Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!
జేమ్స్ కామరూన్ అద్భుత దృశ్యకావ్యం 'అవతార్ 2' కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
![Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్! Avatar The Way Of Water is off to a great start by selling over 15,000 tickets within 3 days Avatar 2 advance bookings Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/c1c726fe3edb946c3963bb8d3cd6fcbb1669452095621313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'అవతార్' అనేది భారతీయ ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేని సినిమా పేరు. ఉత్తరాది, దక్షిణాది అని తేడాలు లేకుండా అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన పండోరా గ్రహం, అక్కడి మనుషులు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇప్పుడు 'అవతార్'కు సీక్వెల్ వస్తోంది. డిసెంబర్ 16న విడుదల కానున్న 'అవతార్ 2' (Avatar 2) కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
డిసెంబర్ 16న 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' (Avatar The Way Of Water) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కేవలం మూడు అంటే మూడు రోజులలో 45 స్క్రీన్‌లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మాట్స్ టిక్కెట్లు సేల్ అవ్వడం విశేషం. స్క్రీన్స్ పెంచాలని, ఇంకా మరిన్ని థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. మిగతా థియేటర్లలో ఎప్పుడు సినిమా టికెట్స్ సేల్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు.
హాలీవుడ్ సినిమాకు
ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్!
ఇండియాలో హాలీవుడ్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ హిస్టరీ చూస్తే... 'అవతార్ 2'కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తారని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసినా సరే... ఈ స్థాయిలో మరో సినిమాకు టికెట్స్ బుక్ కాలేదని చెప్పవచ్చు. 'అవతార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్ వంటి ముల్టీప్లెక్స్ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆరు భాషల్లో... ఇండియాలో!
ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం... దేశంలో ఆరు భాషల్లో 'అవతార్ 2' విడుదల కానుంది. ఐమ్యాక్స్, 2డీ, 3డీ, 4డీఎక్స్ ఫార్మాట్స్‌లో మూవీని చూడొచ్చు. ఐమ్యాక్స్ స్క్రీన్లు లేని నగరాల్లో ప్రేక్షకులు కొందరు ఇతర నగరాలకు వెళ్లి సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారట.
షాక్ ఇచ్చిన టికెట్ రేట్లు!
'అవతార్ 2'పై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో... టికెట్ రేట్స్ అంత షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. బెంగళూరులోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ థియేటర్‌లో రూ. 1,450... పుణెలో రూ. 1200, ఢిల్లీలో రూ. 1000, ముంబైలో రూ. 970, కోల్‌కతాలో రూ. 770, అహ్మదాబాద్‌లో రూ. 750, ఇండోర్‌లో రూ. 700, హైదరాబాద్‌లో రూ. 350, విశాఖలో రూ. 210... ఈ విధంగా టికెట్ రేట్స్ ఉన్నాయి.
'అవతార్' వచ్చి పదమూడేళ్ళు!
'అవతార్' వచ్చి పదమూడేళ్ళ. ఆ సినిమా 2009లో విడుదలైంది. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. సుమారు 250 మిలియన్ డాలర్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఆ సినిమా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. పదమూడేళ్ళ తర్వాత సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నా... ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా ఉండటం విశేషం. దీనికి ఏ స్థాయిలో వసూళ్ళు వస్తాయో చూడాలి.
Also Read : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)