NBK107: బాలయ్య, గోపీచంద్ సినిమా - టైటిల్ ఇదేనా?
నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశారు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.
ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం. నిజానికి నందమూరి ఫ్యాన్స్ జూన్ 10న NBK107 టీజర్ వస్తుందని అనుకున్నారు. కానీ టైటిల్ అనౌన్స్ చేయాలనీ భావిస్తున్నారు మేకర్లు. చాలా రోజులుగా దీనికి 'జై బాలయ్య' అనే టైటిల్ పెడతారని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పుడు మరో టైటిల్ వినిపిస్తోంది.
'అన్నగారు', 'వీర సింహారెడ్డి' వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి 'రెడ్డిగారు' కూడా వచ్చింది చేరింది. 'రెడ్డిగారు' అనే టైటిల్ ను దాదాపు ఖాయం చేసినట్లుగా సమాచారం. ఇదే టైటిల్ ను బాలయ్య బర్త్ డే రోజు అనౌన్స్ చేస్తారట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?
Also Read: టెన్త్ ఫెయిల్ అయిన మంత్రి గన్ బిల్ పాస్ చేస్తే? - లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌డే' టీజర్ చూశారా?
View this post on Instagram