Avatar 2 twitter review: ’అవతార్-2’ ఆడియన్స్ రివ్యూ: 13 ఏళ్ల నిరీక్షణ ఈ విజువల్ వండర్ - జేమ్స్ కామెరాన్ మళ్లీ మెస్మరైజ్ చేశారా?
‘అవతార్-2’ సీక్వెల్ వచ్చేసింది. థియేటర్లలో దుమ్మురేపుతోంది. అంతర్జాతీయ మీడియాలో ఈ మూవీపై మిశ్రమ స్పందన వచ్చింది. మరి, ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దామా.
జేమ్స్ కామెరాన్.. ఈ పేరు వింటే మన కళ్ల ముందు ‘టెర్మినేటర్’ మూవీ సీరిస్, ‘టైటానిక్’ వంటి అద్భుతమైన సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాలు ఇప్పటికీ కళ్లల్లో కదలాడుతూనే ఉంటాయంటే.. దాన్ని ఎంత చక్కగా స్క్రీన్‌పై ప్రజంట్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వాటిని సినిమాలు అనడం కంటే విజువల్ వండర్స్ అనడమే కరెక్ట్. అయితే, ఆ అద్భుతాలకు మించిన మరో అద్భుతాన్ని సృష్టించడం జేమ్స్ కామెరాన్ వల్లే సాధ్యమైంది. అదే ‘అవతార్’. 13 ఏళ్ల కిందట రికార్డుల వరద పారించిన ‘అవతార్’ సీక్వెల్ మరోసారి బాక్సాఫీసులను బద్దలకొట్టేందుకు వచ్చేసింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లో కూర్చొన్న ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట. మరి ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏమేమి అనుకుంటున్నారో చూసేద్దామా.
3 hours 15 mins of Visual Treat.
— Mahesh (@Mahe687) December 16, 2022
The theme is kept same. But this time a more touching storyline. #AvatarTheWayOfWater #Avatar2 #Avatar pic.twitter.com/hEq9UnwMNV
#Avatar2
— Mr V (@TheNameIsVinay) December 16, 2022
Vanda- blockbuster - sequel - repeatuu 💥💥🔥🔥🔥 pic.twitter.com/RX5P6XHgPH
#AvatarTheWayOfWater:⭐⭐⭐⭐
— MeeT HinsU (@meet_hinsu) December 16, 2022
ONE WORD REVIEW - A VISUAL TREAT BONANZA 🌌.
NOTE: Watch it in 3D and take most centre seat of theatre and enjoy.#Avatar2 #Avatar3D #AvatarReview#VFXBreathtaking
#AvatarTheWayOfWater : Halfway through the film. Technically it's top notch and the way #JamesCameron narrates the story is absolutely good. Looking forward to watching the latter half. #Avatar2 https://t.co/GH5Cw1l1IW
— ㉿ (@eskoosme) December 16, 2022
#Avatar2 - Spectacular visuals & action are a treat. But lacks freshness in drama & wow factor for a sequel. Unlike part1, strong scenes & struggle b/w science & emotions are missing. Nevertheless, worth 4 its visuals (IMAX please)
— Viswa (@Vish_Rish) December 16, 2022
YouTube 1 Min. Review
📎https://t.co/6VgurA2j5M pic.twitter.com/F6wLFld5mF
Blockbuster avatar2
— sravanthi srav (@sravanthi_srini) December 16, 2022
James Cameron sir thanks for these wonderfull treat ☺#Avatar2xZeeNuNew #Avatar2 #AvatarElCaminoDelAgua #Avatar #Avatar2AtPVR #AvatarTheWayOfWater #Avatar2SpecialScreening pic.twitter.com/aXrj0LbCtV
Gawdamn! #Avatar2 is one hell of a movie. My initial thoughts and reactions will be in my Theater Review I’ll be posting shortly.
— VaiN Sensei (@SenseiFaneto) December 16, 2022
This movie is incredible and beautiful I actually enjoyed the 3D. The things I don’t like about this movie are outshined by the things I love. pic.twitter.com/QwwzfkjNXu
‘అవతార్-2’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:
❤ 1994లోనే జేమ్స్ కామెరూన్ అవతార్‌ను రాయడం ప్రారంభించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి.
❤ 1997లో టైటానిక్ పూర్తయ్యాక అవతార్‌ను తీసి.. 1999లో రిలీజ్ చేయాలనేది కామెరూన్ ప్లాన్. దానికి అప్పట్లోనే 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు.
❤ కానీ, అప్పట్లో ఉన్న టెక్నాలజీతో ‘అవతార్’ను అనుకున్నట్లు తీయలేనని కామెరూన్‌కు అర్థమైంది. అందుకే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మొదలు పెట్టారు.
❤ అవతార్ సినిమా షూటింగ్ కేవలం 62 రోజులు మాత్రమే జరిగింది. ఇందులో 31 రోజులు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించగా.. మరో 31 రోజులు లైవ్ యాక్షన్ ఫొటోగ్రఫీ ద్వారా తీశారు.
❤ ఓ సారి పండోరా వరల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక అప్ గ్రేడ్ చేసుకుంటూ వెళుతూ వస్తున్నారు. అలా ‘అవతార్ 2’ కోసం ప్రత్యేకంగా ఓ వాటర్ వరల్డ్ క్రియేట్ చేశారు.
❤ అవతార్ 2 RealD 3D, Dolby Cinema, IMAX, IMAX 3D, Dolby Vision ఫార్మాట్స్ లో విడుదలవుతోంది.
❤ లండన్ లో డిసెంబర్ 6న ప్రీమియర్ అయ్యింది సినిమా. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ డేట్ మాత్రం డిసెంబర్ 16. లండన్ ప్రీమియర్ షో చూసిన వాళ్లంతా తమ జీవితంలో ఇదో అద్భుతమంటూ ‘అవతార్ 2’ను ప్రశంసిస్తున్నారు.
❤ అవతార్ అనగానే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింత వింత జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
❤ అయితే జేమ్స్ కామెరూన్ చాలా సినిమాల్లో చూసిన లొకేషన్లు, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమేషన్ సినిమాల్లో చూసిన ప్రదేశాలు ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. వాటి ఆధారంగానే పండోరాను డిజైన్ చేశారు. ‘అవతార్’తో పోల్చితే.. ‘అవతార్-2’ మరింత అద్భుతంగా ఉందనే టాక్ నడుస్తోంది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి.
Also Read: ‘అవతార్ 2’కు ఎందుకంత క్రేజ్ - ఈ 10 విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ పక్కా!