News
News
X

నాగ శౌర్య-అనూష శెట్టి వెడ్డింగ్ కేక్ వెనుక ఇంత కథ ఉందా? అసలు విషయం చెప్పిన బేకరీ యజమాని !

నాగశౌర్య- అనూష శెట్టి వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్లో నిన్న(నవంబర్ 20న) ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ సందర్భగా కట్ చేసిన కేక్ వెనుక చాలా పెద్ద కథ ఉన్నట్లు తాజాగా బేకరీ యజమాని వెల్లడించారు.

FOLLOW US: 
 
నాగ శౌర్య-అనూష శెట్టి వెడ్డింగ్ కేక్ వెనుక పెద్ద కథే ఉంది!  

టాలీవుడ్ నటుడు నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల నడుమ ఈ పెళ్లి వేడుక జరిగింది. పురోహితుల వేద మంత్రాల నడుమ నాగశౌర్య, అనూష మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. అంతకు ముందు రోజు అంటే  నవంబర్ 19న బెంగుళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ లో మెహందీ, కాక్‌ టెయిల్ నైట్‌ను నిర్వహించారు. ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పార్టీకి హాజరైన వారంతా ఆటా పాటలతో ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో భాగంగా నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. మూడు స్టెప్స్ కలిగిన ఈ కేక్ పార్టీకి హాజరైన వారిని ఎంతో ఆకట్టుకుంది.

View this post on Instagram
 
A post shared by Shubha Kushalappa (@delightfills)

News Reels

కేవలం ఒకరోజు ముందే కేక్ కోసం ఆర్టర్

తాజాగా ఈ కేకు తయారీ కోసం తాము పడ్డ శ్రమ గురించి బేకర్ శుభ కుశలప్ప వెల్లడించారు. కాక్ టెయిల్ పార్టీకి కేవలం ఒక రోజు ముందే కేక్ కు ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఫ్యాన్సీ కేక్ ను తయారు చేయడం సాధ్యం కాదన్నారు. అయితే, అనూషతో తమకు ఉన్న సత్సంబంధాల కారణంగా కాదనలేకపోయినట్లు ఆమె వెల్లడించారు.   

అనూష మాట కాదనలేక కేక్ తయారు చేశాం!

ఈ కేక్ గురించి ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. “తెలుగు నటుడు నాగశౌర్య,  అతడికి కాబోయే సతీమణి  అనూష శెట్టి వెడ్డింగ్ కేక్ కోస కేవలం ఒకరోజు ముందే ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు మేము చాలా హడావిడిగా ఉన్నాం.  వధువు కొంత కాలంగా మా క్లయింట్‌. అయినా, ఒక్క రోజులో ఇలాంటి కేక్ తయారు చేయడం అంత సులువైన విషయం కాదు.  అయినా, మేము తనకు నో చెప్పలేకపోయాం.  పార్టీ డిస్కో డెకరేషన్ కు సరిపోయేలా ఈ పింక్ కేక్ ను రూపొందించడంలో సాయం చేసిన మా టీమ్ కు కృతజ్ఞతలు” అని శుభ కుశలప్ప తెలిపారు.   

View this post on Instagram
 
A post shared by Shubha Kushalappa (@delightfills)

ఇక నాగ శౌర్య,  అనూష శెట్టి నవంబర్ 20 న ఉదయం 11:25 గంటలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు.కుటుంబ సభ్యులు, కొంత మంది బంధు, మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

Read Also: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగశౌర్య-అనూష, నెట్టింట వైరల్ అవుతున్నవెడ్డింగ్ వీడియో!

Published at : 21 Nov 2022 11:45 AM (IST) Tags: Naga Shaurya Anusha Shetty Naga Shaurya-Anusha Shetty wedding wedding cake story

సంబంధిత కథనాలు

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు - ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు -  ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

RRR Box Office Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?

RRR Box Office Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

టాప్ స్టోరీస్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

IND vs BAN 1st ODI: భారత్ తో తొలి వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!