News
News
X

Ashneer Grover On Kiara Advani: కియారా వల్ల విడాకులయ్యేవే - భారత్‌పే ఫౌండర్ షాకింగ్ కామెంట్స్

నటి కియారా అద్వానీ వల్ల తనకు దాదాపు విడాకులు అయ్యేవేనంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు ఆష్నీర్ గ్రోవర్.

FOLLOW US: 
Share:

సినీ బ్యూటీ కియారా అద్వానీకి.. భారత్‌ పే సహ వ్యవస్థాపకుడిగా ఎదిగి కోట్లు సంపాదించిన వ్యాపారవేత్త ఆష్నీర్ గ్రోవర్‌ విడాకులకు ఏం సంబంధం అనుకుంటున్నారా? ఈ మాటను స్వయంగా ఆష్నీర్ గ్రోవరే ఒకానొక సందర్భంలో వెల్లడించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఆష్నీర్ తన జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఆ పుస్తకానికి డోగ్లాపన్‌ అనే పేరు పెట్టి ఇటీవల మార్కెట్‌లో విడుదల చేశాడు. ఈ పుస్తకంలో తాను భారత్‌ పే స్టార్టప్‌ను ఎలా స్థాపించాడు.. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో వివరిస్తూ వ్యక్తిగత విషయాలను కూడా ఫన్నీగా రాసుకొచ్చాడు. ఇందులో కియారాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన విడాకులకు కియారా దాదాపు ఎలా కారణమైందో తెలిపాడు. 

‘‘నేను ‘భారత్‌ పే’ కోసం రాత్రి పగలు కష్టపడేవాడిని. షార్క్‌ ట్యాంక్ కోసం రోజూ జర్నీలు చేయాల్సి వచ్చేది. వారం మొత్తంలో నేను పనిలో లీనమైపోయి, వారాంతాల్లో షార్క్‌ ట్యాంక్‌ షూటింగ్‌కి వెళ్లేవాడిని. దాంతో నేను బిజీ అయిపోయానని, పెద్దవాడిని అయిపోయానని ఇంట్లోవారిని పట్టించుకోవడం లేదని మా అమ్మ నాకు ఫోన్ చేసి బాధపడింది. ఓసారి నా ఆఫీస్‌ దగ్గరికి నాలాగే ఓ స్టార్టప్‌ స్థాపించిన నా స్నేహితుడు వచ్చాడు. అప్పుడు నా భార్య మాధురి నా స్నేహితుడుని పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌ అని అడిగింది. దానికి అతను ఓ పేరు మోసిన పెళ్లిళ్ల బ్రోకర్‌ను సంప్రదిస్తున్నానని, పెళ్లి చేసుకోవడానికి కియారా అద్వానీ సరైనదని అన్నాడు. దాంతో నేను మాటవరుసకు ఇప్పుడు మార్కెట్‌ చాలా మారిపోయింది. ఒకవేళ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తే కియారానే చేసుకుంటాను అని నా భార్య ముందు అనేశాను. దాంతో నా భార్యకు ఒళ్లు మండిపోయింది. చాలా సేపటి వరకు నాతో అసలు మాట్లాడలేదు’’ అని తన జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటన గురించి రాసుకొచ్చాడు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. పైగా కియారా, ఆష్నీర్‌ గ్రోవర్.. అతని విడాకులు అని క్యాప్షన్‌ ఇవ్వడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

‘షార్క్‌ ట్యాంక్‌’ అనే టెలివిజన్‌ రియాల్టీ షోతో ఆష్నీర్ పేరు మారుమోగిపోయింది. ఈ రియాల్టీ షో మొదటి సీజన్‌కి ఆష్నీర్‌ జడ్జిగా వ్యవహరించాడు. అతని కామెడీ టైమింగ్‌ షోకి బాగా కలిసి రావడంతో అతనికి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు సీజన్‌ 2కు మాత్రం అతడిని జడ్జిగా చేయడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు ఆష్నీర్‌ను హిందీ ‘బిగ్‌బాస్‌’లో పాల్గొవాలని అడిగితే అతను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి కొన్ని రోజులు వార్తల్లో నిలిచాడు. లైఫ్‌లో ఫెయిలైన వాళ్లే బిగ్‌ బాస్ లాంటి షోస్‌కు వెళ్తారని ఒకవేళ తాను బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనాలంటే దానిని హోస్ట్‌ చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌ కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇవ్వాలని కామెంట్‌ చేశాడు.  

Also Read: ఆదిపురుష్ విషయంలో తప్పెక్కడ జరిగింది - క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన DOP - ముందే చూసుకుని ఉంటే?

Published at : 20 Jan 2023 12:30 PM (IST) Tags: Kiara Advani Kiara Shark Tank Ashneer Grover Bollywood

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?