ డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. దీని వెనుక ఉన్న క్రియేటివ్ మైండ్స్‌లో తేజస్విని కూడా ఒకరు అన్నమాట. 

ఇప్పుడు తేజస్విని నిర్మాతగా మారబోతున్నట్లు సమాచారం. తన తండ్రి బాలకృష్ణ హీరోగా తేజస్విని ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే డైరెక్టర్ ని ఫైనల్ చేయబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా.. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తరువాత బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయబోతున్నారు బాలయ్య. 

News Reels

బోయపాటితో పొలిటికల్ డ్రామా:

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. గతేడాది 'అఖండ'(Akhanda) సినిమాతో రికార్డులు సృష్టించిన వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. 2024 ఎన్నికల కంటే ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సినిమాను నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. బోయపాటి మాత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. 2023లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. పవర్ ఫుల్ మాస్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను 2024 సమ్మర్ కి రిలీజ్ చేయాలనేది ప్లాన్. 

Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?

Published at : 15 Oct 2022 05:31 PM (IST) Tags: Balakrishna Unstoppable Balakrishna Daughter Tejaswini

సంబంధిత కథనాలు

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు