Acharya Song: అయ్యోరింటి సుందరి... వయ్యారాల వల్లరి... నీలాంబరి!
'ఆచార్య' సినిమాలో తొలి పాట 'లాహే... లాహే... లాహే...'ను విడుదల చేసి చాలా రోజులైంది. ఇప్పుడు రెండో పాట 'నీలాంబరి...'ని విడుదల చేశారు. రామ్ చరణ్, పూజా హెగ్డేపై ఈ పాటను తెరకెక్కించారు.
'నీలాంబరి... నీలాంబరి...' అంటూ పూజా హెగ్డేను చూసి పాడుతున్నారు రామ్ చరణ్. వీళ్లిద్దరూ జంటగా కనిపించనున్న చిత్రం 'ఆచార్య'. తండ్రి చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో తొలి పాట 'లాహే... లాహే...'ను కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. రెండో పాట 'నీలాంబరి...'ని ఈ రోజు (శుక్రవారం) విడుదల చేశారు.
#Neelambari Song Out Now ❤️
— Konidela Pro Company (@KonidelaPro) November 5, 2021
Fall in Love with #Manisharma's Magic 🎶
▶️ https://t.co/JKzLZEMO52#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja @anuragkulkarni_ @iamRamyaBehara #AnanthaSriram @MatineeEnt @KonidelaPro pic.twitter.com/oZdGMJMl5i
'నీలాంబరి... నీలాంబరి... అయ్యోరింటి సుందరి... వయ్యారాల వల్లరి... నీలాంబరి' అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహరా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. రామ్ చరణ్, పూజా హెగ్డే నటించిన రెండో గీతమిది. ఇంతకు ముందు రామ్ చరణ్ 'రంగస్థలం' చిత్రంలో ప్రత్యేక గీతం 'జిల్ జిల్ జిగేలు రాణి...'లో పూజా హెగ్డే సందడి చేసిన సంగతి తెలిసిందే. అది మాస్ సాంగ్ అయితే... 'నీలాంబరి' క్లాస్ సాంగ్. ఇందులో చరణ్, పూజా లుక్స్ కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి. సాహిత్యాన్ని బట్టి పూజా హెగ్డే బ్రాహ్మణ యువతిగా కనిపించనున్నారని అర్థమవుతోంది. హీరోను 'ఓ పూజారి' అని హీరోయిన్ అనడం గమనార్హం. లిరికల్ వీడియోలో చూపించిన రామ్ చరణ్ స్టెప్స్ క్లాస్ గా ఉన్నాయి. సాంగ్ వింటుంటే... వింటేజ్ మణిశర్మ గుర్తు రావడం ఖాయం. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో సాంగ్ తెరకెక్కించారు.
రామ్ చరణ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానుంది.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి