News
News
X

Nagashourya wedding:మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగశౌర్య-అనూష, నెట్టింట వైరల్ అవుతున్నవెడ్డింగ్ వీడియో!

హీరో నాగశౌర్య పెళ్లైపోయింది. బెంగళూరుకు చెందిన అనూష మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

అట్టహాసంగా నాగశౌర్య-అనూష వివాహ వేడుక

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచాడు. కాసేపటి క్రితం వీరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. పురోహితుల ఆశీర్వచనాల నడుమ ఇద్దరూ ఒక్కటయ్యారు.  బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన బంధు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం నాగశౌర్య – అనూష వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నూతన దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Uma mahesh (@gum_921)

News Reels

కలర్ ఫుల్ గా హల్దీ వేడుకలు

ఇక పెళ్లి వేడుకలో భాగంగా నిన్న(నవంబర్ 19న) హల్దీ సెలబ్రేషన్ కలర్ ఫుల్ గా జరిగింది. అనంతరం కాక్ టెయిల్ పార్టీ జరిగింది. ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన బంధు, మిత్రులు పాల్గొన్నారు. హల్దీ వేడుకలో భాగంగా  అనూష నాగశౌర్య బంగారు ఉంగరాన్ని తొడిగాడు. కుటుంబ సభ్యులు, వధూవరుల మిత్రుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది.  హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. నాగశౌర్య- అనూష జోడీ చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.

బెంగళూరులో అనూష చాలా ఫేమస్

కొద్ది రోజుల క్రితమే తన  పెళ్లి విషయాన్ని నాగశౌర్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. బెంగళూరుకు చెందిన అనూషను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు. ఇక  అనూష విషయానికి వస్తే, తను బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్ గా ఉన్నారు. సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్థాపించారు. ఆమె కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి కూడా.  బెంగళూరులో అనూషతో నాగశౌర్యకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా, ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం చెప్పారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి బెంగళూరు వేదికగా జరుగుతోంది.

సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్న నాగశౌర్య

ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ సంవత్సరం ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవానికి నాగశౌర్య విజయం, పరాజయంతో సంబంధం లేకుండా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు.  సొంత బ్యానర్ లోనే నాగశౌర్య ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన కెరీర్ లో ‘శౌర్య’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పెళ్లి తర్వాత నాగ శౌర్య మరికొన్ని ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉంది.  

Read Also: నాగశౌర్య వరుడయ్యాడు, ఈ రోజే పెళ్లి - హల్దీ వేడుక ఫొటోలు వైరల్

Published at : 20 Nov 2022 01:17 PM (IST) Tags: Wedding Ceremony Naga Sourya Naga Shourya anush shetty Anusha Shetty Naga Shorya Wedding Naga Sourya Wedding

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Rajahmundry News : రాజమండ్రిలో జగనన్న సాంస్కృతిక సంబరాలు, స్టెప్పులతో హోరెత్తించిన మంత్రి రోజా!

Rajahmundry News : రాజమండ్రిలో జగనన్న సాంస్కృతిక సంబరాలు, స్టెప్పులతో హోరెత్తించిన మంత్రి రోజా!

AP Minister Appalraju : ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు - కీలక ప్రకటన చేసిన మంత్రి అప్పలరాజు !

AP Minister Appalraju :  ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు - కీలక ప్రకటన చేసిన మంత్రి అప్పలరాజు !