April 2023 Releases: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
ఈ నెల(ఏప్రిల్)లో పలు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. రవితేజ ‘రావణాసుర’ మొదలుకొని, సమంత ‘శాకుంతంలం’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వరకు అభిమానులను అలరించనున్నాయి.
ఈ నెలలో భారీ బడ్జెట్ చిత్రాలు మొదలుకొని, చిన్న సినిమాల వరకు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సమ్మర్ కానుకగా సుమారు 10 సినిమాలు తెలుగులో విడుదల కానున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1.రావణాసుర- ఏప్రిల్ 7
మాస్ మహారాజ రవితేజ హీరోగా, యువదర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా 'రావణాసుర'. ఈ చిత్రంలో రవితేజ నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ అందాల విందు చేయనున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు.
2.మీటర్- ఏప్రిల్ 7
‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అదే జోష్ తో మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’ ఈ నెలలో విడుదలకానుంది. రమేష్ కడూరి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తోంది.
3.1947 ఆగష్టు 16- ఏప్రిల్ 7
దేశభక్తి నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.ఎస్ పొన్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్ కార్తిక్, రిచర్డ్ ఆస్టన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
4.శాకుంతలం- ఏప్రిల్ 14
సమంత రూత్ ప్రభు నటించిన ‘శాకుంతలం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నవల ఆధారంగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి.
5.రుద్రుడు- ఏప్రిల్ 14
దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ .. హీరోగానూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా 'రుద్రుడు'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా చేస్తోంది. . ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై కతిరేషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
6.విరూపాక్ష- ఏప్రిల్ 21
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ, కన్నడతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
7.నేను స్టూడెంట్ సర్- ఏప్రిల్ 21
బొల్లంకొండ గణేష్ నటిస్తున్న తాజా సినిమా 'నేను స్టూడెంట్ సర్'. ఈ సినిమాను 'నాంది' సినిమా మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకు దర్శకుడు రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా సతీశ్ వర్మ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భాగ్యశ్రీ కూతురు అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.
8.పొన్నియిన్ సెల్వన్ 2- ఏప్రిల్ 28
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌లో రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ సహా పలువురు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. తమిళం మొదటి భాగం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయినప్పటికీ, మిగతా భాషల్లో ఆశించిన స్థాయి స్పందన రాలేదు. రెండో భాగం ప్రేఓకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
9.హలో మీరా- ఏప్రిల్ 21
గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘హలో మీరా’. ఒకే ఒక పాత్రతో దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వంలో లక్ష్మణరావు దిక్కల, వర ప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
10.ఏజెంట్- ఏప్రిల్ 28
అఖిల్ అక్కినేని నస్తున్న తాజా సినిమా 'ఏజెంట్'. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
Read Also: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ